Big fight
-
నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీ నేతల మధ్య ఘర్షణ
-
ప్రభాస్ విలన్ తో ఎన్టీఆర్ బీ ఫైట్
-
బిగ్ ఫైట్ 3rd November 2016
-
బిగ్ ఫైట్ 2nd November 2016
-
హోరా హోరీగా టేబుల్ టెన్నిస్ పోటీలు
పెద్దాపురం : సీబీఎస్ఈ జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మూడురోజుల పాటు నిర్వహించే పోటీల్లో భాగంగా శుక్రవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. అండర్–14,, అండర్–17, అండర్–19 విభాగాల్లో సుమారు 40 సీబీఎస్ఈ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు ముగింపు సభ అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ క్రీడలకు పర్యవేక్షకులుగా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పీవీఎన్ సూర్యారావ్, చీఫ్ రిఫరీగా అచ్యుత్‌కుమార్, ఓవరాల్ ఇన్చార్జిగా వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారు. -
అరటిపండు కోసం పోలీసుల ముష్టియుద్ధం
చెన్నై: ఒక్క అరటిపండు... ఇద్దరు పోలీసులు మధ్య చిచ్చు పెట్టింది. రాత్రి వేళ దొంగలు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రజలను కాపాడటం కోసం నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో వున్నవాళ్లు... ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఇద్దరి మధ్య ముష్టి యుద్ధమే జరిగింది. దీంతో ఇతర సిబ్బంది జోక్యంతో వాళ్లిద్దరూ రక్తమోడుతూ ఆసుపత్రిలో చేరారు. స్వల్పవిషయానికే బహిరంగంగా ఘర్షణకు దిగి రచ్చకెక్కడం పోలీస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. పోలీసు వర్గాల కథనం ప్రకారం తిరుచునాపల్లి స్పెషల్ ఎస్ఐ రాధా, డ్రైవర్ శరవణన్ నైట్ పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. శరవణన్ రాత్రి పూట తినడానికి ఓ అరటిపండు తెచ్చుకున్నాడు. దాన్ని కాస్తా ఎఎస్ఐ రాధా తినేశాడు. అంతే వాళ్లిద్దరి మధ్య గొడవ మొదలైంది. పరస్పరం బూతులు తిట్టుకుంటూ శ్రీరంగం వీధుల్లో రెచ్చిపోయారు. రక్తాలొచ్చేలా కొట్టుకున్నారు. సహచర పోలీసులు వచ్చి వారిని విడదీసే దాకా అలా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇద్దరినీ వారించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరికీ ముక్కుల్లోనూ, పక్కటెముకల నుంచి రక్తస్రావం జరిగిందని ఆసుపత్రి సీనియర్ అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. -
‘కార్పొరేట్’ల బిగ్‌ఫైట్!
త్వరలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుంపటిని రాజేశాయి. ఆ పార్టీకే చెందిన ఇద్దరు కార్పొరేట్ విద్యావేత్తల మధ్య ‘బిగ్‌ఫైట్’కు తెర లేచింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కోట్లు కుమ్మరించే ఖరీదైన పోరుగా మారిపోయాయి. అందుకు తగ్గట్టుగానే అధికార టీడీపీలో ఇద్దరు ‘బస్తీ మే సవాల్’ అంటూ బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజును ఇప్పటికే టీడీపీ హైకమాండ్ ఆదేశాలతో ఆ పార్టీ జిల్లా నేతలు ఏకగ్రీవంగా బలపరిచారు. జరగనున్నది పార్టీరహితంగా, ఉపాధ్యాయ వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికలైనా.. ఆ పార్టీలో తాజా పరిణామాలతో రాజకీయ రంగు పులుముకున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ చైతన్యరాజు పదవీ కాలం వచ్చే మార్చితో ముగియనుంది. ఈలోపు జరిగే ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్వెలువడుతుందని ఆశావహులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే అదే పార్టీకే చెందిన ‘ప్రగతి’ విద్యాసంస్థల అధినేత కృష్ణారావు ఎమ్మెల్సీ బరిలో ఉన్నానంటూ గురువారం కాకినాడలో ప్రకటించడం పార్టీలో చిచ్చు రేపింది. మొదటి నుంచి వీరిద్దరిలో ఎవరో ఒకరే బరిలో ఉంటారని పార్టీ నేతలు భావించారు. ఆ దిశగా అంతర్గతంగా సయోధ్య కుదురుతుందనుకున్నారు. శాసనమండలిలో బలం లేని పార్టీలోకి పలువురు ఎమ్మెల్సీలను తీసుకువచ్చినందుకు ప్రతిఫలంగా చైతన్యరాజుకు మద్దతు ఇచ్చినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. చైతన్యరాజుకు టీడీపీ మద్దతు ప్రకటించాక కృష్ణారావుతో పార్టీ నేతలు మంతనాలు సాగించి.. కేబినెట్ హోదా కలిగిన ఏదో ఒక పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. బరిలో తానున్నానంటూ కాకినాడలో విలేకరుల సమావేశంలో ప్రకటించిన సందర్భంలో కృష్ణారావే ఈ విషయాన్ని తెలియచేశారు. కృష్ణారావుపై ఫిర్యాదు చేయనున్న ప్రత్యర్థులు గత సార్వత్రిక ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడ్డ తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరుస్తారని కృష్ణారావు ఆశించినా మరోసారి భంగపాటు తప్పలేదు. పార్టీలో ఉంటూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కృష్ణారావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ను వ్యతిరేక వర్గం అధిష్టానం ముందుంచే అవకాశం ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నాడు ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కుతుందంటూ పేరు ఎత్తకుండానే చంద్రబాబు మాట తప్పుతారని కృష్ణారావు పరోక్షంగా ఎత్తిచూపారని వారు ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. ఏదేమైనా పోటీ నుంచి తప్పుకునేది లేదని కృష్ణారావు తెగేసి చెప్పడం గమనార్హం. ఒకే పార్టీ నుంచి పోటీ పడుతున్న ఇద్దరూ కార్పొరేట్ విద్యా రంగానికి చెందిన వారు కావడంతో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు మరింత రసపట్టుకు ఆటపట్టు కానున్నాన్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొన్న అనుభవమున్న చైతన్యరాజు వ్యూహం ముందు కృష్ణారావు ప్రతివ్యూహం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. -
పోల'రణం'
-
పోరు.. హోరు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్యే నెలకొంది. బరిలో కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర, తదితర పార్టీలున్నా వాటి ప్రభావం ఎక్కడా కనిపించడం లేదు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 13 చోట్ల వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. పాలకొల్లు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో టీడీపీ రెబల్స్ కొంత ప్రభావం చూపుతున్నారు. రెండు లోక్‌సభ స్థానాల్లోనూ వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. పోటీ ఆ రెండు పార్టీల మధ్యే ఉన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే పైచేయిగా కనబడుతోంది. నియోజకవర్గాల్లో ఇదీ పరిస్థితి ఏలూరు లోక్‌సభా స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, టీడీపీ అభ్యర్థి మాగంటి బాబు పోటీ పడుతున్నారు. ఆదినుంచీ చంద్రశేఖర్ దూసుకుపోతుండగా.. మాగంటి బాబు పూర్తిగా వెనుకబడ్డారు. టీడీపీ శ్రేణులే ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ముసునూరు నాగేశ్వరరావు ప్రభావం దాదాపు లేనట్లే. నరసారం లోక్‌సభా స్థానంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంక రవీంద్ర, బీజేపీ అభ్యర్థి గోకరాజు గంగరాజు తలపడుతున్నారు. గంగరాజు డబ్బును నమ్ముకుని ముందుకెళ్లగా, రవీంద్ర జనంలోకి వెళ్లి ప్రచారం చేశారు. రవీంద్రకు మంచి ఆదరణ లభించగా, గంగరాజును జనం గుర్తించే పరిస్థితి చాలాచోట్ల లేకుండాపోయింది. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ కనుమూరి బాపిరాజు బరిలో ఉన్నా కాడివదిలేసి తన సొంత బావమరిది అయిన గంగరాజుకు తెరవెనుక నుంచి మద్దతు ఇస్తున్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు సెగ్మెంట్లలో టీడీపీ రెబల్స్ ప్రభావం చూపుతున్నారు. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ నుంచి తోట గోపి, బీజేపీ నుంచి మాణిక్యాలరావు పోటీలో ఉండగా, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ టీడీపీ రెబల్‌గా హడావుడి చేస్తున్నారు. తోట గోపి ఇంటింటికీ తిరిగి అందరినీ ఆకట్టుకోగా, బీజేపీ అభ్యర్థి ఎవరో కూడా జనానికి సరిగా తెలియని పరిస్థితి ఉంది. దీనికితోడు కొట్టు సత్యనారాయణ వల్ల బీజేపీ అభ్యర్థికి ఇబ్బంది ఏర్పడింది. పాలకొల్లులో టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు బరిలో ఉండగా, ఆ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి బాబ్జి పోటీలో ఉన్నారు. దీంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. టీడీపీలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉండగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి మేకా శేషుబాబు ముందునుంచీ జనంలో ఉండటంతో ఆయనకు ఆదరణ లభిస్తోంది. ఆయన వ్యూహాత్మకంగా పనిచేస్తూ పైచేయి సాధించారు. నరసాపురంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడుతో టీడీపీ అభ్యర్థి బండారు మాధవనాయుడు పోటీపడే పరిస్థితి కనిపించడం లేదు. పైకి హడావుడి చేస్తున్నా టీడీపీ అభ్యర్థి చేతులెత్తేశారు. భీమవరంలో వైఎస్సార్ సీపీ తరఫున గ్రంధి శ్రీనివాస్ దూకుడు ముందు టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నిలబడలేకపోతున్నారు. డబ్బుపైనే ఆధారపడి ఆయన పనిచేస్తున్నారు. అయినా గ్రంధి ముందంజలో దూసుకెళుతున్నారు. ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కలవపూడి శివ రకరకాల గాలి ప్రచారాలు, కుయుక్తులతో గారడీలు చేస్తుండటంతో జనంలో ఆయనపై వ్యతిరేకత కనిపిస్తోంది. ఆచంటలో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నమాజీ మంత్రి పితాని సత్యనారాయణకు వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చెమటలు పట్టిస్తున్నారు. ప్రసాదరాజును ఎదుర్కోలేక ఆయన పడతాయనుకున్న ఓట్లను చీల్చి లబ్ధి పొందేందుకు పితాని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తణుకులో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చీర్ల రాధయ్య, టీడీపీ అభ్యర్థిగా ఆరిమిల్లి రాధాకృష్ణ తలపడుతున్నారు. మంచి వ్యక్తిగా పేరున్న రాధయ్యకు జనం మద్దతు లభిస్తుండగా, రాధాకృష్ణ సామాజిక వర్గం ధనబలంతో రాధయ్యను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. జిల్లా కేంద్రమైన ఏలూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిని ఇప్పటికే వెనక్కు నెట్టారు. దెందులూరులో తన గెలుపు ఖాయమని మొన్నటివరకూ హడావుడి చేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు షాక్ ఇస్తున్నారు. కారుమూరిని ఎదుర్కొనేందుకు చింతమనేని తొలిసారిగా భారీ ఎత్తున డబ్బులు పంచుతున్నారు. చింతలపూడిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి బూర్ల దేవీప్రియ స్పీడును టీడీపీ అభ్యర్థి పీతల సుజాత అందుకోలేకపోతున్నారు. పోలవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతుండగా, టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాస్ పూర్తిగా వెనుకబడ్డారు. గోపాలపురంలో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు మధ్య పోటీ నెలకొంది. కొవ్వూరులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి తానేటి వనిత ముందంజలో ఉండగా, టీడీపీ అభ్యర్థి జవహర్ ఎదురీదుతున్నారు. నిడదవోలులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజీవ్‌కృష్ణ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావును పరుగులు పెట్టిస్తున్నారు. ఉంగుటూరులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబుదే పైచేయిగా కనిపిస్తోంది. అక్కడ టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు ఎన్నికలకు ముందే చేతులెత్తేసే స్థితిలో ఉన్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ నాటికి వైఎస్సార్ సీపీకి అనుకూల పరిస్థితి నెలకొనగా టీడీపీ ఎదురీదుతోంది.