ఆత్మకూరు (నల్లగొండ) : గుడుంబా విక్రయిస్తున్న 23 మందిని ఎక్సైజ్ అధికారులు సోమవారం తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు. నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నర్సాపురం, దుగ్గలి గ్రామాల్లో నాటు సారా విక్రయిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ఎక్సైజ్ అధికారులు సారా విక్రయిస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకుని తహశీల్దార్ ముందు బైండోవర్ చేశారు.