bike-lorry
-
బైక్ను ఢీకొన్న లారీ: ఇద్దరి మృతి
కొత్తకోట: వేగంగా వెళ్తున్న లారీ ఓ బైక్ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమందడి మండలం మోజర్లకు చెందిన బాల్రెడ్డి, రాములుతో పాటు మరో వ్యక్తి కొత్తకోట నుంచి గ్రామానికి బైక్పై వెళ్తున్నారు. పాలెం వద్దకు రాగానే వేగంగా దూసుకొచ్చిన లారీ వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బాల్రెడ్డి, రాములు అక్కడిక్కడే మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
తూర్పుగోదావరి(తొండంగి): రెండు బైకులను లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం బెండపూడి జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. తొండంగి మండలం బెండపూడికి చెందిన నలుగురు యువకులు రెండు బైకులపై అన్నవరం వైపు వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతి చెందినవారు బెండపూడికి చెందిన గోకుశెట్ల నారాయణ, పాపాల రాముగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందకున్న పోలీసులు సంఘటానా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బైక్ను ఢీకొన్న లారీ..యువకుడు మృతి
హైదరాబాద్ సిటీ: ఉప్పల్ నుంచి రామాంతపూర్ వైపు బైక్ మీద వెళ్తున్న యువకుడిని ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనలో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సమీర్(22) అనేయువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. కొన్ని రోజుల్లో విదేశాలకు వెళ్లాల్సి ఉండగా ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని బంధువలు శోకసంద్రం అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.