► ప్రత్యేక హోదా ఇవ్వబోమని స్పష్టం చేసిన కేంద్రం
► జిల్లా ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆక్రోశం
► మోదీ, చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టిన జనం
► జిల్లా ప్ర‘గతి’ ఇంతేనని ఆవేదన
ఎట్టకేలకు బీజేపీ బండారం బయటపడింది. చంద్రబాబు చెప్పేవి ఒట్టి మాటలేనని తేలింది. ఆయన చేతలు ఓటి కుండలేనని రుజువైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో జిల్లా ప్రజానీకం భగ్గుమంటోంది. అనుభవజ్ఞుడని నమ్మి ఓటేస్తే.. చేతకాని తనంతో నిండా ముంచాడని వాపోతోంది. ఆయనొస్తే బాగుం టుందని భావిస్తే రాష్ట్రాన్ని అథోగతి పాల్జేస్తున్నారని యువత మండిపడుతోంది. ఆయనొస్తే కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తే.. స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఆశలు అడియాశలయ్యాయని ఆందోళన చెందుతోంది. - సాక్షి నెట్‌వర్క్
అనుకున్నదే అయ్యింది.. భయపడిందే నిజమైంది. అవును.. నమ్మించి ముంచడంలో చంద్రబాబునాయుడుని మించిన వారు లేదని మరోసారి నిజమైంది. తన స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రం ముందు తలొంచిన ఏపీ సీఎం అలసత్వాన్ని మోదీ ప్రభుత్వం అక్షరాల క్యాష్ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని పార్లమెంట్ సాక్షిగా.. తేల్చేసింది. ఎంత మంది ఎన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చినా తాము తొలగ్గబోమని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్‌లో కుండబద్దలు కొట్టారు. దీంతో హోదాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లావాసులు భగ్గుమన్నారు. త మ ప్ర‘గతి’ ఇంతేనని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ దుస్థితి కారణమైన చంద్రబాబుకు శాపనార్థాలు పెట్టారు. ఇకపై కొత్త పరిశ్రమలు, పెట్టుబడిదారులు జిల్లాకు వచ్చే అవకాశం లేదని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతామని హెచ్చరించారు.
బాబు అసమర్థతే..
ఎన్నికల సమయంలో శ్రీవారి సన్నిధిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గుప్పిచ్చిన హామీలు ఏమయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చిచెప్పిడంలో చంద్రబాబు అసమర్థత బట్టబయలైంది. ఓటుకు-నోటు కేసులో జైలుకు పంపుతారన్న భయంతో చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్బాగ్యమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేని చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలి. -భూమన కరుణాకరరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ప్రత్యేక హోదా సంజీవని లాంటిది
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని లాంటిది. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం బాగు పడుతుంది. ఈ విషయం తెలిసినా సీఎం చంద్ర బాబు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఓటుకు నోటుతోపాటు పలు అవినీతి కుంబకోణాల్లో చంద్రబాబు చిక్కుకు పోవడం వల్ల కేంద్రంపై ఒత్తిడి తేలేకున్నారు. స్వార్థ కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్డారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇలాంటి సీఎం ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం. రాష్ట్ర విభజన ముందు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అడగలేక విభజించు పాలించు అన్నధోరణిలో బాబు రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. టీడీపీ, బీజేపీ దొందూ దొందే. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాయి. --డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, ఎమ్మెల్యే మదనపల్లె.
హోదా కోసం ఆందోళన
ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పినందున టీడీపీ, బీజేపీతో పొత్తును విరమించుకోవాలి. రాష్ట్రానికి హోదా లేకుంటే ఆశించినంత అభివృద్ధి ఉండదు. చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయకపోవడం వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. దీనిపై ప్రతి పక్షమైన వైఎస్సార్ సీపీ ప్రజలతో కలసి ఆందోళనకు దిగుతుంది.-చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే, పీలేరు
ఒట్టి మాటలే
Published Thu, May 5 2016 2:29 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement
Advertisement