book launched
-
''తెలంగాణ చరిత్ర మహోన్నతమైనది.. చరిత్రలో అజరామరమైంది''
తెలంగాణ సమాజం ఆది నుంచి మత సామరస్యం, మానవీయ విలువలకు కేంద్రంగా నిలిచిందని పలువురు ప్రొఫెసర్లు పేర్కొన్నారు.భారతదేశ చరిత్ర పటంలో తెలంగాణ చరిత్ర అజరామరమయ్యిందన్నారు..రాష్ట్ర అవతరణ తర్వాత మనకు తెలియని మన మహోన్నతమైన చరిత్రను వెలికితీసే కృషి ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ రాష్ట ఉన్నత విద్యామండలిలో ‘‘తెలంగాణ చరిత్ర’’ బృహత్ గ్రంథాన్ని విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డా డి. రవీంద్ర యాదవ్, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో పాటు ఇంటర్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గ్రంథం తప్పకుండా ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని తర్వాత తరాలకు అందజేయాలంటే మన చరిత్రను, మన సంస్కృతిని నిక్షిప్తం చేసి అందచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ రవీందర్ యాదవ్ మాట్లాడుతూ.. తొలుత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో, ఇప్పుడు తెలుగులో అందించడం వల్ల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఒకే గ్రంథంలో సమగ్రంగా మొత్తం చరిత్రను ముద్రించిన తెలంగాణ పబ్లికేషన్స్ కృషిని ఆయన అభినందించారు. -
విజయవాడలో అల్లుడు సుద్దులు పుస్తకావిష్కరణ సభ
-
విలువలకు ప్రతీక.. ఎమ్మెస్సార్
బంజారాహిల్స్(హైదరాబాద్): కాంగ్రెస్ దివంగత నేత ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) విలువలకు ప్రతీకగా నిలిచారని, ఆ విలువలు ఉన్నందునే రాజకీయాల్లో సుదీర్ఘంగా రాణించారని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఎమ్మెస్సార్ జీవిత చరిత్రను ఆయన అల్లుడు వామనరావు రాయగా ఆ పుస్తకాన్ని మంగళవారం సోమాజిగూడలోని ఐటీసీ కాకతీయ హోటల్లో దత్తాత్రేయ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెస్సార్ ముక్కుసూటిగా మాట్లాడే నాయకుడని, నీతి, నిజాయతీ గల గొప్ప నేత అని కొనియాడారు. ఆయనను ప్రతి ఒక్కరూ మార్గదర్శకంగా తీసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో కొత్తవారిని ఎమ్మెస్సార్ ఎంతగానో ప్రోత్సహించేవారని, తాను ఆయన వద్ద రాజకీయ కార్యదర్శిగా పని చేశానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. డబ్బుంటేనే రాజకీయాల్లో రాణిస్తారనే విషయాన్ని పక్కనపెట్టి ఎదిగిన గొప్ప నాయకుడు ఎమ్మెస్సార్ అని సీపీఐ నేత నారాయణ అన్నారు. వైఎస్సార్ సీఎం అయినప్పుడు ఎమ్మెస్సార్ స్పీకర్ కావాలనుకున్నారని, అయితే తాను అందుకు చొరవ చూపలేకపోయానని కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ విషయం తాను వైఎస్సార్‌కు కూడా చెప్పలేదన్నారు. దేశంలో ఉచిత విద్యుత్‌కు పునాది వేసింది వైఎస్సార్, ఎమ్మెస్సార్‌లేనని గుర్తు చేశారు. ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌తో విడదీయరాని అనుబంధం ఉన్న ప్రజానాయకుడు ఎమ్మెస్సార్ అని, ఉన్నదున్నట్లు మాట్లాడటంలో ఆయనకు ఎవరూ సాటిరారని టీపీసీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సుబ్బిరామిరెడ్డి, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాడల్ని చెరిపేసుకుంటున్నాం
రాజ్యాలు, యుద్ధాలు.. గెలుపు ఓటములు.. శిలలు, శాసనాలు.. మహళ్లు, మంతనాలు.. మతాలు, బోధనలు.. ఆరామాలు, ఆలయాలు.. చరిత్రకు సంబంధించిన ఏ జాడలైనా ప్రజలకు హక్కున్న వారసత్వ సంపదే! భావితరాలకూ చెందేలా జాగ్రత్తగా సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే!! ఆ బాధ్యతను గుర్తు చెయ్యడం కోసం గత పదిహేనేళ్లుగా ఏకదీక్షగా శ్రమిస్తున్నారు ప్రముఖ చరిత్రకారిణి రాణీ శర్మ. గత శతాబ్దపు ఎనిమిదవ దశకం చివరి సంవత్సరాలలో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. వాటిని ‘ఉన్నవి ఉన్నట్లుగా’ సంరక్షించుకోవలసిన ఆవశ్యకతపై చరిత్రకారిణి, రచయిత్రి రాణి శర్మ తాజాగా ‘తథాగతుని అడుగుజాడలు’ అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’తో పంచుకున్న విషయాలు, విశేషాలు. ‘‘పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో 1980ల చివర్లో విశాఖపట్టణం దగ్గర్లోని తొట్లకొండ, బావికొండ, పావురాల కొండలో బౌద్ధ క్షేత్రాలు బయటపడ్డాయి. ఈ శాఖ అప్పటి డైరెక్టర్ డాక్టర్ వి.వి. కృష్ణశాస్త్రి ఆనాటి తవ్వకాలకు చాలా కృషి చేశారు. ఈ పుస్తకానికి ప్రేరణ ఆయనే. సముద్ర తీరంలో కొండమీది క్షేత్రాలవి. రెండువేల మూడువందల సంవత్సరాల కిందట బౌద్ధ భిక్షువులు ఎలా విడిచిపెట్టి పోయారో అలాగే దొరికాయి. అయితే ఇన్నేళ్లు మట్టిలో నిక్షిప్తమై ఉన్న కట్టడాలు ఒక్కసారి బయటపడగానే పాడైపోతాయి. వాటిని పరిరక్షించాలి. ఈ తవ్వకాలు జరిగినప్పుడు విశాఖపట్టణ పరిధి చాలా తక్కువగా ఉంది. రానురాను పట్టణ పరిధి విస్తరించి తొట్లకొండ, బావికొండ దాకా వచ్చేసింది. దీనివల్ల రియల్ స్టేట్ వ్యాప్తి చెందడం, ఎలాగైనా పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలన్న ప్రభుత్వాల ఉత్సాహం వల్ల ఎంతో అమూల్యమైన ఈ ప్రాచీన నిర్మాణం దెబ్బతినడం మొదలైంది. ప్రాచీనతకు హంగులా!! శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలను చూసి పర్యాటకశాఖ అధికారులు నాతో అన్నారు ‘‘వీటికి మనం కొన్ని హంగులు కల్పించి అందంగా తీర్చిదిద్దాలి’’ అని. ‘‘ఈ వారసత్వ సంపదకు మించిన అందం ఉంటుందా? వీటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడ ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ (వ్యాఖ్యాన కేంద్రాలు) ఏర్పాటు చేయండి’’ అని చెప్పాను. ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్స్ అంటే.. ఈ కట్టడాల చరిత్ర, గొప్పదనం, ప్రత్యేకత, వీటిని ఎందుకు సందర్శిస్తున్నాం, ఎందుకు, ఎలా కాపాడుకోవాలి వగైరాలను బ్రోషర్స్, పుస్తకాలు, ఫిల్ముల ద్వారా సందర్శకులకు వివరించడం, చూపించడం. ఇలా 2004 నుంచి నేటి దాకా వాటిని కాపాడ్డానికి నేను పాడిన పాట్లు దేవుడికే తెలుసు. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలోని స్థానిక అధికారుల నుంచి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు దగ్గర దగ్గర డెబ్భై ఎనభై లేఖలు రాశా. ఓ రెండుమూడు నెలలకు ‘ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా’ వాళ్లు ఒక లేఖను పట్టుకొని విశాఖపట్టణంలోని మా ఇంటికొచ్చారు.. ‘‘రాణీ శర్మగారు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ గారికి కంప్లయింట్ రాశారట’’ అంటూ. అప్పుడు వాళ్లలో ఒక అధికారిని తొట్లకొండ తీసుకెళ్లి అంతా చూపించాను. ‘‘రాణీ శర్మగారు చెప్పింది నిజమే.. ఈ సైట్ పాడైపోతోంది.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ సైట్‌ను అప్పగిస్తే దీన్ని మేము పునరుద్ధరించి, పరిరక్షించగలం’’ అని ఆయన పైకి లెటర్ రాశారు. స్నానాల బాటను తవ్వేశారు టూరిజం భ్రమలో పడి సైట్‌ను, దాని ప్రాశస్త్యాన్ని పాడుచేసుకోవడం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సైట్‌ను జాగ్రత్తగా కాపాడుకుంటూ దానిమీద టూరిజంను వృద్ధి చేసుకుంటారు. పర్యాటకులకు ఇష్టం వచ్చినట్లు మసులుకోనివ్వరు. కారు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఆపి.. కట్టడం వరకు నడుచుకుంటూ రావాలి. పరిరక్షణలో ఉన్న వాటిని చేతులతో తాకడం.. ముట్టుకోవడం వంటివి చేయనివ్వరు. కానీ మనం?! టూరిస్ట్‌ను ముద్దు చేస్తూ గుమ్మం దాకా వాహనాలలో రానిస్తాం. అలా వాహనాల కోసం ఇక్కడ పూర్వకాలం బౌద్ధ గురువులు స్నానం కోసం నడిచివెళ్లిన బాటను తవ్వేసి రోడ్లు వేశారు! హంగులు, ఆర్భాటాలు కల్పించి.. షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రార్థనా మందిరాలు కట్టి.. దాన్నో విహారకేంద్రంలా తయారు చేశారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవన్నీ చేయకూడదు. వీటన్నిటినీ ఎత్తిచూపుతూ ఉత్తరాలు రాశా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ స్పందనా రాలేదు. అది ఏ ఉత్సాహంలో ఉండిందంటే ఎలాగైనా సరే ఈ బౌద్ధక్షేత్రాలను నలుగురికీ చూపించి డబ్బులు గడించాలి అని! పాత తొట్లకొండ మాయం బౌద్ధ గురువులెప్పుడూ అందమైన ప్రకృతి ప్రదేశాలనే తమ ఆవాసాలుగా చేసుకున్నారు. తొట్లకొండలో కూడా అంతే. సముద్రమట్టానికి ఎత్తులో చుట్టూ పచ్చని చెట్లు, చేమల మధ్య చక్కటి వాతావరణంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి అద్భుతమైన స్థలాన్ని కమర్షియల్ కాంప్లెక్స్‌లు, హోటల్స్, రిసార్టులు కట్టే ఆలోచనతో నాశనం చేస్తున్నారు. నేను చెప్పిన ఇంటర్‌ప్రెటేషన్ సెంటర్ ఈనాటికీ వాళ్ల కార్యాచరణలో లేకపోగా ఈ మధ్య ఏం చేశారంటే.. 2,300 ఏళ్ల నాటి కట్టడంలోని పాత ఇటుకలన్నిటినీ తీసిపారేసి ఇప్పటి ఇటుకలతో కట్టేశారంతా! ఇప్పుడు మీరు తొట్లకొండను చూద్దామని వస్తే.. నాటి తొట్లకొండకు బదులుగా రెండేళ్ల కిందట కొత్తగా కట్టిన తొట్లకొండ సాక్షాత్కరిస్తుంది. ఇదంతా నిబంధనలకు విరుద్ధమే. ఈ ఆక్రోశంతో, బాధతో, దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ‘తథాగతుని అడుగుజాడలు’ పుస్తకం రాశాను. ప్రేరణ ఏంటంటే.. నేను చరిత్ర విద్యార్థిని అవడం, ఒకప్పుడు ఇటు తెలంగాణ, అటు కోస్తా అంతటా కూడా బౌద్ధమే ఉండడం. అప్పుడు మనందరం బౌద్ధులమే. వరం కొద్దీ ఈ ప్రాంతం మన ఆంధ్రదేశం ఒడిలో పడింది. ఈ ప్రాముఖ్యం తెలియక టూరిజం ‘అభివృద్ధి’లో కొట్టుకుపోతున్నాయి ప్రభుత్వాలు. ఇదంతా భావితరాల ఆస్తి నియమాలకు విరుద్ధంగా తొట్లకొండ స్తూపానికి దగ్గర్లో నిర్మాణాలు మొదలుపెట్టారు. దీని మీద హైకోర్టులో కేసు వేశా. సాంచీలో కాని, భార్హూత్లో కాని ఎక్కడా ఇలా నిర్మాణాలకు అనుమతించలేదు. అసలు జీవో ప్రకారం కొండంతా కూడా సంరక్షణ ప్రాంతమే. ఈ జీవో అందరికీ చూపించుకుంటూ పోరాడాల్సి వస్తోంది. తొట్లకొండ, బావికొండ, పావురాలకొండను అనాథ ప్రాంతాలుగా చేసేశారు. ఇది ప్రభుత్వ ఆస్తో, ప్రజాప్రతినిధుల ఆస్తో కాదు. ప్రజలది, మన భావితరాలది. ఇవి ప్రపంచ వారసత్వ సంపదలు. వీటికి మనం సంరక్షులం మాత్రమే. దురదృష్టమేమంటే వాటిని భద్రంగా కాపాడే పురావస్తు శాఖను నిర్వీర్యం చేసి, పర్యాటక శాఖ కింద పెట్టడం. పాశ్చాత్య దేశాల్లో ఇలా ఉండదు. ప్రతి ఊళ్లో ‘హిస్టారికల్ సొసైటీస్’ ఉంటాయి. ప్రజలకు వాటి మీద యాజమాన్యపు హక్కుంటుంది. ప్రజలను అడక్కుండా ప్రభుత్వాలు ఏ పనీ చేయడానికి వీల్లేదు. మన దగ్గరా అలాంటి చైతన్యం రావాలి’’ అంటారు ఈమని రాణి శర్మ. – సరస్వతి రమ ఫొటోలు : ఐ.దేవేంద్రనాథ్ రెండవ పుస్తకం రాణీ శర్మ జన్మస్థలం విశాఖపట్టణం. తండ్రి మురుకుట్ల పురుషోత్తమ శర్మ. తల్లి పార్వతి. తండ్రి ఉద్యోగరీత్యా ప్రాథమిక విద్యను రాయలసీమలో, ఉన్నత విద్యను మచిలీపట్టణం, హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో అభ్యసించారు. భర్త ఈఏఎస్ శర్మ ఐఏఎస్ అధికారి. ఆయన ఉద్యోగరీత్యా ఢిల్లీ వెళ్లడంతో రాణీ శర్మ కూడా తన అధ్యాపక వృత్తిని అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో కొనసాగించారు. పదవీ విరమణ తర్వాత విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ‘తథాగతుని అడుగుజాడలు’ ఆమె రెండవ పుస్తకం. మొదటి పుస్తకం హైదరాబాద్ పూర్వ సంస్కృతి మీద రాసిన ‘‘ది డియోడిస్ ఆఫ్ హైదరాబాద్ : ఎ లాస్ట్ హెరిటేజ్ ’’. -
ఆవినీతి చక్రవర్తి పుస్తకాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
చరిత్రను కొత్తకోణంలో వివరించే ప్రయత్నం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆధునిక చరిత్రను కొత్త కోణంలో వివరించేందుకు జైపాల్‌రెడ్డి చేసిన యత్నం అభినందనీయమని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి రాసిన మొదటి పుస్తకం ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పునరుజ్జీవన కాలం నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన వివిధ ముఖ్యమైన భావా లు, ఆలోచనలను ఇందులో తెలియజెప్పారన్నారు. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో భిన్న ఆలోచనా విధానాలపై పట్టింపులేని ధోరణి పెరుగుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో వివిధ భావాలు, మేథావుల ఆలోచనలపై చర్చలు కనుమరుగవుతున్నాయన్నారు. రాజకీయాల్లో మేథావులకు తిరిగి ఆసక్తి కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకమన్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ జైపాల్‌రెడ్డికి శుభాకాంక్షల సందేశం పంపారు. మొత్తం 15 అధ్యాయాలతో కూ డిన ఈ పుస్తకంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, స్త్రీవాదం, పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ మొ దలైన విధానాలను ప్రస్తావించారు. మహాత్మాగాంధీ మునిమనవడు గోపాలకృష్ణ గాంధీ ముందుమాట రాశారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, శరద్ పవార్, షీలాదీక్షిత్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, టీడీపీ నుంచి దివాకర్‌రెడ్డి, గల్లా జయదేవ్, ఎ.శ్రీనివాస్, విరసం నేత వరవరరావు తదితర నేతలు, మేథావులు పాల్గొన్నారు. -
ప్రాతినిధ్య 2015 పుస్తక అవిష్కరణ
-
సినిమాగా సినిమా పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ నాదెండ్ల నందగోపాల్ రచించిన ‘సినిమాగా సినిమా’ పుస్తకావిష్కరణ యువకళావాహిని ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డా. సి.నారాయణరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి విచ్చేసిన అతిథులకు అందించారు. ‘సినిమాగా సినిమా’ అనే పేరే విచిత్రంగా ఉందని, నందగోపాల్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నానని సినారె అన్నారు. నందగోపాల్‌తో చెన్నయ్నాటి పరిచయాన్ని డి.రామానాయుడు గుర్తు చేసుకున్నారు. తన సినీజీవితంలో నందగోపాల్ మరిచిపోలేని వ్యక్తి అని ఈ సందర్భంగా ఆయనన్నారు. ‘‘ఈ బుక్ రాసింది నేనే అయినా... రాయడానికి కారకులు మాత్రం పరుచూరి హనుమంతరావుగారు. ఈ పుస్తకం పూర్తి చేయడానికి అయిదేళ్లు పట్టింది. అది కూడా ఆయన ప్రోద్భలంతో. హనుమంతరావు నాతో ఓ మాట అన్నారు. ‘నీకు తెలిసింది మట్టిలో కలిసిపోనీకు. నా చేతిలో పెట్టు’ అని. అందుకే... ఈ పుస్తకం రాశాను.. ఈ పుస్తకం ఆయన వెలిగించిన దీపం. అందుకే... ఆయనకే అంకితం ఇస్తున్నా’’ అని నందగోపాల్ చెప్పారు. పరుచూరి హనుమంతరావు, సారిపల్లి కొండలరావు, రమేష్‌ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ్, నన్నపనేని రాజకుమారి, కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, ఏఎస్ జయదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సుష్మితా సేన్
-
‘వెండితెర విషాద రాగాలు’ ఆవిష్కరణ
‘‘ఒకప్పుడు అగ్రతారలుగా వెలుగొంది... చిన్నపాటి కారణాలు, పొరపాట్లతో జీవితాన్ని విషాదభరితం చేసుకున్న వారి గురించి నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘వెండితెర విషాదరాగాలు’ అనే పుస్తకంలో ఆ విషయాలన్నీ రచయిత పసుపులేటి రామారావు ప్రస్తావించారు. ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సీనియర్ ఫిలిమ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు రచించిన ‘వెండితెర విషాద రాగాలు’ పుస్తకాన్ని సోమవారం హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి, తొలి ప్రతిని గోపీచంద్‌కు అందించారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘మహానటి సావిత్రి కోమాలోకి వెళ్లింది మొదలు, దహన సంస్కారాలు పూర్తయ్యేవరకూ అన్నీ తెలిసిన వ్యక్తిని నేను. చివరి రోజుల్లో కష్టాలు పడినా గొప్ప జీవితాన్ని గడిపిందామె. ఇలాంటి వాళ్లందరినీ రామారావు చాలా దగ్గర నుంచి చూసి ఈ పుస్తకం రాశాడు’’ అన్నారు. పసుపులేటి రామారావు రాతలో స్పష్టత, స్వచ్ఛత, నిజాయితీ ఉంటాయని నిర్మాత కేఎస్ రామారావు ప్రశంసించారు. ‘‘సినిమా వాళ్లంటే విలాసమైన జీవితమని చాలామంది అనుకుంటుంటారు. వారికీ చీకటి బతుకులుంటాయని తెలిపే పుస్తకమిది’’ అని పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన తారలతో తనకు మంచి అనుబంధముందని, అందుకే ఎక్కువ విషయాలు రాయగలిగానని పసుపులేటి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంకా గోపీచంద్, రేలంగి నరసింహారావు, భీమనేని, శ్రీకాంత్, అల్లాణి శ్రీధర్, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.