Blue chip
-
ఐవోసీ భారీ పెట్టుబడులకు రెడీ
న్యూఢిల్లీ: నంబర్ వన్ ఇంధన రిటైల్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. ఈ దశాబ్దంలో రూ. 4 లక్షల కోట్లకుపైగా వెచి్చంచనున్నట్లు ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీ తాజాగా వెల్లడించింది. తద్వారా చమురు శుద్ధి, పెట్రోకెమికల్ బిజినెస్‌ల విస్తరణతోపాటు.. ఇంధన పరివర్తన ప్రాజెక్టులలోనూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. వెరసి 360 డిగ్రీల ఇంధన దిగ్గజంగా ఆవిర్భవించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలియజేశారు. విభాగాలవారీగా.. తాజా పెట్టుబడుల్లో రూ. లక్ష కోట్లను చమురు శుద్ధి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. పూర్తి కర్బనరహిత(నెట్ జీరో) కార్యకలాపాలను సాధించే బాటలో రూ. 2.4 కోట్లను సంబంధిత ప్రాజెక్టులకు కేటాయించనుంది. ఒడిషాలోని పారదీప్‌లో అత్యంత భారీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై మరో రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో దేశీయంగా పెరుగుతున్న ఇంధన అవసరాలను అందుకోవడంతోపాటు.. ఇంధన పరివర్తనను సైతం సాధించే వీలున్నట్లు కంపెనీ సాధారణ వార్షిక సమావేశంలో వాటాదారులకు ఐవోసీ చైర్మన్ వైద్య వివరించారు. దేశీ ఇంధన మార్కెట్లో 40 శాతం వాటాను ఆక్రమిస్తున్న కంపెనీ 2046కల్లా పూర్తి కర్బన రహిత కార్యకలాపాలను సాధించాలని ఆశిస్తోంది. భారీ పెట్టుబడుల కారణంగా రిఫైనింగ్ సామర్థ్యాలను 33 శాతంమేర పెంచుకోనున్నట్లు వైద్య తెలియజేశారు. దీంతో త్వరలోనే 10.7 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యానికి చేరుకోనున్నట్లు వెల్లడించారు. బీఎస్ఈలో ఐవోసీ షేరు వారాంతాన 0.5 శాతం నీరసించి రూ. 92 వద్ద ముగిసింది. -
ఇన్వెస్టర్లకు లాభాల్ని తెచ్చిపెడుతున్న మ్యూచువల్ ఫండ్ ఇదే
దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. సెబీ 2017లో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వర్గీకరణకు ముందు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండేది. అనంతరం ఎక్కువ పెట్టుబడులను లార్జ్ క్యాప్ విభాగానికి కేటాయించే విధంగా మార్పులు చేసింది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం కిందకు ఇది వస్తుంది. 5 స్టార్ రేటెడ్ పథకం కావడం గమనార్హం. రాబడులు ఈ పథకంలో ఏడాది రాబడులు 19 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో వార్షికంగా 26 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. అలాగే, ఐదేళ్లలో వార్షికంగా 17 శాతం, ఏడేళ్లలో వార్షికంగా 18 శాతం, పదేళ్లలో 23 శాతం చొప్పున రాబడులను అందించింది. కానీ, ఈ పథకం రాబడులకు ప్రామాణికంగా భావించే బీఎస్ఈ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ సూచీ పెరుగుదల ఏడాదిలో 21 శాతం, మూడేళ్లలో 24 శాతం, ఐదేళ్లలో 14 శాతం, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో 14.58 శాతం చొప్పునే ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. ఏడాది కాలం మినహాయిస్తే మిగిలిన అన్ని కాలాల్లోనూ ప్రామాణిక సూచీ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. ఇక ఈ పథకం 2010 జూలై 9న ప్రారంభం కాగా, నాటి నుంచి చూస్తే ఏటా 19.74 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడులను తెచ్చి పెట్టింది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం, గరిష్టంగా 65 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, మిడ్‌క్యాప్‌లో కనీసం 35 శాతం పెట్టుబడులు పెడుతుంటుంది. ఈ పథకం గత పనితీరును పరిశీలించినట్టయితే కొన్ని సందర్భాల్లో వెనుకబడినప్పటికీ.. తర్వాతి సంవత్సరాల్లో అద్భుత రాబడులతో సగటున మెరుగైన పనితీరును చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ముఖ్యంగా భవిష్యత్తులో బ్లూచిప్ కంపెనీలుగా అవతరించే సామర్థ్యాలున్న మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీలను గుర్తించి వాటిల్లో ఎక్స్పోజర్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.25,332 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం తనవద్దనున్న పెట్టుబడుల్లో 98.66 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంది. ముఖ్యంగా మెగాక్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 55 శాతానికి పైనే పెట్టుబడులు కలిగి ఉండగా, మిడ్‌క్యాప్‌లో 40 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు కలిగి ఉంది. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ కొంచెం అదనపు రాబడులను దీర్ఘకాలంలో ఇస్తాయి. కనుక మూడు విభాగాల్లోనూ ఎక్స్పోజర్ ఉండడం రాబడుల పరంగా అనుకూలమైనది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 79 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 28 శాతం వరకు పెట్టుబడులను ఈ రంగంలోని కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 9 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆటోమొబైల్ కంపెనీలకు 8.32 శాతం పెట్టుబడులు కేటాయించింది. టెక్నాలజీ రంగ కంపెనీల్లో 8.23 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7.85 శాతం, సేవల రంగ కంపెనీల్లో 7.66 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. -
బ్లూచిప్ షేర్ల దన్ను
ట్రేడింగ్ చివర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, వివిధ దేశాల తయారీ రంగ గణాంకాలు ఆర్థిక ‘రికవరీ’ సంకేతాలిస్తుండటం, అమెరికా అదనంగా ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు కలసివచ్చాయి. అయితే చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపడంతో లాభాలకు కళ్లెం పడింది. సెన్సెక్స్ 185 పాయింట్ల లాభంతో 39,086 పాయింట్ల వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పెరిగి 11,535 పాయింట్ల వద్ద ముగిశాయి. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 18 పైసలు క్షీణించి 73.03 వద్దకు చేరింది. 5 సార్లు నష్టాల్లోంచి లాభాల్లోకి... సెనెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. మధ్యాహ్నం వరకూ పరిమిత శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. నష్టాల్లోంచి ఐదుసార్లు లాభాల్లోకి వచ్చిందంటే ఒడిదుడుకులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒక దశలో 165 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ మరో దశలో 245 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంతా 406 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు ముదురుతుండటంతో ఒడుదుడుకులు చోటు చేసుకుంటున్నాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5.7 శాతం లాభంతో రూ. 642.75 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సూచిస్తున్నారు. ► రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2 శాతం లాభంతోరూ. 2,128 వద్దకు చేరింది. సెన్సెక్స్ మొత్తం లాభాల్లో ఈ షేర్ వాటాయే మూడింట రెండు వంతులు ఉండటం విశేషం. సెన్సెక్స్ మొత్తం 185 పాయింట్ల లాభంలో రిలయన్స్ వాటాయే 120 పాయింట్ల మేర ఉంది. సూచిస్తున్నారు. ► జీ ప్లెక్స్ పేరుతో సినిమా–టు–హోమ్ సర్వీస్‌ను అందించనుండటంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ ధర 8 శాతం వృద్ధితో రూ.217 వద్ద ముగిసింది. సూచిస్తున్నారు. ► ఆగస్టులో వాహన విక్రయాలు పుంజుకోవడంతో వాహన షేర్లు లాభపడ్డాయి. సూచిస్తున్నారు. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీఎస్టీ టిల్లర్స్, అదానీ గ్రీన్, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్ షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. సూచిస్తున్నారు. ► నిధుల సమీకరణ వార్తల కారణంగా వొడాఫోన్ ఐడియా షేర్ 11 శాతం లాభంతో రూ.9.91కు చేరింది. సూచిస్తున్నారు. ► ఫ్యూచర్ గ్రూప్ షేర్లతో సహా మొత్తం 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. మరోవైపు 256 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. -
మీ లక్ష్యాలకు గన్ షాట్
దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో దూకుడైన రాబడులు రెండూ ఈ పథకంలో భాగం. ఎందుకంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. రాబడులు ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ రాబడుల విషయంలో మెరుగైన పనితీరును నిరూపించుకుంది. ఏడాది కాలంలో 10.2 శాతం, మూడేళ్లలో వార్షికంగా 18.6 శాతం, ఐదేళ్లలో 21 శాతం వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా చూసే ‘నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250టీఆర్ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 2 శాతం, 14.5 శాతం, 12.8 శాతంగానే ఉండడం గమనార్హం. బెంచ్ మార్క్‌తో చూసుకుంటే 4–6 శాతం అధిక రాబడులు అందించింది. అంతేకాదు ఇదే విభాగంలోని కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, ఎల్అండ్టీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాల కంటే పనితీరు పరంగా ముందుండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది. పెట్టుబడుల విధానం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌నకు 35–65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి 99.52 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉండగా, పెట్టుబడుల్లో కేవలం 0.48 శాతమే నగదు రూపంలో కలిగి ఉంది. ప్రస్తుతం 50.5 శాతం వరకు లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయగా, మరో 43 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో, 6.43 శాతం మేర స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 61 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 37.63 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 33 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాత హెల్త్‌కేర్‌లో 12.59 శాతం, ఇంధన రంగ స్టాక్స్‌లో 8 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ తీవ్ర అస్థిరతలు, దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. గత ఏడాది కాలంలో లార్జ్‌క్యాప్ సూచీ 7 శాతం లాభపడితే, మిడ్‌క్యాప్ సూచీ 4 శాతం పడిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఈ పథకం గడిచిన ఏడాది కాలంలో 10 శాతం మేర రాబడులు అందించిందంటే దీని పనితీరుకు ఇదే నిదర్శనం. 2011, 2018 మార్కెట్ కరెక్షన్లలో నష్టాలను పరిమితం చేయడాన్ని కూడా పరిశీలించొచ్చు. -
ఫలితాలు, గణాంకాలే కీలకం
* మార్కెట్‌పై ప్రభావం చూపనున్న అంశాలు ఇవీ.. * ఈ వారంలోనే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఫలితాలు * ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా * ప్రపంచ మార్కెట్ల పోకడ ముంబై: బ్లూ చిప్ ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు... ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి బ్లూచిప్ ఐటీ కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే రానున్నాయి. నవంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, డిసెంబర్ నెల వినియోగదారుల, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఈ వారంలోనే రానున్నాయి. ఈ అంశాలతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, రూపాయి కదలికలు ఈ వారం మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌లతో పాటు హిందూస్తాన్ యూనిలివర్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్‌ఇంద్ బ్యాంక్ తదితర దిగ్గజ కంపెనీలు ఈ వారంలోనే తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. జనవరి 12న టీసీఎస్, 14న ఇన్ఫోసిస్ ఫలితాలు వెలువడతాయి. ఈ వారంలో పలు కీలకాంశాలు చోటు చేసుకోనున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేస్తుందని, వీటితో పాటు పలు ప్రధాన కంపెనీలు తమ క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడిస్తాయని పేర్కొన్నారు. డాలర్‌తో రూపాయి మారకం చలించే తీరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు కదలికలు మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని వివరించారు. ‘అంతర్జాతీయ’ ప్రభావమే అధికం ! భారత కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాల ప్రభావం కంటే అంతర్జాతీయ సంకేతాల ప్రభావమే ఈ వారంలో స్టాక్‌మార్కెట్‌పై అధికంగా ఉంటుందని రిలయన్స్ సెక్యూరిటీస్ సంస్థ అభిప్రాయ పడింది. అంతర్జాతీయ సంకేతాల్లో ఎలాంటి మెరుగుదల ఉండకపోవచ్చని పేర్కొంది. అందువల్ల ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. నాణ్యత గల షేర్లపైననే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంపై తాజా ఆందోళనలు, ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడం వంటి కారణాల వల్ల గత వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1,227 పాయింట్లు(4.68 శాతం) నష్టపోయింది. డెట్ మార్కెట్లో ‘విదేశీ’ జోరు భారత డెట్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,700 కోట్లకు పైగా డెట్‌మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. గత ఏడాది మొత్తం మీద భారత డెట్‌మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల నికర పెట్టుబడులు రూ.45,856 కోట్లుగా ఉన్నాయి. డిపాజిటరీ సంస్థలు వెల్లడించిన గణాంకాల ప్రకారం.., ఈ నెల 8వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా డెట్ మార్కెట్లో రూ.3,706 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చితే రూపాయి ఒకింత స్థిరంగా ఉండడం వల్ల డెట్ మార్కెట్లో ఈ స్థాయిలో విదేశీ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 50 డాలర్లలోపే ఉండడం, కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉండడం, రూపాయి అవుట్‌లుక్ సానుకూలంగా ఉండడం వంటి అంశాలూ ప్రభావం చూపాయని వారంటున్నారు. ఇక చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆందోళన కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.493 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం క్యాపిటల్ మార్కెట్లో జనవరి 1-8 కాలానికి వీరి నికర పెట్టుబడులు రూ.3,214 కోట్లుగా ఉన్నాయి. -
బ్లూచిప్ కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు
మూడో రోజూ పతన బాటలోనే... 24 మైనస్‌తో 26,813కు సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో 8,131కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసింది. వాహన, లోహ షేర్ల పతనం కారణంగా గురువారం స్టాక్‌మార్కెట్ 24 పాయింట్లు నష్టపోయి 26,813 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 8,131 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడంతో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్ నష్టాలు తక్కువ స్థాయికే పరిమితమయ్యాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా యూరోప్ మార్కెట్లు పతనం కావడం, డాలర్‌తో రూపాయి మారకం 20 నెలల కనిష్ట స్థాయికి (64.25) క్షీణించడం కూడా ప్రభావం చూపాయి. లోహ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు బలహీనంగా ట్రేడయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్తు, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గ్రీస్ రుణ సంక్షోభంపై నేడు(శుక్రవారం) కీలకమైన ఫలితం తేలనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ మార్కెట్‌పై విశ్లేషించారు. 397 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ సెన్సెక్స్ 26,941 పాయింట్లతో లాభాల్లోనే ప్రారంభమైంది. గత2 సెషన్లలో బాగా నష్టపోయిన బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లతో 26,949 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 26,552 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ చివర్లో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్, ఆర్థిక సేవల సంస్థల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సెన్సెక్స్ మరీ పతనం కాకుండా అడ్డుకుంది, మొత్తం 397 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టాటా స్టీల్ 2 శాతం డౌన్ మ్యాగీ వివాదంతో నెస్లే ఇండియా షేర్ 2.8% క్షీణించి రూ.6,011 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో, 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. పెన్షన్ స్కీమ్ విషయమై కార్మిక సంఘాలు సమ్మెకు మొగ్గుచూపుతున్నాయన్న వార్తల కారణంగా టాటా స్టీల్ 2.5 శాతం క్షీణించి 308 వద్ద ముగిసింది. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,681 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,661 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,91,093 కోట్లుగా నమోదైంది. -
బ్లూచిప్ షేర్ల ర్యాలీపై సెబి కన్ను
న్యూఢిల్లీ: బ్లూచిప్‌లతో సహా పలు కంపెనీల షేర్లు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం, వాటి ట్రేడింగ్‌లో భారీ టర్నోవర్ నమోదుకావడంపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి దృష్టిపెట్టింది. ఎక్స్ఛేంజీలకు తగిన వివరణనివ్వని కంపెనీలపై సెబి చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు నెలన్నరకాలంలో వివిధ షేర్ల ర్యాలీకి సంబంధించి ఆయా కంపెనీల నుంచి స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి వివరణ కోరాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలీవర్, ఎస్బీఐ, కోల్ ఇండియా, విప్రో, హీరోమోటో కార్ప్, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా, ఎల్ అండ్ టీ తదితర సెన్సెక్స్ బ్లూచిప్ కంపెనీల షేర్లున్నాయి. ఈ సెన్సెక్స్ కంపెనీలతో పాటు ఈ ఏడాది ఇప్పటివరకూ దాదాపు 100 కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు అందుకున్న కంపెనీల్లో పిపవావ్ డిఫెన్స్, సుజ్లాన్ ఎనర్జీ, క్లారిస్ లైఫ్, ఐడీఎఫ్సీ, అదాని ఎంటర్ప్రైజెస్, ఇప్కా లాబ్స్, ఆర్ఈఐ ఆగ్రో, ఎంఆర్ఎఫ్, పంజ్‌లాయడ్, బ్లూడార్ట్, పీవీఆర్, ఐఆర్బీ ఇన్ఫ్రా, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌లు వున్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా ఇన్వెస్టర్లకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, వాటి షేరు ధరల్ని ప్రభావితం చేసే కీలక వాణిజ్య పరిణామాలకు సంబంధించిన వార్తలు మీడియాలో రావడంపై ఆయా కంపెనీలను ఎక్స్ఛేంజీలు వివరణ కోరాయి. అయితే చాలా కంపెనీలు సమాధానం ఇవ్వకపోవడం లేదా సంతృప్తికర వివరణ ఇవ్వకపోవడంతో తదుపరి చర్యల కోసం ఈ కేసుల్ని ఎక్ఛేంజీలు సెబికి నివేదించాయి.