Bogatha Waterfall
-
బొగత జలపాతం..చూడతరమా (ఫొటోలు)
-
తెలంగాణలో తప్పక చూడాల్సిన ప్రకృతి చెక్కిన సుందర జలపాతాలు (ఫొటోలు)
-
దంచికొడుతున్న వానలు.. ప్రమాద స్థాయిలో బొగత జలపాతం, రెడ్ అలర్ట్!
సాక్షి, వరంగల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురులా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ కి గోదావరితో పాటు ఇంద్రావతినది వరద భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగ, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాజేడు మండలం బొగత జలపాతంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాద స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది జలపాతం వద్దకు పర్యటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. (కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!) ఉప్పొంగిన వాగులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుమ్రంబీమ్ జిల్లా లో పెన్ గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో కలెక్టర్ హెమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. (ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి) -
Warangal: అందుబాటులోకి ఎకో టూరిజం.. చుట్టేద్దాం రండి!
బిజీ లైఫ్‌లో కాస్త ఊరట కోసం.. ఒత్తిడితో కూడిన జీవన విధానంలో కొంత మార్పుకోసం.. మానవ జీవితంతో ముడిపడిన అద్భుతమే ప్రక్రియ పర్యాటకం. వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రకృతి అందాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పలు ప్రదేశాల వీక్షణకు ప్రస్తుతం మరోసారి అవకాశం లభించనుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎకో టూరిజానికి కరోనా తర్వాత తిరిగి అనుమతి లభించడంతో అందుకు తగిన ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. సాక్షి, వరంగల్: కరోనా కారణంగా నిలిచిన ఎకో టూరిజం పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. గత రెండేళ్ల క్రితం ఏటూరునాగారం అభయారణ్యం తాడ్వాయిలో పర్యాటకుల ఆనందం కోసం ఎకో టూరిజాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులు ఆన్లైన్ ద్వారా ఈ ఎకో టూరిజం కోసం బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో సైకిల్ ట్రాకింగ్, చిల్ర్డన్ ప్లే ఏరియా, వాక్ కెనాపిను వన కుటీరం ఏర్పాటు చేశారు. రెండేళ్ల క్రితం నుంచి కరోనా కారణంగా ఎకో టూరిజం నిలిచిపోయింది. మళ్లీ ఎకో టూరిజం ఆన్లైన్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ వారంలో తాడ్వాయి వైల్డ్ లైఫ్ ప్రాంతంలో ఎకో టూరిజం అందుబాటులోకి రానుంది. చిల్ర్డన్స్ ప్లే ఏరియా తెరుచుకోనున్న అధ్యయన కేంద్రం ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ గురించి తెలిపేలా.. పర్యావరణ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేశారు. అభయారణ్యంలో ఉండే పక్షలు, అటవీ జంతువుల, చెట్లు బొమ్మలను కళ్లకు కట్టినట్లుగా చూపారు. వాక్ కెనాపీని మరమ్మతులు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ట్రెకింగ్ సైకిళ్లు మరమ్మతులకు రావడంతో కొత్త సైకిళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే వన కుటీరాల్లో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. పర్యావరణ అధ్యయన కేంద్రం కొత్త సఫారి పర్యాటకులు అడవుల్లో నేరుగా పర్యటించేందుకు కొత్తగా సఫారీ ఏర్పాటు చేయనున్నారు. తాడ్వాయి ఆర్చి నుంచి గ్రాస్ ప్లాంట్ దారి గుండా హైవే రోడ్డు అడవిలో నుంచి మేడారం మార్గంలోకి.. తాడ్వాయి సమీపంలోని సారలమ్మ గుడి నుంచి కామారం సమీపాన రాక్షస గుహలను సందర్శించి, అక్కడి నుంచి చిన్నబోయినపల్లి నుంచి కొండాయి మీదుగా కొండేటి వాచ్‌టవర్ వ్యూ పాయింట్ వరకు అటవీ మార్గాన పర్యటనకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏర్పాట్లు చేస్తున్నాం ఎకో టూరిజం ఆన్లైన్ సేవలకు ఏర్పాట్లు చేస్తున్నాం. తాడ్వాయి వన కుటీరాల నుంచి ఆరు కిలోమీటర్లు అడవి మార్గం గుండా పర్యాటకులు సైకిల్ ట్రాకింగ్ నిర్వహించేలా ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నాం. ఈ వారంలో ఎకో టూరిజం సేవలను ప్రారంభిస్తాం. – చౌకాట్ హుసేన్, వైల్డ్‌లైఫ్ రేంజ్ అధికారి బొగత వద్ద ట్రెక్కింగ్.. ములుగు జిల్లా వాజేడు మండల మరిధిలోని బొగత జలపాతం వద్ద కొత్తగా ఏర్పాట్లను చేపట్టనున్నారు. కరోనా కాలంలో బొగత జలపాతం పర్యాటకుల సందడి లేక వెల వెల బోయింది. ఎకో టూరిజం కూడా దూరంగా ఉండటంతో పర్యాటకుల రాక పూర్తిగా తగ్గింది. మళ్లీ ఎకో టూరిజానికి పర్యాటక శాఖ ఉత్తర్వులతో జలపాతం వద్ద కొత్త హంగులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో 2 కిలో మీటర్ల వరకు ట్రెక్కింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం రహదారి సౌకర్యం లేకుండాపోయింది. దానిని అభివృద్ధి చేయడానికి ఉన్నతాధికారుల అనుమతులకు నివేదికలను పంపగా అనుమతులు వచ్చాయి. సైక్లింగ్ ప్రారంభిస్తున్న అటవీ శాఖ అధికారులు కొత్తగా 1.50 కిలో మీటర్ల పరిధిలో సఫారీ ట్రావెలింగ్కు అనుమతులను కోరగా ఆమోదం లభించింది. వీటిని త్వరలోనే అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, గతంలో ఉన్న సైక్లింగ్ ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో దానిని మరమ్మతులు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. జిఫ్ లైన్ సైతం దెబ్బ తిన్నప్పటికీ దానిని మరమ్మతులు చేసి పర్యాటకుల ఉత్సాహ పర్చడానికి వీలుగా అందించనున్నారు. బొగత వద్ద ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి చర్యలను చేపడుతున్నారు. లక్నవరం గోవిందరావుపేట: ములుగు జిల్లా గోవిందరావుపేట మండల పరి ధిలోని లక్నవరం సరస్సు సందర్శనకు పర్యాటక శాఖ అనుమతి లభించింది. కరోనా కాలంలో ఆపేసిన పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన కాజేట్లో ఉండేందుకు కరోనా కాలంలో అనుమతి నిరాకరించిన అధి కారులు ప్రస్తుతం అనుమతిస్తున్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జింకల పార్క్ తిరిగి ప్రా రంభించారు. సస్పెన్షన్ బ్రిడ్డిల నుంచి తూముల వరకు సైక్లింగ్, సమీపంలోని గుట్టలపై ట్రెక్కింగ్‌కు ఒక్కరికి రూ.100చొప్పున ప్రారంభించా రు. మరో పది రోజుల్లో నైట్ క్యాంపింగ్ ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో లక్నవరం ప్రాంతంలో వండర్ లా ను తలపించే విధంగా స్విమింగ్ ఏర్పాట్లను చేస్తున్నారు. -
‘బొగత’కు జనకళ.. వాహ్ మహబూబ్ ఘాట్
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద చాలా రోజుల తర్వాత పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. – వాజేడు వాహ్ మహబూబ్ ఘాట్ చుట్టూ ఎత్తయిన కొండలు... చెట్లతో ఎటు చూసినా పచ్చ తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చదనం మధ్యలో నల్లతాచు పాములా కనిపించే రోడ్డు మలుపులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్ సమీపంలోని మహబూబ్ ఘాట్ వద్ద కనిపించే ఈ దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్ధం పడుతున్నాయి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మహబూబ్ ఘాట్ అందాలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్ జూరాల ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత ధరూరు (గద్వాల): జూరాలకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 4,27,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 36 గేట్ల ద్వారా 3,63,993 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 3,66,006 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.557 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పుడమి పచ్చకోక కట్టినట్టు.. కనుచూపు మేర పచ్చటి పొలాలు.. ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమేఘాలు.. మధ్యలో పచ్చని చెట్లు.. పైర్లు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటు చూసినా పచ్చదనంతో సింగారించుకున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారు ప్రాంతమిది. – ఫొటో: కె.సతీష్, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, సిద్దిపేట సుందర జలపాతం.. వెళ్లడం కష్టం కొండలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారం సమీపంలోని రథంగుట్టపై ఉంది. ఇది దాదాపు వర్షాకాలం పొడవునా జాలువారుతూనే ఉంటుంది. అయితే దీని వద్దకు వెళ్లేందుకు మాత్రం దారిలేదు. మూడేళ్ల క్రితం పై భాగానికి వెళ్లే యత్నంలో ఓ యువకుడు రాళ్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. అప్పట్నుంచి ఎవరూ ఈ జలపాతం వద్దకు వెళ్లట్లేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – మణుగూరుటౌన్ -
ప్రకృతి సోయాగాల జలపాతం
-
జలపాతంలో పడి విద్యార్థి మృతి
వాజేడు (ఖమ్మం) : జలపాతం అందాలను ఆస్వాదించటానికి వెళ్లిన ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ నవభారత్ కాలనీకి చెందిన దరావత్ పవన్ (18) కొత్తగూడెంలోని నలంద కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం తన మిత్రులతో కలసి బొగత జలపాతం వద్దకు వచ్చాడు. జలపాతంలోని లక్ష్మీనరసింహా స్వామి ఆలయ సమీపం వద్ద ఉన్న రాళ్లపై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు పవన్ జారి జలపాతంలో పడ్డాడు. వెంటనే నీటిలో మునిగిపోవడంతో పర్యాటకులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. సుమారు గంట తర్వాత పవన్ మృతదేహాన్ని బయటకు తీశారు. -
బోగత జలపాతంలో యువకుడి గల్లంతు
వాజేడు (ఖమ్మం) : స్నేహితులతో కలిసి జలపాతంలోకి దిగిన యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వాజేడు మండలం బోగత జలపాతం వద్ద శనివారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా నల్లబల్లికి చెందిన అఖిల్ (20) స్నేహితులతో కలిసి బోగత జలపాతానికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి జలపాతంలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన అతను స్నేహితులు, స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేస్తున్నారు.