book inauguration
-
అహింసా మార్గంలో స్వతంత్ర పోరాటానికి గాంధీ నడిపారు: సీజేఐ ఎన్వీ రమణ
-
‘గొప్ప కోసం కాదు ప్రజా సమస్యల కోసం పోరాటం చేశా’
సాక్షి, విజయవాడ : గొప్ప కోసం కాకుండా ప్రజా సమస్యల కోసం పార్లమెంట్లో పోరాటం చేశానని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన ‘వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్లో ప్రజాగర్జన’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల సమస్యలపై పార్లమెంట్లో తమ వాణిని బలంగా వినిపించామన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించడంలో తనతో పాటు ఇతర వైఎస్సార్సీపీ ఎంపీలు ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు, ఉపాధీ హామీ పథకం నిధులు దుర్వినియోగంపై పార్లమెంట్‌ను ప్రశ్నించామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన జరగదనే వాస్తవాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలమేరకే ఎంపీ పదవికి రాజీనామా చేశాననిని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సీఎం జగన్ 7నెలల పాలనలో ఇచ్చిన హామీలన్నీ దాదాపు అమలు చేశారని ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, అనిల్‌కుమార్ యాదవ్, కన్నబాబు, వెల్లంపల్లి, విశ్వరూప్, శ్రీరంగనాథరాజు, ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి, ఎమ్మెల్యేలు ఉదయభాను, మెరుగు నాగార్జున, జోగి రమేష్, పుష్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మనమంతా దుర్యోధనులం: రజనీకాంత్
మనమంతా దుర్యోధనులమని, ఆయనలాగే ఏం చేయకూడదు అనుకుంటామో అదే చేస్తామని సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అంతా అర్జునుడిలాగ మారితే మనిషి జీవితం భగవంతుడిని చేరుతుందని చెప్పారు. చెన్నైలోని రజనీకాంత్ కళ్యాణ మండపంలో పరమహంస యోగానంద రచించిన 'ది డివైన్ రొమాన్స్' తమిళ అనువాదం దైవీక కాదల్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తనను ఓ సినిమా స్టార్‌గా కంటే ఆధ్యాత్మికవాది అంటేనే ఇష్టపడతానని, తనకు సినిమాల కంటే ఆధ్యాత్మిక మార్గమే ఇష్టమని చెప్పారు. మనిషి జన్మ అనేది దేవుడి కృప అని, మానవత్వంతో జీవిస్తేనే ఆ జన్మకు సార్ధకత చేకూరుతుందని చెప్పారు. ఓ పరమ గురువుగా రామకృష్ణ పరమహంస నుంచి జీవితాన్ని నేర్చుకున్నానని, రమణ మహర్షి రాసిన'నేను ఎవరిని' అనే పుస్తకం నుంచి మనిషి జీవన గమనాన్ని గ్రహించానని రజనీ చెప్పారు. తాను స్వయంగా ఓ పుస్తకాన్ని విడుదల చేయటం ఇదే మొదటిసారని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో దైవాన్ని చూసిన మహోన్నత వ్యక్తులు మనకు అందించిన పుస్తకం కావడం వల్లే దీన్ని ఆవిష్కరించానన్నారు. అందరం జీవితాన్ని సార్ధకత చేసుకోవాలంటే అధ్యాత్మిక మార్గమే శరణ్యమని రజనీకాంత్ తెలిపారు. -
'ఫేస్బుక్లో కాదు.. నిజంగా ఫ్రెండ్స్ అవ్వండి'
భారత్, పాకిస్థాన్ ప్రజలు తమ సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, అయితే కేవలం ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో కాకుండా నిజ జీవితంలో ఫ్రెండ్స్ అవ్వాలని సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ అహ్మద్ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చాలాసార్లు పాకిస్థాన్ వెళ్లానని, అప్పుడు అక్కడివాళ్ల ప్రేమాభిమానాలు చవిచూశానని చెప్పారు. ఏ ఒక్కసారీ అక్కడి ఆందోళనల కారణంగా తన ప్రదర్శనలు రద్దుచేసుకోవాల్సిన పరిస్థితి తనకు ఎదురు కాలేదని ఆయన తెలిపారు. ఖుర్షీద్ సొంత నగరమైన లాహోర్‌లో తనకు లభించిన లాంటి స్వాగతాన్నే ఆయనకు కూడా మనం ఇక్కడ ఇచ్చి ఉండాల్సిందని నసీరుద్దీన్ షా అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధాన వక్త సుధీంద్ర కులకర్ణి మీద శివసేన కార్యకర్తలు నల్ల ఇంకు పోయడాన్ని అనాగరికమైన చర్యగా ఆయన విమర్శించారు. నల్ల ఇంకు పడినా కూడా అలాగే నల్లటి మొహంతో విలేకరుల సమావేశంలో పాల్గొనడం ద్వారా సుధీంద్ర కులకర్ణి అపార ధైర్యాన్ని ప్రదర్శించారని షా అన్నారు.