హోరా హోరీగా టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు | table tennis sports | Sakshi
Sakshi News home page

హోరా హోరీగా టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

Published Fri, Oct 14 2016 10:18 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

table tennis sports

పెద్దాపురం : 
సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు పెద్దాపురం శ్రీ ప్రకాష్‌ సినర్జీ పాఠశాలలో హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మూడురోజుల పాటు నిర్వహించే పోటీల్లో భాగంగా శుక్రవారం ఏపీ, తెలంగాణ  రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు తలపడ్డారు. అండర్‌–14,, అండర్‌–17, అండర్‌–19 విభాగాల్లో సుమారు 40 సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం మూడు గంటలకు ముగింపు సభ అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేస్తారు. ఈ క్రీడలకు పర్యవేక్షకులుగా టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ పీవీఎన్‌ సూర్యారావ్, చీఫ్‌ రిఫరీగా అచ్యుత్‌కుమార్, ఓవరాల్‌ ఇన్‌చార్జిగా వేణుగోపాల్‌ వ్యవహరిస్తున్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement