
Bommireddy Raghava Prasad :సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించిన ఆయన రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు.
అంతేకాకుండా గతంలో స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలందించారు. బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.