లారీ,బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
కొత్తకోట: వేగంగా వెళ్తున్న లారీ ఓ బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమందడి మండలం మోజర్లకు చెందిన బాల్‌రెడ్డి, రాములుతో పాటు మరో వ్యక్తి కొత్తకోట నుంచి గ్రామానికి బైక్‌పై వెళ్తున్నారు.
పాలెం వద్దకు రాగానే వేగంగా దూసుకొచ్చిన లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బాల్‌రెడ్డి, రాములు అక్కడిక్కడే మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.