‘పణ’ అనే పదానికి అర్థం?
మాదిరి ప్రశ్నపత్రం
నిన్నటి తరువాయి..
3. మీ దృష్టిలో ఎలాంటి వారు గురుస్థానీయులు?
4.రైతులు ఆనందంగా జీవించాలంటే వారికి ఏయే సౌకర్యాలు కల్పించాలి?
ఆ)కింది వాటిలో ప్రతి భాగం నుంచి ఒక్కో ప్రశ్నకు 10 లేదా 12 వాక్యాల్లో జవాబులు రాయండి. 3ణ6=8
5.‘నగరంలో దారిద్య్రం, సౌభాగ్యం సమాంతర రేఖలు’ అని అన్న అలిశెట్టి ప్రభాకర్ మాటల్ని సమర్థిస్తూ రాయండి. (లేదా)
దానం గొప్పతనం గురించి ‘దానశీలం’ పాఠ్యాంశం ఆధారంగా వివరించండి.
6.‘భాగ్యోదయం’ పాఠం ఆధారంగా సమాజ వెనుకబాటుతనానికి గల కారణాలను వివరించండి. (లేదా)
ఒక భాష గొప్పతనం ఏయే అంశాల మీద ఆధారపడి ఉంటుందో తెలపండి?
7. రామలక్ష్మణ, భరతుల పాత్రల ఆధారంగా అన్నదమ్ముల అనుబం«ధం గురించి రాయండి.(లేదా)
దండకారణ్యం (అరణ్య కాండం)లో జరిగిన ముఖ్య ఘట్టాలు గురించి సంక్షిప్తంగా రాయండి.
పార్ట్–బి
సూచన: ఈ ప్రశ్నపత్రానికి సంబంధించిన జవాబులను ఇందులోనే పూరించి, ప్రశ్నపత్రాన్ని మీ సమాధాన పత్రంతో జతచేయండి.
అ) కింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. 2ణ1=2
1. సీమోల్లంఘన 2. నడత
ఆ) సరైన జవాబు (ఎ, బి, సి, డి)ను బ్రాకెట్లో రాయండి. 16ణబీ=8
3. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులు కొందరు దుర్భర జైలు శిక్షలు అనుభవించారు. గీత గీసిన పదానికి అర్థం?
ఎ) గొప్ప బి) కఠినమైన సి) భరింపరాని డి) పెద్ద
4. బిడ్డలు దూరమై, తల్లి ఏకాకిగా బతుకుతోంది. ఏకాకి అంటే?
ఎ) కాకి బి) పక్షి సి) ఒంటరి డి) ఒక పక్షి
5. ‘పణ’ అనే పదానికి అర్థం?
బి) ధనం బి) నుదురు సి) పడగ డి) పాము
6. ‘ఈవి’ అనే మాటకు తగిన అర్థం?
ఎ) దానం బి) ధనం సి) ఈగ డి) యాగం
7. ‘దారి’ అనే మాటకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలు?
ఎ) మార్గం, గమనం బి) గమ్యం, తోవ
సి) బాట, లక్ష్యం డి) బాట, తోవ
8. కెరటం, తరంగం అనే పర్యాయ పదాలకు తగిన పదం?
ఎ) అల బి) కీర్తి సి) సముద్రం డి) సరస్సు
9. ‘పండితుడు’ అనే మాటకు పర్యాయ పదాలు?
ఎ) బుధుడు, గురుడు బి) బుధుడు, విద్వాంసుడు
సి) విద్వాంసుడు, విధురుడు డి) విధురుడు, విబుధుడు
10. ఉదకం, అంబువు అనే అర్థాన్ని ఇచ్చే పదం?
ఎ) తామర బి) మేఘం సి) సముద్రం డి) నీరు
11. ‘కీర్తి’ అనే మాటకు వికృతి పదం?
ఎ) కృతి బి) కీరిది సి) కీరితి డి) కర్త
12. ‘శాస్త్రం’కు వికృతి?
ఎ) చట్టం బి) శాసనం సి) శాస్త డి) శానము
13. సన్నాసి అనే వికృత పదానికి ఆధారమైన ప్రకృతి పదం?
ఎ) సైన్యం బి) సన్యాసి సి) శాస్త్రి డి) సన్యాస్త్రం
14. ‘బాస’ అనే పదానికి ప్రకృతి పదం?
ఎ) బాశా బి) భాస సి) బాష డి) భాష
15. పిల్లకు ప్రాయం..పేద తలిదండ్రులకు నరకప్రాయం అయింది. ఈ వాక్యంలో ‘ప్రాయం’ అనే పదానికి నానార్థాలు?
ఎ) వయసు, మనసు బి) తగిన, సమానం
సి) ప్రాణం, నరకం డి) వయసు, సమానం
16. ‘సభ’ అనే మాటకు గల నానార్థాలు?
ఎ) కొలువు, ఉద్యోగం బి) కొలవుకూటం, జూదం
సి) జూదం, తాగుడు డి) ఉద్యోగం, ఉపాయం
17. ‘రణం’ అనే మాటకు వ్యుత్పత్యర్థం?
ఎ) మరణంతో కూడుకుంది (యుద్ధం) బి) రణ రంగం (యుద్ధం)
సి) మళ్లీ మళ్లీ చేసేది (యుద్ధం) డి) రక్తం చూసేది (యుద్ధం)
18. ‘భృగు మహర్షి కుమారుడు’ అనే వ్యుత్పత్తి గల పదం?
ఎ) భర్గుడు బి) భార్గవుడు
సి) భార్గవరాముడు సి) విశ్వామిత్రుడు
మూల్యాంకన సూచికలు (కీ)
పార్ట్ – ఎ
1. పాఠ్య పుస్తకాన్ని అనుసరించి రచయిత్రి గతంలో తన అనుభవంలో ఉన్న విషయాలను.. ప్రస్తుతం చూస్తున్న వాటితో పోల్చుకొని.. ప్రధానంగా ఏయే మార్పులను గమనించిందనే విషయాన్ని స్పష్టంగా రాయాలి.
విషయం సరిగ్గా రాస్తే – 2 మార్కులు
తప్పులు లేకుండా రాస్తే – 1 మార్కు