బస్సు, బైక్ ఢీ..ముగ్గురు మృతి
చిలమత్తూరు : అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. చిలమత్తూరు మండలం ముదిరెడ్డిపల్లి వద్ద శనివారం సాయంత్రం వేగంగా వెళ్తున్న బైక్, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.
తమ్మయ్యగారిపల్లికి చెందిన రామాంజనేయులు, లక్ష్మీదేవమ్మ దంపతులు, గోరంట్ల మండలం బూదిలి గ్రామానికి చెందిన తలారి వెంకట్రామప్ప బైక్పై హిందూపురం వైపు వెళ్తున్నారు. ముదిరెడ్డిపల్లి సమీపంలో వీరి బైక్ హిందూపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను హిందూపురం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.