Boyinapalli Vinodkumar
-
కాంగ్రెస్‌కు ఓటేసి గోసపడుతున్రు..
కరీంనగర్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసినందుకు ఇప్పుడు ప్రజలందరూ గోసపడుతున్నారని, ఇప్పుడు బీజేపీకి ఓటేస్తే ఆగమైతరని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మల్యాలలో సోమవా రం రాత్రి రోడ్‌షో చేపట్టారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అంగడి బజార్లో వినోద్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బడి తేలే.. గుడి తేలేదని, ఐదేళ్లలో కనీసం ఐదు రూపాయలు తేలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 23 నవోదయ పాఠశాలలు రావాల్సి ఉండగా కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఓట్ల కోసం బండి సంజయ్ వస్తే నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎంపీగా పోటీ చేసేందుకు కరీంనగర్ ఆయనకు పునరావాసమా..? అని ప్రశ్నించారు. తనను ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గారడీ మాటలు, మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతోందని, నాలుగు నెలల్లోనే రాష్ట్రప్రభుత్వంపై ప్రజలు విసుగుచెందారని తెలిపారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత హక్కుల కోసం పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక కావాలని, ఇందుకు వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలని కోరారు. ఇవి చదవండి: నేను.. పక్కా లోకల్ -
టీఆర్ఎస్ పోరాటంతోనే తెలంగాణ
చొప్పదండి, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ ఉద్యమ నేతృత్వంలో సుదీర్ఘ రాజకీయ పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించామని పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. నియోజకవర్గంలోని చొప్పదండి, రామడుగు, బోయినపల్లి, గంగాధర మండలాలకు చెందిన సుమారు వెయ్యి మంది టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చిన చివరి రాజకీయ పార్టీ కాంగ్రెస్ అని, అయితే తామే తెలంగాణ తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. టీడీపీ సైతం రెండు కళ్ల సిద్ధాంతంతో అడుగడుగున రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకులు సృష్టించిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ద్వారానే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి బొడిగె శోభ, మండల శాఖ అధ్యక్షులు చుక్కరెడ్డి, మహిపాల్‌రావు, యాదయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.