Biometric approach
-
గూగుల్ సరికొత్త సంచలనం.. లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అవసరం లేదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాస్వర్డ్ లేకుండా యాప్స్, వెబ్‌సైట్స్ లాగిన్ అయ్యేలా సరికొత్త ఫీచర్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను సులభతరం చేసేలా బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఫింగర్ ప్రింట్స్, ఫేసియల్ రికగ్నైజేషన్, స్క్రీన్ లాక్ పిన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఈ తరుణంలో గూగుల్ అకౌంట్ యూజర్లు పాస్వర్డ్ లేకుండా లాగిన్ అయ్యేలా సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. పాస్వర్డ్ 123లకు గుడ్‌బై ప్రస్తుతం, ఏదైనా వెబ్సైట్, యాప్‌లలో లాగిన్ అవ్వాలంటే యూజర్ ఐడీతో పాటు పాస్వర్డ్ 123, పాస్వర్డ్ 123@$ ఈ తరహాలో పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా బయోమెట్రిక్ అథంటికేషన్ ఆధారిత ‘పాస్‌కీస్’ ఆప్షన్‌తో సంప్రదాయ పాస్వర్డ్లైన పాస్వర్డ్ 123లకు స్వస్తిపలకనుంది. వచ్చే ఏడాది వరల్డ్ పాస్వర్డ్డే నాటికి యూజర్లు వినియోగించేలా ఈ పాస్‌కీస్ ఆప్షన్‌ను అందుబాటులోకి తేనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. పాస్‌కీస్ అంటే? పాస్‌కీస్ అంటే ఫేస్ఐడీ, టచ్ ఐడీ ఆధారిత బయోమెట్రిక్ అథంటికేషన్ విధానం. దీని సాయంతో 123 తరహా పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. వెబ్ అథింటిక్ ఆధారిత ఫేస్ఐడీ లేదా టచ్ ఐడీలను ఉపయోగించి యాప్స్‌లో లేదంటే వెబ్సైట్లలో లాగిన్ అయ్యేలా సౌకర్యం కలగనుంది. పాస్‌కీస్ టెక్నాలజీ ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే టెక్నాలజీ వినియోగంతో పెరిగిపోతున్న సైబర్ నేరాల్ని అరికట్టేందుకు 2009లో పాస్‌కీస్ విధానం వినియోగిస్తే బాగుండేదన్న ఆలోచన వచ్చింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. అయితే 2012లో అంతర్జాతీయ చెల్లింపుల సంస్థ పేపాల్ దిగ్గజ టెక్ కంపెనీలతో కలిసి పాస్‌వర్డ్‌ల స్థానంలో బయోమెట్రిక్ టెక్నాలజీ వినియోగం కోసం పనిచేసేలా ఓ ఒప్పందానికి వచ్చాయి. ఫిడోలో గూగుల్ భాగస్వామ్యం అలా జులై 2012లో ఫాస్ట్ ఐడెంటిఫై ఆన్లైన్(Fast Identity Online (FIDO) పేరుతో ఓ సంస్థను స్థాపించాయి. 2013లో ఫిడోలో గూగుల్ సైతం చేరింది. ఆ మరుసటి ఏడాది అంటే 2014లో పేపాల్ - శాంసంగ్ కలిసి ఫిడో అభివృద్ది చేసిన అథంటికేషన్‌ను శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. దీని సాయంతో శాంసంగ్ గెలాక్సీ ఎస్ 5 స్మార్ట్ ఫోన్లలో పేపాల్ యూజర్లు ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే పాస్వర్డ్ లేకుండా స్వైప్ చేసి ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. గూగుల్ పాస్‌కీస్ ప్రయోగం తాజాగా పాస్‌కీస్ ఫీచర్ తెచ్చేందుకు గూగుల్ ప్రయోగాలు ముమ్మరం చేసింది. ఫిడో అలయన్స్‌లో ఉన్న ఇతర టెక్ సంస్థలైన యాపిల్, మైక్రోసాఫ్ట్ పాస్‌కీస్ ప్రాజెక్ట్‌పై కలిసి పనిచేస్తుంది. ఆ ప్రాజెక్ట్ చివరి దశలో ఉందని , వచ్చే ఏడాది మే 2 వరల్డ్ పాస్వర్డ్ డే రోజున పాస్‌వర్డ్‌ల స్థానంలో పాస్‌కీస్ ఆప్షన్‌ను గూగుల్ తేనున్నట్ల నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: చిన్న చిన్న లావాదేవీల కోసం పిన్ అక్కర్లేదు! -
‘బయోమెట్రిక్’కు మంగళం!
► పనిచేయని సర్వర్లు ► మాన్యువల్‌గానే విద్యార్థుల హాజరు ► 94 ఎస్సీ హాస్టళ్లలో నిలిచిన సేవలు ► అక్రమాలకు చెక్ పెట్టేందుకు 2015లో అమలు వీణవంక(హుజూరాబాద్): సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అక్రమాలను అరికట్టేందుకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం నీరుగారిపోతోంది. సర్వర్లు పనిచేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 94 ఎస్సీ హాస్టళ్ల విద్యార్థులు మాన్యువల్‌గానే హాజరవుతున్నారు. ఫలితంగా ఆర్భాటంగా ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రం పనిలేకుండా మూలకుపడింది. ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులందరూ హాజరుకాకున్నా.. ఉన్నట్లు రికార్డులు సృష్టించి పథకాన్ని నీరుగార్చుతున్నారని గుర్తించిన ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఈ విధానం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలు ఇస్తుందని భావించి అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. బయోమెట్రిక్‌కు సంబంధించిన సర్వర్లు పనిచేయడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ విధానం మూలనపడింది. ఎప్పటిలాగే మళ్లీ పాత పద్ధతిలోనే మాన్యువల్‌గా విద్యార్థుల హాజరు శాతాన్ని చూపిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 94 హాస్టళ్లు ఉమ్మడి కరీంనర్ జిల్లావ్యాప్తంగా 94 ఎస్సీ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 4850మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతిరోజు విద్యార్థులు, సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా ఉదయం 10 గంటలలోపు వేలుముద్ర వేయాలి. దానిని స్కాన్ చేసి హాజరుశాతాన్ని ఆన్లైన్ ద్వారా జిల్లా అధికారులకు పంపించాలి. అయితే సర్వర్లు పనిచేయకపోవడం.. సాంకేతిక సమస్యలతో బయోమెట్రిక్ మూలనపడింది. బయోమెట్రిక్ విధానం ఇలా.. హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ల్యాప్‌టాప్, ఆన్లైన్ సౌకర్యం, వేలిముద్రల స్కానర్‌ను ప్రతి హాస్టల్‌కు 2015లో సమకూర్చింది. ప్రతినెలా ఆన్లైన్ బిల్లు రూ.1200 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యార్థుల వేలిముద్రలు ప్రతిరోజూ స్కానింగ్ చేసి ఉన్నతాధికారులకు పంపించాలి. విద్యార్థుల గైర్హాజరు ఉన్నా.. హాజరుశాతం పెరిగినా.. ఉన్నతాధికారులకు తెలిసిపోతుంది. తద్వారా ఎంత మంది హాస్టల్లో ఉంటున్నారని అధికారులు గుర్తించే వీలుంటుంది. దీంతో అక్రమాలను పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని ప్రభుత్వం భావించింది. పని చేయని సర్వర్లు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచినా.. ఇంతవరకు బయోమెట్రిక్ సేవలు జిల్లావ్యాప్తంగా ప్రారంభం కాలేదు. ప్రతి హాస్టల్ నుంచి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు సర్వర్లను అనుసంధానం చేశారు. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇప్పటివరకు సేవలు ప్రారంభంకాలేదు. విద్యార్థుల వేలి ముద్రలు సక్రమంగా స్కానింగ్ చేయకపోవడం.. గ్రా మీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య తీవ్రంగా ఉండ డం ద్వారా గతేడాది అంతంత మాత్రంగానే కొనసాగించారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా పకడ్బందీగా అమల్లోకి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు భావించగా.. సర్వర్లు పని చేయకపోవడం వల్ల ఈ విధానం మూలనపడింది. దీంతో విద్యార్థులు, సిబ్బంది హాజరు శాతాన్ని మాన్యువల్‌గానే కొనసాగిస్తున్నారు. బయోమెట్రిక్ లేకుంటే మళ్లీ అక్రమాలు జరుగుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అక్రమాలకు చెక్ పెట్టాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలుగజేసుకుని త్వరగతిన బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
75 శాతం హాజరు ఉంటేనే ఉపకార వేతనాలు
నంద్యాల అర్బన్: బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో 75 శాతం హాజరు ఉంటేనే కళాశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ప్రసాదరావు తెలిపారు. స్థానిక నేషనల్ పీజీ కళాశాలలో బుధవారం ప్రభుత్వం విద్యార్థులకు అందించే పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు సంబంధించిన విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ విద్యాసంస్థల అధినేత ఇంతియాజ్ అహమ్మద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి నంద్యాల డివిజన్లోని సుమారు 120 జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, వ్యవసాయ, పాలిటెక్నిక్, డైట్ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపసంచాలకులు ప్రసాదరావు మాట్లాడుతూ కళాశాలలకు ప్రభుత్వం మంజూరు చేసే ఆర్టీఎఫ్(రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు)లను ఈ సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి విడుదల చేయనున్నట్లు చెప్పారు. జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్‌వలి మాట్లాడుతూ మైనార్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉపకార వేతనాలు అందించడానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూర్చిందని చెప్పారు. కార్యక్రమంలో నేషనల్ విద్యాసంస్థల ఏఓ రఫీ అహమ్మద్, నంద్యాల ఏఎస్ డబ్ల్యూఓ నాగేంద్రమణి, కోవెలకుంట్ల ఏఎస్డబ్ల్యూఓ లక్ష్మయ్య, సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం నేషనల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు ప్రసాదరావును సన్మానించారు.