‘టెన్ ఐడియాలజీస్’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్. చిత్రంలో జైపాల్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆధునిక చరిత్రను కొత్త కోణంలో వివరించేందుకు జైపాల్‌రెడ్డి చేసిన యత్నం అభినందనీయమని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి రాసిన మొదటి పుస్తకం ‘టెన్ ఐడియాలజీస్: ది గ్రేట్ అసిమ్మెట్రీ బిట్వీన్ అగ్రేరియనిజం అండ్ ఇండస్ట్రియలిజమ్’ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పునరుజ్జీవన కాలం నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన వివిధ ముఖ్యమైన భావా లు, ఆలోచనలను ఇందులో తెలియజెప్పారన్నారు.
జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయాల్లో భిన్న ఆలోచనా విధానాలపై పట్టింపులేని ధోరణి పెరుగుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో వివిధ భావాలు, మేథావుల ఆలోచనలపై చర్చలు కనుమరుగవుతున్నాయన్నారు. రాజకీయాల్లో మేథావులకు తిరిగి ఆసక్తి కల్పించే ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకమన్నారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ జైపాల్‌రెడ్డికి శుభాకాంక్షల సందేశం పంపారు. మొత్తం 15 అధ్యాయాలతో కూ డిన ఈ పుస్తకంలో ప్రజాస్వామ్యం, సామ్యవాదం, స్త్రీవాదం, పెట్టుబడిదారీ విధానం, ప్రపంచీకరణ మొ దలైన విధానాలను ప్రస్తావించారు.
మహాత్మాగాంధీ మునిమనవడు గోపాలకృష్ణ గాంధీ ముందుమాట రాశారు. కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, శరద్ పవార్, షీలాదీక్షిత్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నేతలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు, టీడీపీ నుంచి దివాకర్‌రెడ్డి, గల్లా జయదేవ్, ఎ.శ్రీనివాస్, విరసం నేత వరవరరావు తదితర నేతలు, మేథావులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment