లాభాల గని మూసివేత..!
కేటీకే-2 యూజీ స్థానంలో ఓసీపీ-2
ఇతర గనులకు కార్మికుల తరలింపు
ప్రక్రియ ముమ్మరం చేసిన యాజమాన్యం
కోల్‌బెల్ట్ : లాభాల బాటలో పయనిస్తున్న వరంగల్ జిల్లా భూపాలపల్లి కేటీకే-2 భూగర్భగని మూతపడనుంది. ఈ గనిని ఓపెన్‌కాస్టు-2 గా మార్చేందుకు యూ జమాన్యం రంగం సిద్ధం చేసింది. కంపెనీ విజ్ఞప్తి మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఓపెన్‌కాస్ట్ చేపట్టే ఏరియాలో గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావలసి ఉంది. సింగరేణి యాజమాన్యం, తెలంగాణ జెన్కో మధ్య 30 ఏళ్లపాటు జరిగిన కోల్ లింకే జీ ఒప్పందంతో గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లోని 500 మెగావాట్ల ప్లాంట్‌కు ప్రతి ఏటా 2.50 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయా ల్సి ఉంది. ఏరియాలోని భూగర్భగనుల నుంచి ప్రతి ఏటా 14 లక్షల టన్నులు, కేటీకే ఓసీ సెక్టార్-1 నుంచి 15 లక్షల టన్నుల బొగ్గు వెలికితీస్తున్నారు. ఒప్పందం ప్రకారం యూజమాన్యం భూపాలపల్లి, రామగుండం ఏరియాల నుంచి బొగ్గు సరఫరా చేస్తున్నది.
ఓసీపీ-2 ఆవశ్యకత
కేటీపీపీ విద్యుత్ ప్లాంట్‌కు సరిపడా బొగ్గు అం దించడానికి భూపాలపల్లిలోని కేటీకే-3 భూగర్భగనిని 2008లో ఓపెన్‌కాస్టు సెక్టర్-1గా మార్చారు. కేవలం 9.33 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయడానికి చేపట్టిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు 6.62 మిలియన్ టన్నులు తీశా రు. మిగిలిన 17 లక్షల టన్నుల బొగ్గును ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసే అవకాశముంది. ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు అందించడానికి కేటీకే-2 గనిని ఓసీపీగా మార్చేందుకు ప్లానింగ్ చేశారు. ఇప్పటివరకు కేటీకే-2 గనిలో 3 సీంలో 10 ఎస్డీఎల్ యం త్రాల ద్వారా 3.1 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీశారు. డిసెంబర్ నాటికి మరో 3 లక్షల టన్నులు తీయనున్నారు. గనిలోని 1, 2 సీంల లో ఉన్న 17 మిలియన్ టన్నుల బొగ్గును 11 సంవత్సరాలపాటు ఏటా 1.5 మిలియన్ టన్ను ల చొప్పున ఉత్పత్తి చేయడానికి ఓసీపీగా మార్చుతున్నారు.
కార్మికుల తరలింపు
కేటీకే-2 గనిలో 10 ఎస్డీఎల్ యంత్రాల ద్వారా 1300 మంది కార్మికులతో 3 సీంలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. డిసెంబర్ వరకు మాత్రమే గనిలో కార్మికులు పనిచేసే అవకాశాలున్నాయి. ఓసీపీ-2ను జనవరి 2017 నాటికి చేపట్టేందుకు అధికారులు చర్య ముమ్మరం చేశారు. ఇక్కడ పని చేస్తున్న కార్మికులతోపాటు ఎస్డీఎల్ యంత్రాలను కేటీకే-5, కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టుకు పంపించనున్నారు.
రెండేళ్లుగా లాభాలు
2013-14 ఆర్థిక సంవత్సరం గనిలోని 1 సీంలో బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. జి-5గ్రేడ్ బొగ్గు వెలికితీయడంతో సంస్థకు లాభాలు రాలేదు. పైగా నిర్దేశిత లక్ష్యం చేరుకోలేదు. 2014-15లో సింగరేణి వ్యాప్తంగా రెండు గనులు మాత్రమే లాభాల బాట పట్టారుు. అందులో కేటీకే-2 గని స్థానం దక్కించుకుంది. సుమారు రూ.2కోట్ల లాభాలు వచ్చారుు. భూపాలపల్లి ఏరియాకు 2015-16 ఆర్థిక సంవత్సరం రూ.98 కోట్ల నష్టాలు వచ్చారుు. అండర్‌గ్రౌండ్ గనుల జాబితాలో కేటీకే-2 గని మాత్రమే రూ.రెండు కోట్ల లాభాలతో నిలిచింది. ఉత్పత్తి వ్యయం సైతం టన్నుకు రూ.227 తగ్గించుకుంది. అలాంటి గనిని ఓసీగా మార్చటం పట్ల కార్మకులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం గనిలో ఉన్న 1340 మంది కార్మికులలో సుమారు 1000 మందిని ఇతర గనులకు బదిలీ చేస్తే ఓసీలో 340 మంది మాత్రమే పనిచేయనున్నారు.
2017 నాటికి ఓసీపీ-2
కేటీపీపీకి బొగ్గు సరఫరా చేయడంలో భాగంగా 2017 జనవరి నుంచి కేటీకే ఓసీపీ-2ను సిద్ధం చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం. అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. గనిలోని కార్మికులను ఏరియాలోని ఇతర గనులకు బదిలీ చేస్తాం.
- పాలకుర్తి సత్తయ్య, ఏరియూ జీఎం