bind over
-
‘పోలీసుల అదుపులో ఇద్దరు ప్రొఫెసర్లు’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని ఇద్దరు ప్రొఫెసర్లను అదుపులోకి తీసుకొని స్థానిక ఎమ్మార్వో ముందు బైండ్ ఓవర్ చేస్తున్నామని విశాఖ డీసీపీ - 1 రంగారెడ్డి అన్నారు. ఏయూ ఎంఎల్ఆర్ విభాగానికి చెందిన కె.రమేష్‌బాబుపై 498ఏ కేసుతో పాటు అక్రమ సంబంధం ఆరోపణలు ఉన్నాయని రంగారెడ్డి వెల్లడించారు. కాగా, 498 ఏ కేసు ఇంకా విచారణలోనే ఉందని ఆయన అన్నారు. సోషల్‌వర్క్ విభాగాధిపతి రాగాల స్వామిదాస్ విద్యార్థులు పట్ల ద్వందార్థ మాటలతో వేధిస్తున్నారని మీడియాలో కథనాలు రావటంతో సుమోటోగా తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇద్దరు ప్రొఫెసర్లను సీఆర్ పీసీ 41 /109 సెక్షన్ కింద అదుపులో తీసుకున్నామని తెలిపారు. ర్యాగింగ్ జరపకుండా కౌన్సిలింగ్ చేయాల్సిన ఆచార్యులే పోలీసులు, ఎమ్మార్వో కౌన్సిలింగ్ తీసుకోవటం దురదృష్టకరమన్నారు. అత్యున్నత సంస్థలో పనిచేసే వారు దిగజారి ప్రవర్తిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ రంగారరెడ్డి అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలని రంగారెడ్డి చెప్పారు. ఫిర్యాదు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే ఏయూ క్యాంపస్‌లో వర్చువల్ పోలీస్ స్టేషన్ ప్రారంభిస్తామని రంగారెడ్డి తెలిపారు. వర్చువల్ పోలీసు స్టేషన్ ద్వారా ఏయూ విద్యార్థులు ఫిర్యాదులు చేయవచ్చని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ వీసీతో కలసి పోలీసులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని డీసీపీ రంగారెడ్డి అన్నారు. -
అక్రమ కేసులు..భయంతో కుటుంబ సభ్యులు
సాక్షి, గూడూరు రూరల్: అధికారపార్టీ నేతల ఒత్తిడికి పోలీసులు తలొగ్గుతున్నారు. కొందరు వారికి తొత్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బైండో వర్ కేసులు నమోదు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కె.నాగలాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని పెద్దపాడులో ఒకరు, కె.నాగలాపురంలో ఏడుగురు, సల్కాపురంలో తొమ్మిది, పర్లలో నలుగురు, మార్కాపురంలో ఏడుగురు, బూడిదపాడులో 11 మందిపై పోలీసులు బైండోవర్ కేసులను నమోదు చేశారు. అయితే ఈ కేసులను నమోదు చేసిన వారిలో అత్యధికంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులే ఉన్నారు. తమపై ఎలాంటి నేరారోపణలు, క్రిమినల్ కేసులు లేకపోయినా బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని వాపోతున్నారు. పోలీసుల తీరుపై కోర్టులో ప్రైవేట్ కేసులు వేసేందుకు సిద్ధమవుతున్నారు. బైండోవర్ కేసు నమోదు చేశారు ఎలాంటి క్రిమినల్ కేసులు లేని నాపై పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. నేనేం తప్పు చేశానని కేసు నమోదు చేశారని పోలీసులను అడిగితే సమాధానం చెప్పడం లేదు. –నరసింహారెడ్డి, కె.నాగలాపురం భయాందోళనకు గురి చేస్తున్నారు పోలీసులను మా ఇళ్లకు పంపి కుటుంబ సభ్యులను భయాందోళనకు గురి చేస్తున్నారు. గత మూడేళ్లుగా నేను వైఎస్సార్సీపీ కార్యకర్తగా పని చేస్తున్నాను. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేసి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారు. – కొండారెడ్డి, బూడిదపాడు. ఆదేశాలు ఉన్నాయి ప్రతి రోజు 10 మందికి తగ్గకుండా బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అన్ని పార్టీలకు చెందిన వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. –గోపీనాథ్, కె.నాగలాపురం ఎస్ఐ -
సమస్యాత్మకం 342
జిల్లా పోలీసు యంత్రాంగం శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించే పనిలో నిమగ్నమైంది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఆ శాఖ.. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిపేందుకు.. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించి.. అమలు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి.. భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. పోలింగ్ బూత్‌లవారీగా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో మొత్తం 1,303 పోలింగ్ బూత్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడు బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇటీవల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టగా.. పెరిగిన ఓటర్లను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికారులు వాటిని ఏర్పాటు చేశారు. రెండు పోలింగ్ బూత్‌లను ఖమ్మం నియోజకవర్గంలో.. ఒకటి పాలేరు నియోజకవర్గం లోనూ ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో 1,306 బూత్‌లున్నట్లు అయింది. ఈ లెక్క ప్రకారం ఖమ్మంలో 296 పోలింగ్ బూత్‌లు, పాలేరు 266, మధిర 251, వైరా 229, సత్తుపల్లిలో 264 పోలింగ్ బూత్‌లున్నాయి. మొత్తం పోలింగ్ బూత్‌లను పరిశీలించిన అనంతరం సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్యాత్మక కేంద్రాలు జిల్లాలో మొత్తం 342 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో సమస్యాత్మకం, అత్యంత సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను లెక్కించిన అధికార యంత్రాంగం ఈసారి సమస్యాత్మక బూత్‌లను మాత్రమే గుర్తించింది. గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలు, ఘర్షణల ఆధారంగా సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 342 సమస్మాత్మక కేంద్రాల్లో ఖమ్మం నియోజకవర్గంలో 65, పాలేరు 93, మధిర 69, వైరా 49, సత్తుపల్లి 66 ఉన్నాయి. వీటిలో...అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 93 పోలింగ్ బూత్‌లున్నాయి. ఈ నియోజకవర్గంలో గతంలో పలు సంఘటనలు జరగడం వల్ల వీటిని సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల జాబితాలో చేర్చారు. కూసుమంచి మండలం చేగొమ్మ, పోచారం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు, ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు, ముత్తగూడెం తదితర గ్రామాల్లో గతంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ పోలింగ్ బూత్‌లను సమస్యాత్మక కేంద్రాల పరిధిలోకి తెచ్చారు. పాలేరు తర్వాత మధిర, సత్తుపల్లి, ఖమ్మం కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలున్నట్లు గుర్తించారు. వైరా నియోజకవర్గంలో తక్కువగా 49 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలతోపాటు సాధారణ పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ యంత్రాంగంతోపాటు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. గట్టి నిఘా ఏర్పాటు.. జిల్లాలో సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 342 పోలింగ్ బూత్‌లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి నుంచే అక్కడ చేపట్టాల్సిన చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులు సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇప్పటికే బైండోవర్లను ముమ్మరం చేశారు. ఇక సమస్యాత్మక కేంద్రాలున్న ప్రాంతాల్లో బైండోవర్ల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎన్నికలకంటే ముందు నుంచి పోలీస్ బందోబస్తును పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు పోలీసుల నిఘా.. పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. అలాగే ఘర్షణలు జరగకుండా అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. -
నేరగాళ్లపై నజర్
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పాత నేరస్థులు, నాటుసారా విక్రయదారులు, బెల్టుదుకాణాల విక్రయదారులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపైన పోలీసులు దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రి య మొదలవడం, ఎన్నికల ప్రచారం వేడెక్కడటంతో గ్రామా లు, పట్టణాల్లో అవాంచనీయసంఘటనలు జరగకుండా పోలీసు బాసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు.. ముందస్తు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా పోలీస్ ఉన్నతాధికారులు ముందుస్తు జాగత్త్రలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల, సర్కిల్, డివిజన్, జిల్లా కార్యాలయాల వారిగా ఉన్న పాత నేరస్థులకు సమాచారం అందిస్తున్నారు. పాత నేరస్థులు, నాటుసారా విక్రయదారులు, బెల్టు దుకాణాదారులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులను పోలీస్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఆయా పోలీస్స్టేషన్లల్లోని రిజిష్టర్లు నేరస్థుల హాజరు నమోదు చేసుకుంటూ మండల కేంద్రాల్లోని తహసీల్ కార్యాలయాల్లో తహసీల్దార్ ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల పోలీస్స్టేషన్లల్లో పరిధిలో ఉన్న పాత నేరస్థులకు సమాచారం అందించడంతో పాటు ప్రతీ రోజు 10 నుంచి 20 మందిని తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేస్తున్నారు. హత్యలు, హ త్యాయత్నాలు, నేతలపై దాడులు, రాజకీయ కక్షసాధింపు, ఎన్నికల ప్రచారంలో అల్లర్లు, మద్యం సేవించి గోడవలు సృష్టించే వారిని పోలీసులు బైం డోవర్ చేస్తున్నారు. దాంతో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు, తహశీల్దార్ కార్యాల యాల్లో నేరస్థుల బైం డోవర్లు జోరుగా సాగుతున్నాయి. పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తూన్నారు. అంతేకాకుండా ప్రతీ వారం, వారం పోలీస్‌స్లేషన్లకు వచ్చే రిజిష్టర్లల్లో హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 552మంది నేరస్థులను పోలీసులు తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. అన్ని పోలీసుస్టేషన్ల వారిగా నేరస్థుల బైండోవర్ సమాచారాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. నాటుసారా, బెల్టుషాప్‌లకు చెక్... జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న పాతనేరస్థులతో పాటు నాటుసారా విక్రయదారులు, బెల్టుషాపు నిర్వహకులను పోలీసులు బైండోవర్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున్న గ్రామాల్లో నాటుసారా తయారు, బెల్టు సీసాల విక్రయాలు చేపట్టకుండా పోలీసులు వారిని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలను మద్యం తీసుకొచ్చే వారితో వారిని ప్రోత్సహిస్తున్న వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో ఉన్న సమస్యాత్మక వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులను కూడా పోలీసులు బైండోవర్ చేస్తు న్నారు. -
14 మంది రౌడీ షీటర్లు బైండోవర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు 14 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు. అంబర్‌పేట ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి చెప్పిన వివరాల మేరకు.. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను శుక్రవారం పిలిపించి వారి రోజువారి కదలికలను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి రౌడీషీటర్ కదలికలపై నిఘా వేసి ఎన్నికల్లో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్టేషన్ పరిధిలో ఉన్న మొత్తం రౌడీషీటర్లను దశల వారిగా బైండోవర్ చేస్తామన్నారు. -
గుడుంబా విక్రయం: 23మంది బైండోవర్
ఆత్మకూరు (నల్లగొండ) : గుడుంబా విక్రయిస్తున్న 23 మందిని ఎక్సైజ్ అధికారులు సోమవారం తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నర్సాపురం, దుగ్గలి గ్రామాల్లో నాటు సారా విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సారా విక్రయిస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకుని తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు. -
జనశక్తి నక్సల్స్ అరెస్ట్
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా పోలీసులు శుక్రవారం జనశక్తి గ్రూప్ నక్సల్స్‌ను ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రెండు తపంచాలు, ఒక రివాల్వర్, కొన్ని డిటొనేటర్లు, బుల్లెట్లు, విప్లవసాహిత్యం, బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిలో వేంపటి కుమార్ అలియాస్ గంగన్న అలియాస్ జీవన్, ఏదులకంటి లింగారెడ్డి అలియాస్ శ్యాం, జంగలం శంకర్, చండ్రుపట్ల సురేష్, అక్కల రాజు ఉన్నారు. అలాగే, వీరికి ఆశ్రయం కల్పించిన నేరంపై మరో ఐదుగురిని బైండోవర్ చేశారు. అంతేకాకుండా జనశక్తి గ్రూపుకు చెందిన కూర రాజన్న, దేవేందర్, విమలక్క తదితర నేతలపై కుట్ర కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విలేకరులకు తెలిపారు. -
ఖాకీల హల్చల్
- అనంతసాగర్‌లోని పలువురి ఇళ్లలో తనిఖీలు - ఆందోళనలో గ్రామస్తులు - పోలీసుల తీరుపై ఆగ్రహం కొండాపూర్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని అనంతసాగర్‌లో పోలీసులు హల్చల్ చేశారు. బుధవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పోలీసులు ఒక్కసారిగా గ్రామంలో హడావుడి చేశారు. పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికులంతా భయాందోళనలు చెందారు. ఇప్పటికే సీఐడీ పోలీసుల మం టూ పలువురు గ్రామంలోని తనిఖీలు చేపట్టడం... తాజాగా పోలీసులు కూడా వారిలాగే తనిఖీలు చేపట్టడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఎందుకు తనిఖీలు చేపడుతున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుకొకరు వచ్చి గ్రామంలోని పలు ఇళ్లను తవ్వేస్తుంటే ఏం చేయాలో...ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు. వారంరోజులుగా తనిఖీల పరంపర ఈ నెల 1వ తేదీన 25 మంది వ్యక్తులు పోలీసు యూనిఫాం, సివిల్ దుస్తులు ధరించి స్కార్పియో వాహనాల్లో గ్రామానికి వచ్చారు. తాము సిఐడీ పోలీసులమని గ్రామస్థులకు చెప్పారు. ఓ కేసు విషయంలో విచారణ జరుపుతున్నామంటూ గ్రామానికి చెందిన సోమేశ్వర్ పాడుపడ్డ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఆ ఇంట్లోని దేవుడిగదిలో తవ్వకాలు జరిపారు. తిరిగి మంగళవారం రాత్రి రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన పలువురు వ్యక్తులు తాము సీఐడీ పోలీసులమంటూ మళ్లీ సోమేశ్వర్ ఇంటికే వచ్చారు. ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు సిద్ధంకాగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అనంతసాగర్ చేరుకున్న ఎస్ఐ చంద్రయ్య ఆరుగురిని అరెస్టు చేయగా, మరికొందరు పరారయ్యారు. తన అదుపులో ఉన్న వారికి స్టేషన్‌కు తరలించిన ఎస్ఐ విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా, బుధవారం ఉదయం డీఎస్పీతో పాటు మరికొంత మంది పోలీసులు తహశీల్దారు గీత, గ్రామంలోని మటం మల్లేశం, అశోక్, ఇంద్రారెడ్డి, సోమేశ్వర్‌ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఎందుకు తనిఖీలు చేస్తున్నారో కూడా చెప్పకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓ దశలో పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు ఇలా ఎవరో ఒకరు వచ్చి తనిఖీలంటూ తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు వెంటనే ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తహశీల్దారు ఎదుట బైండోవర్ తమ అదుపులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన హరిబాబు, విజయ్‌కుమార్, కోల్కుంద నరేశ్, వినయ్మీర్ బాబు, గడ్డపల్లి శేఖర్, రాజ్‌కుమార్ నాయక్‌లను విచారించి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ చంద్రయ్య తెలిపారు. కూలీ పనులు చేసుకోడానికి తాము గ్రామానికి వచ్చినట్లు విచారణలో వారు చెప్పారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.