bommireddy
-
నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి
Bommireddy Raghava Prasad :సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించిన ఆయన రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా గతంలో స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉంది
-
‘జేసీ బ్రదర్స్ మమ్మల్ని చంపేస్తారేమో!’
సాక్షి, అనంతపురం: టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాడిపత్రి నేతలు జగ్గీ బ్రదర్స్(బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, జయచంద్రారెడ్డిలు) మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్ నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారంటున్నారు. ‘తాడిపత్రిలో అరాచకం రాజ్యమేలుతోంది. జేసీ బ్రదర్స్ రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. నిరూపించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. దౌర్జన్యాలు, అక్రమాలకు తెగబడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. వాళ్ల నుంచి మాకు ప్రాణహాని ఉంది. జేసీ ఫ్యామిలీ నుంచి మా ఇద్దరికీ రక్షణ కల్పించాలంటూ చంద్రబాబు గతంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్‌కు లేఖ కూడా రాశారు. మాకు ఏ హాని జరిగినా జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, వారి కొడుకులే కారణం. ఇకపై జేసీ బ్రదర్స్ ఓటమే లక్ష్యంగా కృషిచేస్తాం’ అని జగ్గీ బ్రదర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. (పూర్తి కథనం.. తాడిపత్రిలో టీడీపీకి షాక్) -
తాడిపత్రిలో టీడీపీకి షాక్
అనంతపురం ,తాడిపత్రి: తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ తగిలింది. సీనియర్ నేతలు బొమ్మిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, 23వ వార్డు కౌన్సిలర్ జయచంద్రారెడ్డిలు (జగ్గీ బ్రదర్స్) టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ జిల్లా అధిష్టానం నెల రోజుల క్రితం జగ్గీ బ్రదర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జగ్గీ బ్రదర్స్ జూన్ 20న వివరణ కూడా ఇచ్చారు. అయితే సంజాయిషీ సంతృప్తికరంగా లేదంటూ జగ్గీ బ్రదర్స్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధ్యక్షుని పేరుతో ఉన్న ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీంతో మనస్తాపానికి గురైన వారిద్దరూ టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తాజా పరిణామాలతో తాడిపత్రి టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మరికొందరు సీనియర్ నేతలు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. విభేదాలు పొడసూపాయిలా.. ♦ 1993 నుంచి జగదీశ్వర్‌రెడ్డి– జయచంద్రారెడ్డి సోదరులు టీడీపీలో కొనసాగుతూ వస్తున్నారు. జేసీ సోదరుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న జగ్గీ సోదరులు కష్టకాలంలో పార్టీని వీడక అలాగే అంటిపెట్టుకుని సేవ చేశారు. 2014 ఎన్నికల్లో జేసీ సోదరులు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి జేసీ బ్రదర్స్ – జగ్గీ బ్రదర్స్ విభేదాలు వీడి ఒక్కటయ్యారు. ఈ క్రమంలో 23వ వార్డు కౌన్సిలర్‌గా జగ్గీ సోదరుడు జయచంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఇదిలా వుండగా జగదీశ్వర్‌రెడ్డి (జగ్గీ)కి మార్కెయార్డ్ పదవి విషయంలో జిల్లా నాయకుల అండదండలు సంపాదించడంతో ఆ విషయం ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డికి మింగుడుపడలేదు. దీంతో మార్కెట్‌యార్డు పదవి జగ్గీకి దక్కకుండా పావులు కదిపారని అప్పట్లో ప్రచారం జరిగింది. ♦ గతంలో జరిగిన ఓ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అతని అనుచరుడు ఎస్వీ రవీంద్రారెడ్డి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, ప్రజా ధనాన్ని దోచుకుతింటున్నారని కౌన్సిలర్ జయచంద్రారెడ్డి ఆరోపించారు. దీంతో జయంద్రారెడ్డిని మూడు నెలల పాటు కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే జేసీ, జగ్గీ బ్రదర్స్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే జేసీ నిర్వాకం వల్లే తాడిపత్రిలో గ్రానైట్ పరిశ్రమ దెబ్బతిందని, పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోందని జయచంద్రారెడ్డి పత్రికాముఖంగా దుమ్మెత్తిపోశారు. ♦ జగ్గీ బ్రదర్స్ తీరుపై ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒత్తిడి పెంచడంతో జిల్లా అధ్యక్షుడు షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
బాబుది రోజుకో మాట..పూటకో అబద్ధం
కోటంబేడు: సీఎం చంద్రబాబు నాయుడు రోజుకో మాట, పూటకో అబద్ధం చెబుతూ ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తున్నారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్, జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కోటంబేడులో శుక్రవారం ఆయన గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వ్యవసాయ, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాననే హామీతో అధికారంలోకి వచ్చిన బాబు పూర్తిస్థాయిలో మాఫీ చేయకుండా మోసం చేశాడని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానన్న బాబు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించిన ఘనత దక్కించుకున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సింగంశెట్టి భాస్కర్‌రావు, జిల్లా రైతు ప్రధానకార్యదర్శి గూడూరు భాస్కర్‌రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మండల కో-ఆప్షన్ సభ్యుడు హఫీజ్, పార్టీ మండలాధ్యక్షుడు మురళీ మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
విఐపి రిపోర్టర్ - నెల్లూరు జెడ్.పి ఛైర్మన్ బొమ్మిరెడ్డి