Boston Marathon
-
పట్టుదలే పరుగెత్తించింది
50 ఏళ్ల తర్వాత మళ్లీ బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన కేథరిన్ 1967... అలనాడు అడ్డుకున్నారు... అమ్మాయిలకు మారథాన్‌లో ప్రవేశం లేదన్నారు... ఎలాగైనా పరుగెత్తాలన్న ఆశ... బరిలోకి దిగితే పక్కకు నెట్టేశారు... కానీ... ఆమె మారథాన్‌ను పూర్తి చేసింది. 20 ఏళ్లప్పుడు ఉన్న పట్టుదలే 70 ఏళ్లప్పుడు మళ్లీ పరుగెత్తించింది. ఆమె... కేథరిన్ స్విట్జెర్. 50 ఏళ్ల తర్వాత తన పరుగు ముచ్చట మరోసారి తీర్చుకుంది. 1967లోనే మహిళలకు సమాన హక్కులనే పోరాటం చేసిన కేథరిన్ అమెరికాలో ప్రతిష్టాత్మక బోస్టన్ మారథాన్‌లో పరుగు పెట్టేందుకు స్విట్జెర్ పేరుతో లింగ ప్రస్తావన లేకుండా అర్హతలన్నీ పూర్తిచేసింది. ఇక మిగిలింది ఫైనల్ మారథాన్ రేస్. ఆశల పల్లకిలో స్విట్జర్... కుతూహలంకొద్దీ బరిలోకి... ప్చ్..! పరుగు మొదలైన కాసేపటికే నిలువరింత..! నీకు ఆ చాన్సేలేదన్నా... ఆమె ఆశలపై నీళ్లు చల్లినా... బెదరలేదు. సంకల్పం గట్టిగా ఉంటే సాధన సులభమవుతుందని తన పరుగుతో చాటి చెప్పింది కేథరిన్! 2017... కాలచక్రం గిర్రున తిరిగి యాభై ఏళ్లయింది. సోమవారం బోస్టన్ మారథాన్ ఫైనల్ రేసు జరిగింది. అమెరికా రన్నర్ కేథరిన్ మళ్లీ బరిలోకి దిగింది. ఇందులో పరుగందుకున్న 70 ఏళ్ల కేథరిన్ మొత్తం 42.195 కిలోమీటర్ల పరుగును 4 గంటల 44 నిమిషాల 31 సెకన్లలో పూర్తి చేసింది. తన వయసు కేటగిరీలో 8వ స్థానంలో నిలిచింది. 120 ఏళ్ల చరిత్ర కలిగిన బోస్టన్ మారథాన్‌ను పూర్తి చేసిన అలనాటి తొలి మహిళగా మరోసారి రికార్డులకెక్కింది. ఈ మారథాన్‌లో 1972 నుంచి అధికారికంగా మహిళలకు ప్రవేశం కల్పించారు. నాడు కేథరిన్నుఅడ్డుకుంటున్న నిర్వాహకులు భారతీయుడి ఘనత... ఇదే మారథాన్‌లో బెంగళూరుకు చెందిన సాగర్ బహేతి కూడా రికార్డులకెక్కాడు. పాక్షిక అంధత్వమున్న సాగర్ ఈ రేసును 4 గంటల 14 నిమిషాల 7 సెకన్లలో పూర్తిచేసి 18వ స్థానంలో నిలిచాడు. కేవలం ఒక మీటర్ దూరమే చూడగలిగే సాగర్ మారథాన్ లక్ష్యంపై గురిపెట్టడం విశేషం. దీంతో రేసు పూర్తి చేసిన తొలి భారతీయ అంధ రేసర్‌గా అతను ఘనతకెక్కాడు. తమ కుమారుడి పరుగును ప్రోత్సహించేందుకు అతని తల్లిదండ్రులు విష్ణుకాంత, నరేశ్ బహేతి భారత్ నుంచి అమెరికా వెళ్లారు. -
'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'
-
'వాడికి ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి'
ట్విన్ టవర్స్ కూల్చివేత తరువాత అమెరికా గడ్డపై అతిపెద్ద విధ్వంసంగా భావిస్తోన్న బోస్టన్ మారథాన్ పేలుళ్ల కేసులో దోషి, 21 ఏళ్ల ద్జోఖర్ త్సర్నేవ్కు ఫెడరల్ కోర్టు మరణశిక్ష విధించింది. శుక్రవారం తుది తీర్పును వెలువరించిన జ్యూరీ.. దోషికి ప్రాణాంతక ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని అధికారులను ఆదేశించింది. 2013, ఏప్రిల్ 15న బోస్టన్ నగరంలో మారథాన్ ముగింపు వరుస వద్ద రెండు శక్తిమంతమైన ప్రెషర్ బాంబులు పేలడంతో ఇద్దరు పోలీసులు సహా ముగ్గురు మరణించగా, 264 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది కాళ్లు, చేతులు కోల్పోయారు. కర్గిజ్స్థాన్కు చెందిన ద్జోఖర్, అతని సోదరుడు కలిసి ఈ దురాగతానికి ఒడిగట్టారు. మాసాచూసెట్స్ యూనివర్సిటీ విద్యార్థులైన ఈ అన్నదమ్ములు ఇస్లామిక్ దేశాలపై అమెరికా దాడులకు ప్రతీకారంగా బోస్టన్ మారథాన్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఘటన జరిగిన మూడురోజుల తర్వాత త్సెర్నేవ్ను సజీవంగా పట్టుకున్న పోలీసులు అని సోదరుణ్ని మాత్రం కాల్చి చంపారు. రెండేళ్లకుపైగా విచారణ సాగింది. శుక్రవారం నాటి తుది తీర్పుతో బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. తమవారిని శాశ్వత వికలాంగులుగా మార్చిన దోషికి సరైన శిక్షే పడిందని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
అమెరికా మీద విరుచుకుపడండి: అల్‌ఖైదా అధినేత అల్ జవహరి
అగ్రరాజ్యంగా విర్రవీగుతున్న అమెరికాపై మరిన్ని దాడులు చేయాలని, ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉన్న ఆ దేశాన్ని ఆర్థికంగా బహిష్కరించాలని అల్ ఖైదా అధినేత అయ్మన్ అల్ జవహరి పిలుపునిచ్చాడు. 9/11 దాడులు జరిగి పుష్కర కాలం జరిగిన సందర్భంగా చేసిన ఉద్రేకపూరిత ప్రసంగంలో జవహరి ఈ పిలుపునిచ్చాడు. ఈ ప్రసంగం వీడియో టేపులను అమెరికా నిఘా వర్గాలు సంపాదించాయి. దాదాపు 72 నిమిషాల పాటు జవహరి చేసిన ప్రసంగాన్ని ఇంగ్లీషులోకి అనువదించగా, దాన్ని సైట్ అనే నిఘాబృందం సంపాదించింది. 2001 సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడుల్లో దాదాపు మూడువేల మంది మరణించగా, వారి స్మృత్యర్థం అమెరికా కొన్ని కార్యక్రమాలు నిర్వహించిన రోజునే జీహాదీ వెబ్సైట్లలో ఈ ప్రసంగాన్ని పోస్ట్ చేశారు. ''మనం అమెరికాను ఆర్థికంగా పూర్తిగా కుంగదీయాలి. అది తన భద్రతా రంగం మీద భారీ స్థాయిలో పెడుతున్న ఖర్చును మరింత పెంచేలా రెచ్చగొట్టాలి. తద్వారా అమెరికా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చాలి. తన సైనిక, భద్రతా వ్యయాన్ని ఎక్కువ చేయడం వల్ల ఇప్పటికే అమెరికా పరిస్థితి డోలాయమానంలో పడింది'' అని జవహరి చెప్పాడు. అక్కడక్కడ కొన్ని దాడులు చేస్తే చాలు.. అమెరికా భయాందోళనలకు గురవుతుందని.. సోమాలియా, యెమెన్, ఇరాక్, అఫ్ఘానిస్థాన్ లాంటి దేశాల్లో వాళ్లను మనం ఓడించినట్లే వాళ్ల సొంతదేశంలో కూడా ఓడించాలని జీహాదీలకు పిలుపునిచ్చాడు. ఒక సోదరుడు లేదా కొద్దిమంది సోదరులు ఈ దాడులు చేస్తే సరిపోతుందని జవహరి చెప్పాడు. సరైన సమయం చూసి భారీస్థాయిలో దాడికి తెగబడాలని కూడా తెలిపాడు. చిన్న చిన్న దాడులు చేస్తూ భారీ దాడి కోసం ఓపిగ్గా వేచిచూడాలని.. అవసరమైతే అందుకు కొన్ని సంవత్సరాలు కూడా ఆగాలని చెప్పాడు. ఏప్రిల్ నెలలో బోస్టన్ మారథాన్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లను కూడా జవహరి ప్రస్తావించాడు. దాన్ని బట్టి చూస్తే అమెరికన్లు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు తెలుస్తోందని.. వాళ్ల పొగరు చాలా ఎక్కువగా ఉందని తెలిపాడు. వాళ్ల దృష్టి మొత్తం ముస్లింల మీదే ఉంది తప్ప మరెవ్వరి మీదా కాదని చెప్పాడు. సిరియాలో ఉన్న జీహాదీలో ముస్లిమేతరులకు సాయం చేయద్దని కూడా జవహరి ఇదే ప్రసంగంలో తెలిపాడు.