Bombardier
-
బొంబార్డియర్ సీఈవోతో గౌతమ్ అదానీ భేటీ
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన బిజినెస్ జెట్స్ తయారీ దిగ్గజం బొంబార్డియర్ సీఈవో ఎరిక్ మార్టెల్తో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. ఎయిర్‌క్రాఫ్ట్ సరీ్వసులు, రక్షణ రంగ కార్యకలాపాల్లో భాగస్వామ్యం తదితర అంశాలపై ఇందులో చర్చించినట్లు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో అదానీ పోస్ట్ చేశారు. అదానీ గ్రూప్ దేశీయంగా ఏడు విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. -
నేపాల్‌లో ఘోర ప్రమాదం
కఠ్మాండూ: నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి 67 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుండగా సాం కేతిక లోపం తలెత్తడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం ఒరిగి పక్కనున్న ఫుట్‌బాల్ మైదానంలోకి దూసుకెళ్లింది.మంటలు అంటుకోవడంతో అందులోని ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొందరు మరణించారు. మిగతా వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెప్పారు. విమానంలో 33 మంది నేపాలీలు ఉండగా.. 32 మంది బంగ్లాదేశీయులు, చైనా, మాల్దీవులకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. నేపాల్ అధికారుల కథనం ప్రకారం.. యూఎస్–బంగ్లా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బాంబార్డియర్ డాష్ 8 క్యూ 400 విమానం 67 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సోమవారం ఉదయం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి కఠ్మాండుకు బయల్దేరింది. నేపాల్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటల సమయంలో కఠ్మాండూ ఎయిర్‌పోర్టులో దిగుతుండగా ఈ ఘోరం జరిగింది. విమానంలో నుంచి బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నామని టీఐఏ జీఎం రాజ్‌కుమార్ ఛత్రీ తెలిపారు. చివరి నిమిషంలో సాంకేతిక లోపం వల్లే.. ‘విమానాన్ని దక్షిణం వైపు రన్‌వేపై ల్యాండింగ్ చేసేందుకు అనుమతించాం. కానీ ఉత్తరంవైపు దిగింది. రన్‌వేపై దిగేందుకు ప్రయత్నించిన సమయంలో అదుపు తప్పింది. సాంకేతిక సమస్యలే కారణం కావచ్చని భావిస్తున్నాం’ అని నేపాల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరెక్టర్ జనరల్ సంజీవ్ గౌతమ్ చెప్పారు. యూఎస్–బంగ్లా ఎయిర్‌లైన్స్ సీఈవో ఇమ్రాన్ అసిఫ్ మాట్లాడుతూ.. పైలట్‌కు ఏటీసీ తప్పుడు సిగ్నల్స్ ఇచ్చినట్లు తెలుస్తుందన్నారు. ల్యాండ్ అయ్యేముందే.. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ బొహోరా ఆ ఘోరాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఢాకాలో విమానం టేకాఫ్ సమయంలోఇబ్బందులు లేవు. ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యేముందు విమానం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. ఆ తరువాత పెద్ద శబ్దంతో పక్కకు ఒరిగింది. కిటికీ పక్కన కూర్చోవడంతో దానిని పగులగొట్టి బయటపడ్డాను’ అని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు -
బంబార్డియర్, స్పైస్‌జెట్ భారీ డీల్
ముంబై: కెనడాకు చెందిన బంబార్డియర్ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సుమారు రూ.10,900 కోట్ల విలువైన 50 టర్బో ప్రాప్ జెట్స్ విమానాలను బంబార్డియర్ సరఫరా చేయనుంది. తొలుత 25 విమానాలను స్పైస్‌జెట్ కొనుగోలు చేస్తుండగా, మరో 25 విమానాలను కొనుగోలు చేసే హక్కులను కలిగి ఉంటుంది. వీటి సరఫరా అనంతరం 90 సీట్ల టర్బో ప్రాప్ విమానాలను నడిపే ప్రపంచంలో తొలి విమానయాన సంస్థగా స్పైస్‌జెట్ నిలుస్తుంది. అయితే, ఇందుకు నియంత్రణ సంస్థల ధ్రువీకరణ రావాల్సి ఉందని బంబార్డియర్ తెలిపింది. 50 బంబార్డియర్ క్యూ400 విమానాలను కొనుగోలు చేయనున్నట్టు స్పైస్‌జెట్ చీఫ్ అజయ్‌సింగ్ గతంలో పారిస్ ఎయిర్‌షో సందర్భంగా ప్రకటించడం తెలిసిందే. స్పైస్‌జెట్‌తో ఒప్పందం కుదిరినందుకు గర్వంగా ఉందని, ఈ ఆర్డర్‌తో వేగంగా వృద్ధి చెందుతున్న బారత మార్కెట్లో క్యూ400 విమానాల ప్రాతినిధ్యం పెరగనుందని బంబార్డియర్ వాణిజ్య విమానాల ప్రెసిడెంట్ ఫ్రెడ్ క్రోమర్ వ్యాఖ్యానించారు. 90 మంది ప్రయాణించే మోడల్‌ను కూడా విడుదల చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతానికి స్పైస్‌జెట్ నిర్వహణలో 78 సీట్ల సామర్థ్యంగల క్యు400 మోడల్ విమానాలు 20 ఉన్నాయి. వీటితోపాటు బోయింగ్ 737 మోడల్ విమానాలు 35 వరకు ఉన్నా యి. తాజా కొనుగోలు ఆర్డర్ ప్రాంతీయ మార్గాల్లో అనుసంధానత పెంచేందుకు దోహదపడుతుందని స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్‌సింగ్ పేర్కొన్నారు. -
స్పైస్‌జెట్‌కు 50 ‘క్యూ400’ విమానాలు
♦ బంబార్డియర్తో ఒప్పందం ♦ డీల్ విలువ రూ.10,900 కోట్లపైనే న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘స్పైస్‌జెట్’ విమానాల కొనుగోళ్ల పరంపర కొనసాగుతూనే ఉంది. కార్యకలాపాల విస్తరణే ప్రధాన లక్ష్యంగా ఇది తాజాగా బంబార్డియర్ కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి 50 వరకు ‘క్యూ400’ టర్బోప్రాప్ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇవి 86 సీటర్ విమానాలు. ఈ డీల్ విలువ 1.7 బిలియన్ (దాదాపు రూ.10,900 కోట్లు) డాలర్లు. ఈ మేరకు కంపెనీ బంబార్డియర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ‘క్యూ400’ విమానాలకు సంబంధించి ఇదే అతిపెద్ద సింగిల్ ఆర్డరని స్పైస్‌జెట్ పేర్కొంది. ఇందుకోసం ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై స్పైస్‌జెట్ సంతకాలు చేసింది. ‘క్యూ400 విమానాల కొనుగోలు డీల్ ప్రకటించడం ఆనందంగా ఉంది. ఈ డీల్ ద్వారా చిన్న పట్టణాలకు కనెక్టివిటీ సదుపాయాలను విస్తరిస్తాం’ అని స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ తెలిపారు. పారిస్ ఎయిర్ షో కార్యక్రమంలో ఈ డీల్ కుదిరిందని పేర్కొన్నారు. కాగా 40 ‘బోయింగ్ 737 మ్యాక్స్’ ప్లేన్స్ కొనుగోలు ఒప్పందం జరిగిన మరుసటి రోజే స్పైస్‌జెట్ ఈ డీల్‌ను ప్రకటించడం గమనార్హం.