Bitsat online exam
-
సీటు రాదేమోనని.. రైలు దిగి గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి..
హిందూపురం: బిట్‌శాట్‌లో స్కోర్ తగ్గడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు... అనంతపురము హిందూపురంలోని విద్యానగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు పెన్నోబులం, రమాదేవి దంపతుల కుమారుడు ఫణిసాయి హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. ఈ క్రమంలోనే జేఈఈ మెయిన్స్‌కు కూడా అర్హత సాధించాడు. అలాగే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్మిషన్ టెస్ట్ (బిట్‌శాట్)కు ఇంట్లోనే ఉంటూ సిద్ధమయ్యాడు. ఈ నెల 4న హైదరాబాద్‌కు తండ్రితోపాటు వెళ్లి 5వ తేదీ తెలంగాణ ఎంసెట్, 6వ తేదీన బిట్‌శాట్ పరీక్షలు రాశాడు. అనంతరం ఆన్లైన్లో బిట్‌శాట్ ఫలితాలు చూసుకున్న ఫణిసాయి స్కోర్ తగ్గిందని, తనకు సీటు రాదేమోనని మనోవేదనకు గురయ్యాడు. తండ్రి సముదాయించి కుమారుడిని వెంటబెట్టుకుని శనివారం రాత్రి కాచిగూడ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలులో హిందూపురానికి బయలుదేరాడు. కర్నూలు స్టేషన్ దాటిన తర్వాత పెన్నోబులం నిద్ర లేచి చూడగా పక్కనున్న బెర్త్‌పై కుమారుడు కనిపించలేదు. ఫణిసాయి కోసం టాయిలెట్స్, మిగిలిన కంపార్ట్మెంట్లు గాలించాడు. అయినా ఫలితం లేకపోయింది. అనంతపురానికి చేరుకున్న తర్వాత అక్కడి బంధుమిత్రులతో కలిసి తాను ప్రయాణిస్తూ వచ్చిన అన్ని రైల్వే స్టేషన్లలోనూ విచారించారు. ఎక్కడా అబ్బాయి ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, గద్వాల సమీపంలోని ఇటిక్యాలపాడు రైల్వేస్టేషన్లో కుమారుడు విగతజీవిగా పడి ఉన్నాడని సమాచారం అందింది. బంధువులు, స్నేహితులు వెంటనే ఇటిక్యాలపాడుకు వెళ్లారు. అక్కడ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇటిక్యాలపాడు వద్ద రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో ఫణిసాయి దిగి తర్వాత అక్కడికి సమీపంలో వస్తున్న గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గుడ్ న్యూస్: విద్యార్థులు రీషెడ్యూల్ చేసుకోవచ్చు
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, బిట్సాట్ పరీక్షలు ఒకేరోజు ఉన్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెసులుబాటు కల్పించింది. ఎంసెట్ తేదీని మార్చుకునే అవకాశం ఇచ్చింది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)లోని వివిధ కోర్సులలో ప్రవేశానికి బిట్సాట్–2021 పరీక్షను వచ్చే నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎంసెట్ పరీక్ష వచ్చే నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సు విద్యార్థులకు నిర్వహిస్తారు. 9, 10 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ కోర్సులు కోరుకునే విద్యార్థులకు ఉంటుంది. అయితే కొందరు విద్యార్థులకు ఒకే తేదీలో ఎంసెట్, బిట్సాట్ పరీక్షలు రెండూ ఉన్నాయి. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా విద్యార్థులు ఎంసెట్ తేదీని మార్చుకునేలా వెసులుబాటు కల్పించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి తెలిపారు. బిట్‌సాట్‌కు ఒకరోజు ముందు లేదా తరువాత రోజుకు ఎంసెట్ తేదీని మార్చుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు ఈ–మెయిల్ (convener.eamcet@tsche.ac.in) ద్వారా ఎంసెట్ కన్వీనర్‌కు తమ అభ్యర్థనను పంపవచ్చు. ఇలావుండగా.. గత సంవత్సరం మాదిరిగానే ఎవరైనా కోవిడ్ పాజిటివ్‌తో ఐసోలేషన్‌లో ఉంటే ఎంసెట్ కన్వీనర్‌కు తెలియజేయాలి. ఎంసెట్ జరిగిన పది రోజుల తర్వాత వారికోసం ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. -
వెబ్సైట్లో ఎంసెట్ తాజా షెడ్యూలు
మే 22న రాతపరీక్ష.. జూన్ 9న ర్యాంకుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 తాజా షెడ్యూల్‌ను ఎంసెట్ కమిటీ తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల డౌన్లోడ్, రాత పరీక్ష సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలను పొందేలా ఏర్పాట్లు చేసింది. తొలుత మే 17న ఎంసెట్‌ను నిర్వహించాలని నిర్ణయించినా, ఎన్నికల కౌంటింగ్ 16న ఉండటం.. కొన్నిచోట్ల 17న కూడా కొనసాగే పరిస్థితులుంటాయనే ఆలోచనతో పరీక్షను మే 22కి వాయిదా వేసిన సంగతి తెలి సిందే. దీంతో హాల్‌టికెట్ల డౌన్లోడ్, ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, ర్యాంకు ల వెల్లడి వంటి తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా షెడ్యూల్, ఇతర వివరాలు ఎంసెట్ వెబ్సైట్(http://apeamcet.org) నుంచి పొంద వచ్చు. కాగా మే 22న బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష ఉన్నప్పటికీ, ఎంసెట్ పరీక్ష తేదీని మార్చే అవకాశం లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలి పారు. అయితే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలదృష్ట్యా బిట్‌శాట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని సంబంధిత అధికారులకు లేఖ రాస్తామన్నారు. ఇదీ ఎంసెట్ తాజా షెడ్యూల్... 4-4-2014: ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 6-4-14 నుంచి 13-4-14 వరకు: సబ్మిట్ చేసిన దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం 18-4-14: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు చివరి రోజు 25-4-14: పరీక్ష కేంద్రాల ఖరారు, హాల్‌టికెట్ల జనరేషన్ 25-4-14: రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు తుది గడువు 8-5-14 నుంచి 19-5-14 వరకు: వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్ 8-5-14: రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు తుది గడువు 19-5-14: 10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుల సబ్మిషన్కు చివరి రోజు 22-5-14: ఎంసెట్ రాత పరీక్ష ఉదయం 10 గంటల నుంచిఒంటి గంట వరకు ఇంజనీరింగ్ మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 గంట ల వరకు అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ 24-5-14: ప్రాథమిక కీ విడుదల 31-5-14 వరకు: కీపై అభ్యంతరాల స్వీకరణ 9-6-14: ర్యాంకుల వెల్లడి