The black market
-
పుష్కలంగా రెవెన్యూ స్టాంపులు
* 8.28 కోట్ల స్టాంపులను సిద్ధం చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ * పోస్టాఫీసులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ అమ్మకాలు * బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్రలోని స్టాం పుల ముద్రణాలయం నుంచి 8.28 కోట్ల రెవెన్యూ స్టాంపులను కొనుగోలు చేసింది. ఇందులో సుమారు 4 కోట్ల మేర స్టాంపులను మంగళవారం పోస్టల్ శాఖకు అందజేయనున్నట్లు రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు తెలి పారు. వాస్తవానికి రెవెన్యూ స్టాంపులను విక్రయించే పోస్టల్ సిబ్బంది సకాలంలో రిజిస్ట్రేషన్ల శాఖకు సమాచారం అందించకపోవడమే రాష్ట్రవ్యాప్తంగా కొరత ఏర్పడడానికి కార ణంగా తెలుస్తోంది. రెండు నెలలుగా అన్ని జిల్లాల్లోనూ రెవెన్యూ స్టాంపులు లభించక వినియోగదారులు ఒక రూపాయి విలువైన స్టాంపును బ్లాక్ మార్కెట్లో రూ.5లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ స్టాంపుల బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకోసం అన్ని జిల్లాల్లో వినియోగదారులకు స్టాంపులను పుష్కలంగా అందుబాట్లో ఉంచాలని రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోస్టల్‌శాఖ పరిధిలోని అన్ని పోస్టాఫీసులతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ రెవెన్యూ స్టాంపులను వినియోగదారులకు అందుబాట్లో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంతో పాటు స్టాంపులను బ్లాక్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రూ.5వేలకు పైగా విలువైన చెల్లింపు రశీదులకు, ప్రామిసరీ నోటులకు తప్పనిసరిగా ఒక రూపాయి రెవెన్యూ స్టాంపు అవసరమౌతోంది. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ చట్టం ప్రకారం ఆయా లావాదేవీలకు ఒక రూపాయి స్టాంప్‌డ్యూటీ చెల్లించాల్సి ఉంది. ఈ విధంగా రూపాయి రెవెన్యూ స్టాంప్‌పై సంతకం చేసిన డాక్యుమెంట్లనే న్యాయస్థానం సరైన(వ్యాలిడ్) పత్రాలుగా భావిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో రైతులు బ్యాంకుల నుంచి, ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుంచి అప్పులు పొందేందుకు కూడా రెవెన్యూ స్టాంపుల అవసరమేర్పడింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లశాఖ రెవెన్యూ స్టాంపులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తుండడంతో ఒకట్రెండు రోజుల్లోనే స్టాంపుల బ్లాక్ మార్కెట్‌కు తెరపడనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే రెవెన్యూ స్టాంపులతో పాటు రిజిస్ట్రేషన్ స్టాంపులను కూడా మార్కె ట్లో పుష్కలంగా అందుబాటులో ఉంచామని, ఎంత విలువైన స్టాంపులనైనా వినియోగదారులు బ్లాక్మార్కెట్లో కొనే అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. -
యూరియా కోసం యుద్ధం
ఆత్మకూరురూరల్ : తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగు ఆలస్యమై ఆవేదన చెందుతున్న రైతును యూరియా కృత్రిమ కొరత వేధిస్తుంది. బ్లాక్ మార్కెట్లో యూరియాను అధిక ధరలు విక్రయిస్తుండటం, వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా ఎమ్మార్పీకే యూరియా లభిస్తుండటంతో రైతులు ఎగబడుతున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మకూరులోని గ్రోమోర్ ఎరువుల దుకాణం, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీల ఆధ్వర్యంలో ఎమ్మార్పీ ధరలకే యూరియా లభ్యమవుతోంది. ఈక్రమంలో వారం రోజు లుగా రైతులు ఈ రెండు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. శుక్రవారం మూడు లోడ్ల యూరియా గ్రోమోర్ దుకాణానికి చేరడంతో రైతులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో కార్యాలయ సిబ్బందికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒక కార్యాలయ ఉద్యోగి యూరియా కావాల్సిన రైతుల పేర్లు ఓ జాబితాలో నమోదు చేశాడు. గ్రోమోర్ కేంద్ర కార్యాలయం నుంచి యూరియా పంపిణీ చేయాలని సకాలంలో ఉత్తర్వులు రాకపోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా చేయలేదు. ఓ తరుణంలో మేనేజరు ఈశ్వర్‌రెడ్డితో రైతులు తగాదాకు దిగారు. దీంతో రైతులకు సమాధానం చెప్పలేక సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఆత్మకూరు ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి తన సిబ్బందితో గ్రోమోర్ కార్యాలయానికి చేరుకుని జాబితాలో ఉన్న ప్రకారం ప్రతి రైతుకు నాలుగు బస్తాల వంతన స్టాకు ఉన్నంత వరకు అందజేస్తారని క్యూలో నిలబడాలని సర్దుబాటు చేసి చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
ఎరువు..బరువు
దర్శి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా రైతులకు తక్కువ ధరలకు పంపిణీ చేయాల్సిన ఎరువులను ఎక్కువ మొత్తాలకు అమ్ముకుని లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులే సొసైటీ అధ్యక్షులు కావడంతో వారి ఇష్టారాజ్యంగా రైతులను దోచుకుంటున్నారు. తూర్పువెంకటాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఇప్పటి వరకు 700 టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. వీటిలో కొద్దో గొప్పో మాత్రమే రైతులకివ్వగా.. మిగతా మొత్తం బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. 50 కిలోల యూరియా బస్తా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం రూ. 298లకే అమ్మాలి. అయితే తూర్పువెంకటాపురం సొసైటీలో బిల్లు మాత్రం రూ.298లు రాసి రూ.320 తీసుకుంటున్నారు. మరో రూ.4 కూలి ఖర్చుల కింద తీసుకుంటున్నారు. ఇదేమని రైతులు ప్రశ్నిస్తే ఇష్టమైతే తీసుకోండి..లేకుంటే వెళ్లిపోండి అని తెగేసి చెబుతున్నారు. లేదంటే సొసైటీలో స్టాక్ లేదని..బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచుతున్నారు. బ్లాక్ మార్కెట్లో బస్తాకు రూ.100 నుంచి రూ.150 వరకు అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయలేక..సొసైటీలో ఎరువులు సరిగా అందించక రైతులు విలవిల్లాడుతున్నారు. కొందరు రైతులు తిరగబడి ఎరువులు ఎందుకు ఇవ్వరని సొసైటీ అధ్యక్షురాలి భర్త పణిదపు వెంకటరామయ్యను మంగళవారం నిలదీయగా..ఆయన మౌనం వహిం చారు. వెంకట రామయ్య టీడీపీ నాయకుడు కావడంతో అధికారులు కూడా ఆయనకే మద్దతు తెలుపుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఏడీ మాలకొండారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా ఎరువులు నిల్వ చేసుకునేందుకు దర్శిలో ఎక్కువ అద్దె చెల్లించి గోడౌన్ తీసుకోవడంతో పది రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చింద ని, ఇక్కడకు వచ్చాక రూ.22 ఎక్కువ అమ్ముతున్నట్లు రైతులు తెలిపారని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిందిగా సొసైటీ అధ్యక్షురాలి భర్త పణిదపు వెంకట్రామయ్యను ఆదేశించామన్నారు. -
బొలీవియా
ప్రపంచవీక్షణం నైసర్గిక స్వరూపం ఖండం - దక్షిణ అమెరికా వైశాల్యం - 10,98,581 చ.కి.మీ. జనాభా - 1,05,56,102 (తాజా జనాభా లెక్కల ప్రకారం), రాజధాని- లా పాజ్, కరెన్సీ - పెసో, ప్రభుత్వం - యునిటరీ ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూష నల్ రిపబ్లిక్, భాషలు- స్పానిష్, క్వెచువా, అయిమారా, మతం - క్రైస్తవులు వాతావరణం - జనవరి-జులై మధ్య 1 నుండి 17 డిగ్రీలు, ఆగష్టు -డిసెంబర్ మధ్య 6 నుండి 19 డిగ్రీలు ఉంటుంది. పంటలు - బంగాళదుంప, మొక్కజొన్న, చెరకు, వరి, కసావా, కాఫీ, లామాస్. ఖనిజాలు - తగరం, రాగి, సీసం, జింకు, సల్ఫర్, ఇనుము, సహజవాయువులు, టంగ్స్టన్, వెండి, బంగారం, బిస్మత్, ఆంటిమొనీ మొదలైనవి. పరిశ్రమలు - గనులు, సహజవాయువులు, చమురుశుద్ధి, దుస్తులు, హండీక్రాప్ట్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ పరిశ్రమ, ఎగుమతులు - తగరం, ఆంటిమోనీ, టంగ్స్టన్, జింకు, వెండి, సీసం, సహజవాయువులు. స్వాతంత్య్రం వచ్చింది - 1825 ఆగష్టు 6న, సరిహద్దులు - పరాగ్వే, చిలీ, అర్జెంటీనా, పెరూ, బ్రెజిల్ పరిపాలన దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 9 డిపార్ట్మెంట్లుగా విభజించారు. వీటిని తిరిగి ప్రావిన్స్‌లుగా, మున్సిపాలిటీలుగా, కాంటన్‌లుగా విభజించారు. అన్ని ప్రాంతాల్లో స్వతంత్రపాలన ఉంటుంది. అన్నింటినీ దేశాధ్యక్షుడు పర్యవేక్షిస్తాడు. మనదేశంలో రాష్ట్రాలు, జిల్లాలు, మున్సిపాలిటీలుగా విభజించినట్లన్నమాట. ప్రజలు-సంస్కృతి: ఇక్కడ లాటిన్ అమెరికా సంస్కృతి దర్శనమిస్తుంది. దేశప్రజలు తమ గతకాలపు సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ దేశవాళీ పండుగలను నిర్వహించుకుంటారు. వీటిలో ముఖ్యమైనది-‘కాపోరేల్స్’ దీనిని దేశమంతటా జరుపుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రీతులలో వస్త్రధారణ చేస్తారు. మొత్తంగా చూస్తే దేశంలో 30 రకాల వస్త్రరీతులు కనబడతాయి. మహిళలు భుజాల నుండి మోకాళ్ల కింది వరకు వచ్చే స్కర్టు ధరిస్తారు. ఆహారం: ఇక్కడి ప్రజలు తినే మధ్యాహ్న భోజనాన్ని అల్‌మూర్జో అంటారు. ఈ భోజనంలో సూప్, మాంసం, అన్నం, బంగాళదుంపలు ఉంటాయి. ఉదయంపూట మనం తినే కజ్జికాయలు లాంటివి తయారుచేస్తారు. వీటిని వెన్న, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, లోకోటోలతో కలిపి తయారుచేస్తారు. పందిమాంసం, సూప్, బీన్స్‌వేపుడు వంటివాటిని భోజనంలో తీసుకుంటారు. బొలీవియా టీ(చాయ్)ని ఆపి అంటారు. ఇది నిమ్మరసం, మొక్కజొన్నపిండి, యాలకులు, లవంగాలు, కోకో ఆకులు మిశ్రమం చేసి పొడిని తయారుచేసి ఆ పొడిని వేడినీటిలో వేసి కాచి వడబోసి తాగుతారు. వరి అన్నం, వెన్న కలిపి తయారు చేసే వంటకాన్ని ఆర్రోజ్ కాన్ క్వెసో అంటారు. బొలీవియాలో వరి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ వరిధాన్యం బాగా పండుతుంది. 1. లాపాజ్: బొలీవియా దేశానికి పరిపాలన రాజధాని నగరం. ఈ నగరం మొత్తం కొండలపైనే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తై రాజధాని నగరం లాపాజ్. ఇది భూమి నుండి దాదాపు 3650 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదే. ఈ నగరం 15వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. చుట్టూ ఆండీస్ పర్వత శ్రేణులు నగరాన్ని ఎంతో అందాన్ని ఇస్తుంటాయి. నగరంలో సగర్‌నాగ వీధి ఎప్పుడూ యాత్రీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నగరంలో దయ్యాల మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్లో ఎండబెట్టిన కప్పలు, కొన్ని సముద్ర జంతువులను అమ్ముతారు. బ్లాక్ మార్కెట్ అని పిలుచుకునే మెర్కాడో నెగ్రో అనే ప్రాంతంలో ఎక్కువగా దుస్తులు, సంగీత పరికరాలు అమ్ముతారు. నగరంలో ఇంకా కల్లెజాన్, ప్లాజా మురిల్లో, వల్లెడిలా లూనా ప్రాంతాలతో బాటు సాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియం, టివనాకు మ్యూజియం, కోకా మ్యూజియం, మ్యూజియం ఆఫ్ మెటల్స్లను చూడాల్సిందే! 2. వెండి గనులు: బొలీవియాలో వెండిగనులు పోటోసిలో ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుశకం 1545 నుండి కొండలను తవ్వి వెండిని తీస్తున్నారు. ఈ నగరాన్ని సెర్రోరికో అంటారు. ఒకప్పుడు ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా పేరుగాంచింది. ఈ గనులలోకి పర్యాటకులు వెళ్ళి అక్కడి గనుల తవ్వకాన్ని, ముడి ఖనిజాలను స్వయంగా చూడవచ్చు. ఈ గనులు భూమికి 240 మీటర్ల లోతులో ఉంటాయి. గనిలోపలి భాగాన్ని పైలావిరి అంటారు. ఇందులోకి పర్యాటకులు నేరుగా వెళ్ళే అవకాశం ఉంది. గని ముందుభాగంలో గనులరాజు బొమ్మ విచిత్రంగా కనబడుతుంది. ఇక్కడ వెండిని గత 455 సంవత్సరాలుగా నిరంతరం వెలికితీస్తూనే ఉన్నారు. ఈ గనులలో దాదాపు 10 వేలమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. 3. ఉయుని ఉప్పు మైదానం: ఇది పోటోసి నగరానికి సమీపంలో ఉంది. దేశానికి దక్షిణ భాగంలో ఉంది. ఇది 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఉప్పు మైదానంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఉప్పు ఎడారిగా పిలవవచ్చు. ఈ ఉప్పు మైదానం సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఇలా ఉప్పు ఎడారి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక సముద్ర ద్వీపం. దాదాపు 13వేల సంవత్సరాల క్రితం ఇందులోని నీరంతా ఆవిరైపోయి ఉప్పు మాత్రమే మిగిలింది. మధ్యభాగంలో ఉప్పు 10 మీటర్ల మందంలో ఉంటుంది. ఈ ఉప్పు ఎడారి మీద నిలబడితే మేఘాలు మనల్ని తగులుతూ కదులుతుంటాయి. పర్యాటకులకు ఇదో విచిత్రమైన అనుభవం. ఎప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఎడారిమీద గాలివీయడం వల్ల మైదానంలో పాలిహైడ్రల్ గుర్తులు ఏర్పడతాయి. వాటిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఫ్లెమింగోలు, ఆండియన్‌జాతి నక్కలు అధికంగా అగుపిస్తాయి. రాజధాని లాపాజ్ నుండి దాదాపు 12 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. 4. జెసూట్ మిషన్స్: ఇది ఒకప్పుడు అడవి. ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆటవికులనందరినీ క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత స్పెయిన్ దేశం బొలీవియాను తమ అధీనంలోకి తీసుకున్నాక ఈ ప్రాంతంలో చర్చిల నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతాన్ని చికిటో అంటారు. ఈ ప్రాంతం 16వ శతాబ్దంలో కనుగొనబడి నేటికీ ఆనాటి వాతావరణంలోనే ఉండడం ఒక గొప్ప విశేషం. ఇక్కడి నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే విషయం. చర్చిల లోపల ఎంతో అందమైన నిర్మాణశైలి కనబడుతుంది. బంగారంతో చేసిన అలంకరణలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రదేశం సాంటాక్రజ్‌కు సమీపంలో ఉంది. మొదట జెసూట్లు ఇక్కడికి వచ్చి భూమి మీద దేవుడి నగరాన్ని నిర్మించాలని పూనుకున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళితే 17వ శతాబ్దపు కాలంలోకి వెళ్లినట్లుగా అనుభూతి కలుగుతుంది. 1991లో ఈ మొత్తం ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేసింది. చరిత్ర: దక్షిణ అమెరికా ఖండంలో బొలీవియా ఒక నిత్యదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న దేశం. ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. ప్రభుత్వ అస్థిరత చాలా తీవ్రంగా ఉంది.16వ శతాబ్దంలో ఈ దేశం స్పెయిన్ దేశపు రాజుల అధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ పనులు చేయడానికి భారతదేశం నుండి ప్రజలను తీసుకువచ్చి బానిసలుగా మార్చి, వ్యవసాయ పనులు చేయించారు. అలా భారతీయులు శతాబ్దాలుగా అక్కడ బానిసలుగా బ్రతికి, ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అక్కడ ప్రజలుగా మారిపోయారు. ఇతర దేశాలు వీలైనంతగా ఈ దేశ భూభాగాన్ని లాక్కున్నాయి. 1952 తర్వాత మాత్రమే భారతసంతతి వారికి కొంత లాభం చేకూరింది. దేశంలో దాదాపు 50 శాతం భూమి వ్యవసాయానికి గానీ, నివాసానికి గానీ వీలుగా లేదు. జనాభా అంతా కేవలం 50 శాతం భూభాగంలోనే కేంద్రీకృతమైంది. -
బ్లాక్ మార్కెట్ నిజరూపాన్ని బయటపెట్టండి
విశాఖ పర్యటనలో అభిమానులకు పవన్ కల్యాణ్ పిలుపు విశాఖపట్నం సిటీ: సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుందామనుకునే అక్రమ వ్యాపారస్తుల నిజరూపాన్ని బయటపెట్టాలని జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు బుధవారం విశాఖలోని ఫిషింగ్ హార్బర్, పెదజాలారీ పేటల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్నపుడు ప్రజలకు సేవ చేయాలేగానీ ధరలు పెంచి దోపిడీ చేయడం మహా పాపం అన్నారు. నిత్యావసరాలను అక్రమ మార్గాలకు మళ్లించొద్దని అలాంటివి చేస్తే అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తుపాను బాధితుల కష్టాలను ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాసరావు, ఎంపీ కంభంపాటి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.