చిత్రపరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటి ఆత్మహత్య
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటి బిదిషా డి మజుందార్(21) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం ఉదయం ఆమె శవమై కనిపించింది. తన చావుకు కారణాలు తెలుపుతూ సూసైడ్ నోట్ కూడా రాసినట్లు తెలుస్తోంది.
గత నాలుగేళ్లుగా బిదిషా అదే అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మే 25న ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించగా... బిదిషా ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిదిషా ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ లభించిందని, కుటుంబ సభ్యులను, సన్నిహితులను విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. మోడలింగ్ కెరీర్‌ని ఆరంభించిన బిదిషా డి మజుందార్, 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించింది.
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com