Brahma Sri Chaganti Koteswara Rao
-
గృహస్థాశ్రమ వైశిష్ట్యం: చదువు – లోకహితం కోసమే
రామాయణంలో ఒక చోట ‘‘సర్వే వేద విదః శూరః సర్వే లోకహితే రతః /సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః’’ అని ఉంటుంది. రామలక్ష్మణ భరత శతృఘ్నులకు గురువులు ఎన్నో విషయాలు నేర్పారు.ఎన్ని నేర్పినా, వాళ్ళకు నేర్పుతున్నప్పుడే అంతర్లీనంగా ఒక బోధ చే శారు. ‘‘ఈ చదువు మీకు ఒక కొత్త విభూతిని కట్టబెడుతుంది. ఈ చదువు మీకు ఒక కొత్త అధికారాన్ని తీసుకొస్తుంది. మీకున్న ఏ విభూతిని కూడా స్వార్థ ప్రయోజనానికి వాడుకోకుండా కేవలం ప్రజాహితానికి మాత్రమే వాడాలి.’’–అని.చదువు లేనివాడు మోసం చేయడానికి సంతకం కూడా పెట్టలేడు. చదువుకున్నవాడు వాడిని పిలిచి నిలదీస్తే వాడు భయపడి ‘ఇంకెప్పుడూ ఇలా చేయనండీ ...’ అంటాడు. కానీ బాగా చదువుకున్నవాడు అందరికీ నియమనిష్టలు చెప్పగలిగినవాడు తప్పు చేసినప్పుడు.. ... తన తప్పును అంగీకరించక΄ోగా అదే ఒప్పు అని సమర్థించుకోవడానికి సవాలక్ష వాదనలు ముందు పెడతాడు. రావణాసురుడికి ఏ విద్యలు తెలియవని!!! అయినా ‘‘స్వధర్మో రక్షసాం భీరు సర్వథైన న సంశయః! గమనం వా పర స్త్రీణాం హరణం సంప్రమథ్య వా!!’’ అని వాదించాడు. ‘నా తప్పేముంది కనుక. నేను రాక్షసుడిని.నా జాతి ధర్మం ప్రకారం నాకు కావలసిన స్త్రీలను అవహరిస్తాను, అనుభవిస్తాను. నేను చూడు ఎంత ధర్మాత్ముడినో’’ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. అంత చదువుకున్నవాడు అంత మూర్ఖంగా వాదిస్తే అటువంటివాడిని అభిశంసించగలిగిన వాడెవడుంటాడు!!! చదువు సంస్కారవంతమై ఉండాలి.సామాజిక నిష్ఠతో ఉండాలి. అందరి మేలు కోరేదై ఉండాలి. విశ్వామిత్రుడుకానీ, వశిష్టుడు కానీ రామలక్ష్మణులకు విద్యను నేర్పించేటప్పుడు ‘ఇంత ధనుర్వేదాన్ని వీళ్లకు అందచేస్తున్నాం. వీళ్ళు తలచుకుంటే ముల్లోకాలను లయం చేయగలరు. అంత శక్తిమంతులవుతారు..’ అన్న ఆలోచనతో దానిని ఎక్కడా దుర్వినియోగపరచకుండా ఉండేవిధంగా విద్యాబోధనలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. నిజానికి రామచంద్రమూర్తి నేర్చుకున్న ధనుర్విద్యా΄ాటవం అటువంటిది. ఆచరణలో ఆయన దానికి పూనుకుంటే ఆపడం ఎవరితరం కాదు. ఆయన బాణ ప్రయోగం చేస్తే అగ్నిహోత్రం కప్పేస్తుంది సమస్త భూమండలాన్ని... అది ప్రళయాన్ని సృష్టించగలదు. కానీ అంత బలాఢ్యుడై ఉండి కూడా రాముడు ఒక్కసారి కూడా స్వార్థం కోసం హద్దుదాటి ఎవరినీ శిక్షించలేదు. అంటే గురువులు ఇచ్చిన విద్య లోకప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగపడాలన్న స్పృహతో ఉండడమే కాదు, అందరికీ తన నడవడిక ద్వారా ఒక సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు.రుషులు లోకహితం కోరి మనకు అందించిన పురాణాలు మనల్ని వారికి రుణగ్రస్థుల్ని చేసాయి. ఎప్పుడో వయసు మీరిన తరువాత, పదవీవిరమణ తరువాత చదవాల్సినవి కావు అవి. చిన్నప్పటినుంచి వాటిని చదువుకుంటే, అవగాహన చేసుకుంటే మన జీవితాలు చక్కబడతాయి. అదీకాక రుషిరుణం తీరదు కూడా. ఇది తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం చాలు. బ్రహ్మచారిగా ఉండగా రామాయణ భారత భాగవతాదులు, ఇతర పురాణాలు, వేదాలు ఏవయినా చదువుకోవచ్చు. కానీ మిగిలిన రెండు రుణాలు–పితృరుణం, దేవరుణం మాత్రం గృహస్థాశ్రమ స్వీకారంతోనే తీరతాయి.– బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నీతోనే నేను.. నాతోనే నీవు
సీతమ్మ మనసు ఆమె దగ్గర లేదు. రాముడి దగ్గర ఉంది. రాముడి మనసు ఆయన దగ్గర లేదు. సీతమ్మ దగ్గర ఉంది. అందుకే ఇద్దరూ అలా కలిసి ఉండగలిగారు’ అంటాడు హనుమ రామాయణంలో. ఎలా కలిసి ఉన్నాం.. అన్నదాని కన్నా, ఎంతకాలం కలిసి ఉన్నాం.. అన్న దాని కన్నా, ఎంతగా మనసులు ఒక్కటిగా చేసుకుని బతికామన్నది దాంపత్యంలో ప్రధానం.ఒకప్పుడు కంచి మహాస్వామి తీర్థం ఇస్తున్నారు. భక్తులు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే ఆయన సందర్భాన్ని బట్టి అనుగ్రహిస్తూ ఉండేవారు. అలా ఒకరోజు తీర్థమిస్తూ ఒక ముసలామెను ‘ఏమమ్మా, ఏమిటి చెప్పు’ అన్నారు. ‘నాకన్నా ముందు నా భర్తగారు పోయేటట్లు ఆశీర్వదించండి’ అన్నది. ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోతూ ఎందుకలా! అనడిగారు.‘‘స్వామీ! ఏమని చెప్పను. ఆయనది పసిపిల్లవాడి చాపల్యం. మూర్ఖత్వం. ఏదీ తెలియని అమాయకత్వం. నేనున్నంతకాలం ఆయనకు ఏ లోటూ లేదు. రానీయను కూడా. ఇద్దరికీ వయసయిపోయింది. ఆరోగ్యం కుదురుగ్గా ఉండడం లేదు. నేను ముందుపోతే తరువాత ఆయన పరిస్థితి ఏమిటా అన్నదే నా దిగులు. ముందు ఆయన వెళ్ళిపోతే నేనెలాగూ వదిలి ఉండలేను. వెనకే నేనూ పోతా. అందుకని ముందు ఆయన పోయేట్టు అనుగ్రహించండి’ అని వేడుకుంది.అంతటి మహాస్వామికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. అందరివంకా చూసి ఇదీ భారతీయ దాంపత్యం.. అన్నారు. ఎంత తప్పు చేసినా ఉద్ధరించుకోవడమే తప్ప చేయి వదిలిపెట్టడం అనే మాట అన్వయం కాని ధర్మం ఇది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం – అహల్య ఉ΄ాఖ్యానం. భార్య దోషమే చేసిందని తెలిసినా ఆ దోషం చేయడానికి కారణమయిన మానసిక ఉద్వేగాలను దూరంగా ఉంచుకుని..‘‘...వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ..’’ నువ్వు తపస్సు చేత పవిత్రమై, మళ్ళీ నా పక్కన స్థానాన్ని ΄పోదు. పునీతవు కా..’’ అని అహల్యను ఉద్ధరించుకున్నాడు తప్ప ఆమెను విడిచిపెట్టేస్తున్నా.. అన్న మాట మాత్రం గౌతమ మహర్షి అనలేదు. అదీ గృహస్థాశ్రమ వైశిష్ఠ్యం. ఇటువంటి ధర్మానికి రెండు చేతులెత్తి నమస్కారం చేయాలి.వివాహం అయిపోయిన తరువాత ప్రదానం చేసేటప్పుడు భర్త భార్యతో ‘‘నువ్వు నన్ను నీ పదవ కుమారుడిగా చేసుకుంటావా?’’ అని అడుగుతాడు. భర్త పదవ కుమారుడు ఎట్లా అవుతాడు? మలి వయసులో శరీరం పట్టు తప్పుతుంటుంది. పెంకితనం ఏర్పడుతుంది. అహం పెరుగుతుంది. అప్పుడు నీ పిల్లలను చూసినట్లు నన్ను చూస్తావా... అని అడుగుతాడు.రామాయణంలో సీతమ్మ .. ‘‘ఇక్కడ రాజ్ర΄ాసాదంలో ఎన్ని సుఖాలయినా ఉండనీయవయ్యా రామా, నన్ను అరణ్యవాసానికి వద్దంటావేమిటి ! ..’’ అంటూ ‘‘నాతంత్రీ వాద్యతే వీణా, నా చక్రో వర్తతే రథః / నా పతిః సుఖమేధేత యా స్యాదపి శతాత్మజా...’’ అంటుంది. నా కొడుకులు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నా, నువ్వు లేని నాడు నాకు తృప్తిలేదు. అది అరణ్యమయినా నువ్వున్న చోటే నా చోటు..’’ అంటుంది. ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం అంత గొప్పది. దానికి కారణం ప్రేమ ఒక్కటే కాదు. అంతర్లీనంగా ధర్మం ఉంటుంది. దానిలో దంపతులు తరించి పోతారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
గంగే మాం పాహి
విష్ణుమూర్తి స్పర్శచేత పరమపావనియైన గంగలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయన్నది సనాతన ధర్మ విశ్వాసం. అంటే... పాపాలు చేసి గంగలో మునిగి వాటిని పోగొట్టుకోవచ్చని అర్థం చేసుకోకూడదు. తెలిసో తెలియకో ఇప్పటివరకు చేసిన పాపాలు గంగాస్నానంతో పోగొట్టుకుని, ఇక మీదట ఎటువంటి పాపపు పనులు చేయకుండా నన్ను నేను నియంత్రించుకునే శక్తినీయవలసిందిగా భగవంతుని వేడుకోవాలి. అదే ధర్మాచరణం. వద్దన్న పని వదిలిపెట్టడమే ధర్మాచరణ. అది విష్ణువుకు ప్రీతిపాత్రం. ముత్తుస్వామి దీక్షితార్ వారు గంగపై కీర్తన చేస్తూ... ‘‘గంగే మాం పాహి గిరీశ శిర స్థితే/గంభీర కాయే గీత వాద్య ప్రియే/అంగజ తాత ముదే అసి వరుణా మధ్యే/అక్రూర పూజితే అఖిల జనానందే...’’ అన్నారు. గంగమ్మ గొప్పదనాన్ని చెబుతూ... అక్రూరపూజితే అని కూడా అన్నారు. గంగను కీర్తిస్తూ అక్రూరుడి ప్రస్తావన ఎందుకు తెచ్చినట్టు ..? మిగిలిన పురాణాలన్నింటినీ వ్యాస భగవానుడు రాస్తే... విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి ఇచ్చాడు. శమంతకోపాఖ్యానం దీనిలోనిదే. అయితే ఇక్కడ గమ్మత్తయిన ఒక విషయం చెప్పుకోవాలి. వినాయక చవితినాడు వ్రత మహాత్మ్యంలో మనం ఒక కథ చదువుకుంటూంటాం. ఒక పసిపిల్ల ఉయ్యాల్లో ఉందనీ, ఆ పిల్లను కృష్ణుడు పెళ్ళి చేసుకున్నాడనీ, ఆమే జాంబవతి అనీ... ఇలా సాగుతుంది.. కానీ నిజానికి విష్ణు పురాణంలో చెప్పింది వేరు. ఉయ్యాల్లో ఉన్నది పసిపిల్లవాడు. దానిని ఊపుతున్న యవ్వని జాంబవతిని కృష్ణపరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. వినాయక చవితి రోజున మిగిలిన కథను పూర్తిగా చదివినా చదవకపోయినా...‘‘...తవ హియేషా శమంతకః’’ అంటూ ముగిస్తారు. నిజానిక శ్రీకృష్ణుడు శమంతక మణివల్ల ఎన్ని కష్టాలుపడాలో అన్ని కష్టాలు పడ్డాడు. అటు సత్యభామకు దూరమయిపోయాడు, ఇటు జాంబవతికీ దూరమయ్యాడు. శమంతక మణిని కృష్ణుడే కాజేసాడని వారిద్దరే కాదు, బలరాముడు, ఇతర బంధువులు, ద్వారకానగరవాసులూ అందరూ అనుమానించారు. ఇంతకూ అసలు శమంతకమణి ఎక్కడుంది? అక్రూరుడి దగ్గర. అక్రూరుడు ఎక్కడున్నాడు? అంటే... ఆ మణికి ఒక నియమం ఉంది. బాహ్యాభ్యంతర శౌచం ఎవరికుంటుందో వారిదగ్గర అది బంగారం పెడుతుంది, దాన్ని దాచుకోకుండా లోకసంక్షేమం కోసం వెచ్చించే పరమ భాగవతోత్తముడి దగ్గర ఉంటుంది. లేకపోతే చంపేస్తుంది. ప్రసేనుడు, సత్రాజిత్తు అలాగే చచ్చిపోయారు. కాబట్టి అది ఉన్నచోట నిత్యాన్నదానాలతో నవ వసంతశోభ ఉంటుంది. అలా కాశీ వెలిగిపోతున్నది కాబట్టి అక్కడ అక్రూరుడు ఉంటాడని భావించి ‘అక్కడికి వెళ్ళి అక్రూరుడిని పిలుచుకురండి’ అని కృష్ణుడు ఆదేశించాడు. గంగను పూజిస్తూ గంగలో స్నానం చేస్తున్న అక్రూరుడికి కృష్ణుడి సందేశం వినిపించగానే.. అక్రూరుడు వెళ్ళి ఆ శమంతకమణిని ఇవ్వబోతే...‘‘అంతః శౌచం, బాహ్య శౌచం’ నీలో ఉన్నాయి కనుక అది నీవద్దే ఉంచుకో’ అని కృష్ణుడు చె΄్పాడు. అక్రూరుడు ద్వారకానగరం వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కాశీ వెళ్ళి అక్కడే ఉండిపోయాడు గంగకోసం. పరమ భక్తితో రోజూ పూజిస్తూ నిత్యం గంగలో స్నానం చేసేవాడు. శాస్త్రాలు చదవకపోయినా గంగానది ఒడ్డున గురువుగారి శుశ్రూషలో ఇన్ని విషయాలు తెలుసుకున్న దీక్షితార్ వారి కీర్తనల్లో అనేక శాస్త్ర రహస్యాలను ప్రస్తావిస్తారు. వాటిలో గంగను స్తుతిస్తూ చేసిన ఈ కీర్తన ఒకటి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వీథి దీపం వెలగకపోతే...!!!
‘అచ్చమైన దీప సన్నిధిని మరుగిడబడి చెఱచినట్లున్నది...’. అంటున్నాడు త్యాగయ్య ఆ కీర్తనలో. కాంతినివ్వడం ఒక్కటే దీపశిఖ లక్షణం. దీపానికీ, ఈశ్వరుడికీ ఓ లక్షణం ఉంటుంది. వీథి దీపం వెలుగుతుంటే ఆ వెలుగులో అక్కడేమయినా పామున్నా, తేలున్నా తెలుస్తుంది. గుంటలు, రాళ్ళురప్పా కనబడతాయి... అని చెప్పి ‘ఓ దీపమా! నా మార్గమును నిష్కంటకం చేసితివి, నాకు దారి చూపితివి. నీకిదే నా నమస్కారం..’ అంటూ ధ్యానశ్లోకాలంటూ ఏమీ ఉండవు దానికి. అయితే మనకు దారి చూపినందుకు దానికేసి గౌరవంగా చూస్తాం. ఓ రోజున ఒక ధూర్తుడు రాయి విసిరి దాన్ని పగలగొట్టాడు. ఇంతమందికి వెలుగిచ్చే దీపం, ఇంతమందికి దారిచూపే దీపం... అది మలిగిపోయేటట్లు చేస్తే ... రాయి విసిరినవాడిపై ఆ దీపమేమీ తిరగబడదు. ఆ వెలుగు ప్రయోజనాన్ని అనుభవిస్తున్న మనం దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ‘‘అది లేకపోయినా ఫరవాలేదు. మా బతుకు మేం బతికేస్తాం ...’’ అంటే దీపానికి వచ్చిన నష్టమేమీ లేదు... మనకు మాత్రం ఆ చీకటే మిగులుతుంది, దానిలో దేవులాటే ఉంటుంది. భగవంతుడు కూడా అంతే. ‘నివాసవృక్షః సాధూనాం ఆపన్నానాం పరాగతిః/ఆర్తానాం సంశ్రయశ్చైవ యశసః చ ఏకభాజనమ్’.. అంటారు కిష్కింధకాండలో. భగవంతుడున్నాడు.. అని నీవు నమ్మి బతకగలిగితే భగవదనుగ్రహం. ఆయనేమిటి ? ఆయనెందుకు?.. అని చెప్పి ఆయనను తిరస్కరిస్తే చీకటి మిగిలేది మనకే, ఆయనకు కాదు. ‘అచ్చమైన దీపశిఖ సన్నిధిని మరుగు అడ్డుపడి చెఱచినట్టున్నది...’ ఓ దట్టమైన బట్టలాంటిది అడ్డు వచ్చిందనుకోండి.. అప్పుడు ఆ వెలుతురూ ఉండదు. దాని సహాయంతో చూసే అవకాశమూ ఉండదు. కాబట్టి ఆ దీపశిఖ నాకు కనబడడం లేదు... అంటే ఆ దీప శిఖ మరేదోకాదు, పరబ్రహ్మమే. అది ఒక్కటే వెలుగుతోంది. ‘‘లోకంబులు లోకేశులు లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెంజీకటికవ్వల నెవ్వండేకాకృతి వెలుగునతని నే సేవింతున్’’ అంటారు పోతన గారు భాగవతంలో...అటువంటి వెలుగు ఇక్కడ వెలుగుతుంది. కానీ ఆ దీపం కనబడకుండా ఒక తెర అడ్డుపడుతున్నది. ఈ తెరను నేను తీయలేను ... అని ఆర్తితో వేడుకుంటున్నాడు త్యాగయ్య. ఇదెలా ఉందంటే...‘మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైన రీతియున్నది’ అని పోలికను చెబుతున్నాడు. చేప దానిదారిన అది పోతూ దారిలో కనిపించిన ఎరచూసి ఆశపడింది. దాన్ని కొరికింది. ‘మఛ్లీ జల్ కా రాణీ, ఉస్కా జీవన్ పానీ, హాథ్ లగావ్ తో డర్ జాయేగీ, బాహర్ నికాలేతో మర్ జాయేగీ’’.. ఇంకేముంది.. నీళ్ళలోంచి తీసి భూమ్మీద పడేస్తే చచ్చిపోయింది. అంటే తిందామనుకుని తినబడింది. ఈ మత్సరమను తెరతీయనంతకాలం నా పరిస్థితీ ఇంతే.. దీపం కనిపించదు.. స్వామీ ఆ తెరతీయి.. అంటే. అరిషడ్వర్గాల గురించీ నీ ద్వారా ఒక సందేశం లోకానికి అందాలని అనుకున్నాడేమో, ఆయన ఆ తెరనుదీసి దర్శనమిచ్చాడు. ఇదీ సంగీతంవల్ల, పాట పాడడం వల్ల, వినడం వల్ల ప్రయోజనం. అది ఆయనకే కాదు అందరి ఆత్మోద్ధరణకు కారణమయి నిలిచింది. అంత గొప్ప వాగ్గేయకారులు, లోకానికి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినవారు, దీప స్తంభాల వంటివారు.. మన మధ్య గడిపిన వారు కావడం మన అదృష్టం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
నోటిమాట నిప్పుతో సమానం
మనకు ప్రధానంగా మూడు ఉపకరణాలుంటాయి–శరీరం, మనస్సు, వాక్కు. శరీరం అన్నం చేత తయారవుతుంది. సూక్ష్మ శరీరమైన, సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సు కూడా అన్నం వలననే తయారవుతుంది. ఇది ప్రాణం అత్యంత ప్రధానమైనది. ఎంతకాలం ప్రాణం లోపల తిరుగుతుంటుందో అంతకాలమే ఈ శరీరానికి పూజనీయత. ఎంతకాలం వాయువు బయటికెళ్ళి లోపలకు వస్తుంటుందో అంతకాలం మాత్రమే ‘బాగున్నారా !’, ‘బాగున్నారా!’ అని అని కుశల ప్రశ్నలు వేస్తుంటారు. లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళిన వాయువు లోపలికి పీల్చబడకపోయినా .. అక్కడితో దాని మంగళప్రదత్వం పోతుంది. అది ఇక శివం కాదు, శవం. అటువంటి ప్రాణాన్ని పోషించగలిగేది నీరు. ప్రాణులను అన్నింటినీ కూడా పోషించగలిగిన శక్తి నీటికి ఉంటుంది. అందుకే ‘అమృతం వా ఆపః’ అంటారు. నీరు అమృతంగా చెప్పబడింది. పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాభిషేకం అంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు.. ఇవి పంచామృతాలు. నీళ్ళు ముఖాన చిలకరిస్తే... స్పృహæతప్పిపోయినవాడికి కూడా స్పృహ, ప్రాణాలు వస్తాయి. అంటే ప్రాణాలను తిరిగి యథాస్థానంలో నిలబెట్టగలిగిన శక్తి నీటికి ఉంది. చిట్టచివరిది వాక్కు. ఈ వాక్కు.. స్వరపేటిక పేరిట భగవంతుడిచ్చిన మహత్తరమైన కానుక. దీనిని ఆధారం చేసుకుని మనిషి తాను తరించిపోవచ్చు... ఇతరుల అజ్ఞానం పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. కలియుగంలో భగవంతుని నామాన్ని పలకడంకన్నా గొప్పది మరొకటి లేదు. అది భగవంతుడిని ఉద్దేశించే పలికింది కాకపోవచ్చు. ‘బిడ్డపేరుపెట్టి పిలిచిననైన విశ్రామకేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయనతలుప కలుషహరము’ అంటారు... భాగవతంలో. బిడ్డను దేముడి పేర్లలో ఒకటిపెట్టి పిలిచినప్పటికీ... పిలిచింది బిడ్డనే అయినా... భగవంతుడి నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి పాపరాశి ధ్వంసమవుతుంది... అన్నారు. విశ్రామకేళినైన... ఆడుకునే సమయంలో ఇరుపక్షాలూ ఒకరు రాముడి పక్షమనీ, మరొకరు కృష్ణుడి పక్షమంటూ అలా పేర్లుపెట్టుకుని ఆడుకుంటూ ఆ పేర్లను ఉచ్చరించినా చాలట. పద్యమో, గద్యమో, గీతమో... ఏదయినా కావచ్చు... అది భగవంతుని నామంతో కూడుకున్నదయితే చాలు అది కలుషహరము.. కలుషాలను అన్నింటినీ పోగొట్టగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అలా తనకు తాను తరించడానికే కాదు.. ఇతరుల అజ్ఞానమనే చీకటిని దహించివేయడానికి కూడా వాక్కు ఉపకరిస్తుంది ... ఎలా? వాక్కు అగ్నిహోత్రంతో సమానమైనది. అగ్నిహోత్రానికి ఉన్న లక్షణం అవతలి వస్తువును దహించి వేస్తుంది. అలాగే వాక్కుకు ఉన్న లక్షణం అవతలివారి అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. తెలియని విషయం అది తెలిసినవారి దగ్గర విన్నప్పుడు.. ‘నాకు తెలియదు’ అన్న తెలియనితనం పోతుంది. అంత గొప్ప వాక్కు మహాత్ములయినవారి నోటివెంట వచ్చినప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అది వ్యక్తి ఉద్ధరణకు, సమాజ ఉద్ధరణకు కారణమయి ఉంటుంది. వారు దేశికులై ... అంటే మార్గనిర్దేశకులై మనం ఎటువైపు ప్రయాణం చేయాలో దిశానిర్దేశనం చేస్తుంటారు. (సశేషం). బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అందం.. అంటే!!!
ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్లకవి జాన్ కీట్స్ ఒక మాటన్నారు...‘‘ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫరెవర్’’– అని. ఒక అందమైన వస్తువు ఎప్పటికీ సంతోషకారకమే. అందమైన వస్తువు అంటే ... నాకు ఏది అందంగా కనపడుతుందో, మీకు అది అందంగా కనపడకపోవచ్చు. నాకు అందంగా కనిపించింది దేశకాలాలతో సంబంధం లేకుండా అది నాకు శాంతి కారణమయి ఉంటుంది. అసలు లోకంలో ఏ పనిచేసినా దేనికోసం చేస్తాం? శాంతి కోసమే. ఏది శాంతిని ఇవ్వగలదో అదే అందం. ఏది మనసుకు అశాంతి ఇవ్వడం ప్రారంభించిందో అది అందవిహీనం. భగవద్గీతలో గీతాచార్యుడు ఒకమాటంటాడు – ‘‘తత్తదేవా గచ్ఛత్వమ్ మమ తేజోంశ సంభవమ్’’.. అని. అటువంటి గొప్ప అందం ఎక్కడయినా ఉంటే .. అది భగవంతుని తేజస్సు అవుతుంది. నేను ఒకప్పడు నైమిశారణ్యానికి వెళ్ళాను. అక్కడ గోమతీ నదీతీరంలో ఒక పెద్ద వటవృక్షాన్ని చూసాను. ఎంత పెద్దదంటే.. దాని కొమ్మలు, ఆకులు, ఊడలు తగలకుండా దాని చుట్టూ తిరగడానికి 15–20 నిమిషాలు పడుతుంది. ఎన్ని కొమ్మలు, ఎన్ని ఊడలు, పైన పక్షులు, పక్షి గూళ్ళు.. అలా చూస్తుండి పోయాను. ఇప్పటికి పదేళ్ళు పైగానే అయిపోయి ఉంటుంది. అయినా ఇప్పటికీ అది జ్ఞాపకానికి వస్తే.. దాని సౌందర్యం, దాని పరిమాణం వెంటనే మనసులో మెదిలి అప్పటివరకు నాలో ఉన్న ఉద్వేగం కానీ ఇతరత్రా చికాకులు, విసుగు, అశాంతి అన్నీ మటుమాయమై పోతాయి. ఒకసారి ఒక కోనేరులో సహస్రదళ కమలాన్ని చూసాను. వెయ్యిరేకుల పద్మం. అక్కడున్నవాళ్ళు దాన్ని కోసి తెస్తే ... నా రెండు చేతులా నిండుగా అది తాజాగా కనిపించడమే కాదు... దగ్గరనుంచి చూస్తే.. ఎన్ని రెక్కల దొంతర్లు, ఎన్నెన్ని రంగులు, ఎంత చక్కటి అమరిక, మధ్యలో ఉన్న దుద్దు, ముఖానికి దగ్గరగా తీసుకుంటే ఎంత చల్లదనం.. అలా దానిని ఆస్వాదిస్తూ ఉండిపోయాను. కొంతసమయం తరువాత అది వాడిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది... కానీ నా జ్ఞాపకాల్లో అది వాడలేదు, నశించలేదు, నా స్మృతిపథంలో దానికి బురద లేదు, మొగ్గలేదు, వందలాది రేకులతో, చిత్రవిచిత్ర వర్ణాలతో నా చేతిలో బాగా విప్పారి, నాకు చల్లదనాన్నిచ్చి... అలా నా మనసులో ముద్రితమైన ఆ పూవు మాత్రం నా చివరి శ్వాసవరకు, నేనెప్పుడు గుర్తుకు తెచ్చుకున్నా మొదటిసారి చూసినప్పుడు ఎంత అనుభూతి చెందానో, అంతే అనుభూతిని పొందుతూనే ఉంటాను. అలా గుర్తుకొచ్చినప్పుడు ఆ అందం నాకు సంతోషాన్నిస్తుంది, శాంతినిస్తుంది. అంటే దానికి దేశకాలాలతో సంబంధం లేదు. ‘బీజస్వాంతరివాంకురోజగదివం ప్రాంగే నిర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకకలగా వైచిత్రచితైకృతం’ అంటారు శంకరులు. అలా అది ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. ఒకవేళ మళ్ళీ వెళ్ళినా అక్కడ అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి చూసి అనుభూతి చెందిన అందం నా స్వంతం. అదెప్పటికీ నాతోనే ఉండి... నాకు సంతోషాన్ని, శాంతిని, ఉపశమనాన్ని కలిగిస్తూనే ఉంటుంది. అంటే ఏది నీకు శాంతికారకమో, సంతోషకారకమో అదే నిజమైన అందం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
వినయం అనే విత్తనం పడితేనే...
‘‘మీరెలా కోరుకున్నారో మేమలా నడుస్తాం. మీరు చూపిన బాట మాకు ఆదర్శం’’ అని వారి పాదాలకు నీవు నమస్కరించినప్పుడు... వారు పెద్దలు.. అని లోపల నీ బుద్ధి గ్రహిస్తోంది. వారు స్వార్థాన్ని విడనీడి, త్యాగమయ జీవితాన్ని గడుపుతున్నవారని కూడా నీకు తెలుసు. కానీ మనసులో అసూయ ప్రబలుతోంది. ఇక ఇప్పుడు నీవు వారిని అలా గౌరవించలేవు, నమస్కరించలేవు, పొగడలేవు. స్థిమితంగా కూర్చుని అవతలివాడిలో లేని అవగుణాల్ని ఉన్నట్లుగా చూపించడానికి పూనుకుంటావు... అదే అసూయ. పెద్దలపట్ల, మహాత్ములపట్ల తప్పుగా మాట్లాడితే ఏమవుతుంది? త్యాగరాజస్వామి గురించి నేనొక తప్పు మాట అన్నాననుకోండి. నేను ఆయనలా పాట పాడలేకపోయానని, కీర్తన రాయలేకపోయానని ఆయనలో దోషాలు వెతకడానికి పూనుకోవడం అంటే అసూయ ఏ స్థాయికి పాకి పోయిందో ఊహించవచ్చు. దానివల్ల త్యాగరాజ స్వామి వారికేమయినా తక్కువయిందా? ఆయన రామచంద్రమూర్తిలో ఐక్యమయిపోయారు. అంటే దుర్గుణాలకు నేను ఆలవాలమయిపోయాను తప్ప అవతలివారికేమీ కాలేదు. అదే రెండుచేతులెత్తి, తలదించి నమస్కరించానంటే నేను సన్మార్గంలో ఉన్నానని గుర్తు. అది సంస్కారానికి లక్షణం. ఇది వినయం నుంచి వస్తుంది. అది రావాలంటే అహంకారం పోవాలి. వెలుగు రాగానే చీకటి పోయినట్లుగా వినయం ఏర్పడగానే అహంకారం దానంతట అదే పోతుంది. పెద్దలపట్ల గౌరవ భావం ఏర్పడుతుంది. సంస్కారం మూర్తీభవిస్తుంది. మనకు నిరంతరం తటస్థపడే ముగ్గురిలో మనకన్నా అధికులు కనబడితే ఏమవుతుందో చూసాం. మనతో సమానులు తటస్థపడితే ఏమవుతుంది!!!...సమానులయిన వారు కనబడకుండా ఉండరు. మనకెంత ప్రజ్ఞ ఉందో వారికీ అంతే ప్రజ్ఞ ఉంటుంది, అంతే చదువు, ఉద్యోగం ఉంటాయి. నేను కష్టపడి ఒక ఫ్లాట్, ఒక మోటారు సైకిలు ఎలా కొనుక్కున్నానో వారూ అలానే కష్టపడి కొనుక్కున్నారు. నేను వారూ సమానులం. ఇప్పడు మనసులో ఒక దుర్గుణం ప్రవేశించింది. వెంటనే ఉదాసీనత ఏర్పడుతుంది. అతను నాకన్నా ఏమంత గొప్ప కనుక. నేనేమిటి అతన్ని గౌరవించేది. ఆయన నాకన్నా అధికుడేం కాడు. అధికారాల్లో ఆయనకెన్ని ఉన్నాయో నాకూ అన్నే ఉన్నాయి. ఎందుకు లెక్కపెట్టాలి? ఎందుకు గౌరవించాలి?... ఇది ప్రమాదకరమైన పోకడ. అహంకారానికి పరాకాష్ఠ. ఆయనా నేను సమానులం. ఒక మోటారు సైకిలు కొనుక్కోవడానికి నేను ఎన్నాళ్ళు కష్టపడ్డాను! ఒక ఫ్లాట్ స్వంతం చేసుకోవడానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది! జీవితంలో ఆ ఒక్క ఫ్లాటు చేతికొచ్చి గృహ ప్రవేశం చేసి పూజగదిలో కూర్చుని పూజచేస్తూ..‘స్వగృహే’ అని చెప్పుకున్న క్షణంలో... ‘హమ్మయ్య, ఒక గూడు ఏర్పరుచుకోగలిగాను. వేదం అంతటిది ఒక ఇల్లు ఉండాలని చెప్పింది కాబట్టి పెద్ద భవంతి కాకపోయినా చిన్నదయినా కొనుక్కోగలిగాను. ఈశ్వరుడిచ్చాడు కదా!... అనుకుని నువ్వెలా సంతోషపడిపోతావో... అలా ఆయన కూడా ఎంత కష్టపడితే ఆ ఫ్లాటు కొనుక్కోగలిగాడో...అన్న ఆలోచన వచ్చినప్పుడు ఉదాసీనత స్థానంలో ఆదరణ వచ్చిచేరుతుంది. ఆయనా నావంటి వాడే. సమానుడే. సమానంగా కష్టపడ్డాం... అని చెయ్యి చెయ్యి కలిపి నడవగలిగావనుకో. ఇప్పుడు ఉదాసీనత పోయి ఆదర భావం ఏర్పడింది... అంటే నీవు సంస్కారవంతుడవయి ఉన్నావని గుర్తు. వినయం అన్న విత్తనం లేకుండా అసలు ఈ మొక్కలు మొలకెత్తవు. వినయం ఉంటే సంస్కారం ఉన్నట్లే... సమానుల పట్ల కూడా ఆదరభావంతో ఉంటావు. మీకు తెలుసా పరమశివునికి ఉన్న అనేక పేర్లలో ఆశుతోషుడు ఒకటి. ఆశుతోషుడంటే స్వల్పమాత్రానికే సంతోషించేవాడని అర్థం. ప్రస్తుతం ఆలయాలకు వెళ్లే అవకాశం అతి తక్కువ కాబట్టి మన ఇంటిలో ఉన్న శివలింగానికి (అన్నంతో లేదా బెల్లంతో చివరకు పిడికెడు బంక మట్టితో లేదా చారెడు ఇసుకతో కూడా శివలింగాన్ని తయారు చేయవచ్చు) అందుబాటులో ఉన్న ఆవునెయ్యి, పెరుగు తేనె లేదా చెరుకురసం, లేదా చక్కెర నాటితో అయినా అభిషేకం చేయవచ్చు. భక్తసులభుడు సంతోషించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఇది శాస్త్ర ప్రమాణం. ఇష్టదైవానికి మామిడి పండుని నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయిన వారు దైవానికి నివేదించిన మామిడి పండుని ఈశ్వరుడికి అభిషేకం చేసిన తేనెలో కలిపి అందరికీ పంచి, ఆ తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారిలో పరివర్తన, పశ్చాత్తాపం కలిగి స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు. అలాగే, దైవానికి సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే వివాహానికి కలుగుతున్న అవాంతరాలు అన్ని తొలగిపోతాయి అని పెద్దలు చెబుతారు. ఒక విషయం కలియుగంలో భగవన్నామ స్మరణ వలన ముక్తి లభిస్తుందని వేదోక్తి. స్మరణ మనస్సు చేసే పని. కేవలం దేవుని నామాన్ని నోటితో పలికితే చాలదు. మనసుతో నిరంతరం స్మరించగలగాలి. మనస్సు ఒక చక్రం వంటిది. అది అన్ని దిక్కులకూ తిరుగుతుంటుంది. దానిని పరమాత్మ పాదాలయందు స్థిరంగా నిలపగలగాలి. మోక్ష సాధనాలన్నింటిలోకీ భక్తి గొప్ప సాధనం. ఆ భక్తికి శ్రవణం కీర్తనం స్మరణం దాస్యం... ఇలా తొమ్మిది మెట్లున్నాయి. వీటిని నవవిధ భక్తి మార్గాలంటారు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు ఆత్మ నివేదన కు చేరాలి. అదే మోక్షం లేక ముక్తి అంటే. ధర్మ సందేహం స్నానం చేసేటప్పుడు చదివే గంగేచ... శ్లోకంలో కృష్ణానదిని చేర్చలేదెందుకని? గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి నదులు ఏడున్నూ స్మరణ మాత్రంతో పవిత్రం చేస్తాయి. బావిలోని నీటిని లేదా కుళాయి నీటిని తీసుకుని ఈ నదులను స్మరిస్తే ఆ నీళ్లు ఆయా నదీజలాలుగా మారిపోతాయి. కృష్ణాది నదులు స్నానం చేస్తేనే మనలను పవిత్రం చేస్తాయి. అందుకే పైన తెలిపిన సప్తనదులను స్మరించుకుంటాం. విపత్తులు సన్మార్గంలో పెట్టడానికే దారి తప్పుతున్న మానవాళిని సన్మార్గంలో పెట్టడానికి, దైవం ఒక్కొక్కసారి కొన్ని పరీక్షలకు గురిచేస్తాడు. హెచ్చరికలు పంపుతాడు. మానవుడు దేవుని హెచ్చరికలను అర్థం చేసుకొని, తలబిరుసుతనం వదిలేస్తే సరేసరి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. కోవిడ్ 19 ఈవిషయాన్ని రుజువు చేసింది. గుమ్మం దాటి బయటికి రావడానికే మనిషి గజగజ వణికిపోయే పరిస్థితి. ఒక రకంగా ఇది దేవుని హెచ్చరిక. దైవాదేశాలను పెడచెవిన పెట్టిన ఫలితం. ఇప్పుడు మనిషి కీటకాలకు కూడా భయపడే పరిస్థితి నెలకొంది. మిడతల దండు దేశాలను, రాష్ట్రాలను బెంబేలెత్తించడాన్ని మనం గమనిస్తున్నాం. మానవుడు దైవాదేశాలను పట్టించుకోకుండా, మానవీయ విలువలను ఖాతరు చేయకుండా, ఇలలో కల్లోలానికి కారణమయ్యే పనులకు ఒడిగడితే, ఏదో ఒక రూపంలో దైవం హెచ్చరికల్ని పంపుతాడు. క్రిమి, కీటకాలు కూడా మనిషిని సవాలు చేసేలా చేస్తాడు. మూసా అలైహిస్సలాం కాలంలో కూడా ఇలా జరిగింది. పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది.:’ ..మేము వారిపైతుఫానును, మిడతల దండును పంపాము. ధాన్యపు పురుగులను (చెద పురుగులు), కప్పల రక్తాన్ని వదిలాము. ఇవన్నీ స్పష్టమైన మహిమలు. (వారు అర్థం చేసుకోడానికి..).(7 – 133). అనుకోకుండా తుఫాను వచ్చిపడితే, అది కొన్నిరోజులు కొనసాగితే, మనిషి ఎంత నిస్సహాయుడో తెలుస్తుంది. మూసా అలైహిస్సలాం కాలంలో తలబిరుసుతనం ప్రదర్శించిన ప్రజలు వరదల మూలంగా ముంపుకు గురయ్యారు. విపరీతమైన ధన ప్రాణ నష్టాలు సంభవించాయి. ఏడ్పులు, పెడబొబ్బలు, అర్తనాదాలు చేశారు ప్రజలు. అనేక సందర్భాల్లో మనం కూడా ఇలాంటి పరిస్థితుల్ని చూశాం. అదేవిధంగా కోట్ల సంఖ్యలో మిడతల దండ్లువచ్చి రాత్రికిరాత్రే పంటపొలాలను, పండ్లతోటలను తినేసేవి. ఖురాన్ లో ‘ఖుమ్మల్’ అనే పదం వాడబడింది. అంటే, పేలు, లేక చెద పురుగులు అని అర్థం. ఈ రెండు జీవులూ వారి శరీరంలో, వారి బట్టల్లో దూరి కంపరం పుట్టించేవి. చెద పురుగులు ఆహార ధాన్యాల్లో చేరి గింజల్ని గుల్లచేసేవి. దీంతో వారికి తీవ్రమైన ఆర్థిక నష్టం సంభవించేది. కప్పలు వారి వంట పాత్రల్లో, పడక గదుల్లో, ఆహార పదార్థాల్లో, నీటిపాత్రల్లో ఎక్కడంటే అక్కడే ఉండేవి. దీంతో వారు ఏమీ తినలేక, తాగలేక, కనీసం పడుకోలేక నరక యాతన అనుభవించేవారు. దైవికంగా జరిగిన ఈ శాస్తివల్ల వారి బతుకు దుర్లభమై పోయింది. చివరికి మంచినీరు తాగుదామన్నా అది ఎర్రని రక్తంలా మారిపొయ్యేది. ఆ కాలంలో ముక్కునుండి రక్తం కారే వ్యాధి సర్వత్రా ప్రబలిందని కొంతమంది వ్యాఖ్యానించారు. దైవభీతిని, పాపభీతిని, పరలోక చింతనను, మానవీయ విలువలను వారిలో ప్రోది చేసేనిమిత్తం దైవం ఇలాంటి హెచ్చరికలు, శిక్షలు అవతరింపజేస్తాడు. ప్రస్తుత కోవిడ్ 19 కూడా అలాంటి హెచ్చరికల్లో ఒకటి. ఇప్పడు తాజాగా అల్పజీవులైన మిడతల దండు చాలా రాష్ట్రాలకు సవాలు విసురుతోంది. మానవుడు ఇప్పటికైనా మేల్కొని ప్రకృతితో చెలగాటమాడే పనులకు స్వస్తిపలికి, దైవాదేశాల వెలుగులో జీవనం సాగిస్తే, ఇహ పర లోకాల్లో సాఫల్యం సాధించవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
బ్రహ్మశ్రీ చాగంటిగారి పండగ ప్రవచనం
-
కటిక చీకట్లోనే వస్తాడు
ఆచార్య దేవోభవ మనం అజ్ఞానం అనే కటిక చీకట్లో ఉన్నప్పుడు, ఒక దీపంలాగా వాటిని తొలగించడానికి ఒక గురువు అవసరమవుతాడు. అర్ధరాత్రి 12 గంటలవేళ వచ్చింది కృష్ణ పరమాత్మ అవతారం. పుడుతూనే ఆయన నిర్భయత్వాన్ని కల్పించాడు. అప్పటివరకు తనకు కొడుకు పుడితే ఏమయిపోతాడోనని భయపడిపోతున్న దేవకీదేవికి, వసుదేవుడికి ఊరటకల్పించాడు. పసిపిల్లవాడిగా జన్మించినప్పటికీ ఆయన రూపం గోచరమయినంత మాత్రం చేత భయం స్థానంలో ఆనందం కలిగింది. అది పరమేశ్వరుని లక్షణం. ఆయన దర్శనమే ఆనంద హేతువు. అందుకే ఆనందనిలయంలో ఉంటాడాయన. ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతను లోకానికంతటికీ బోధచేసి భయాన్ని పోగొట్టి, జ్ఞానాన్ని ప్రబోధంచేసి ఆత్మ అనుభవంలోకి రావడానికి మార్గాన్ని బోధచేసాడు. భగవద్గీతలో ఒక శ్లోకంకాదు ఒక పాదం చదువుకుంటే చాలు. అందుకే భగవద్గీతను నమ్ముకున్నవాడికి యమధర్మరాజుతో చర్చేలేదన్నారు శంకర భగవత్పాదులు. అంటే యమధర్మరాజు రావడం, పాశాలు వేయడం, రమ్మనమనడం, నేను రానని జీవుడు మొరాయించడం ఉండవు. చిట్టచివరన యమ దర్శనం లేకుండా తాను ఆత్మ అనే ఉద్దేశంతో ఆ ఆత్మ అనుభవంలోకి వచ్చిన వాడై శరీరం అసత్యమన్నది ఎరుకలోకి వచ్చి సాక్షిగా చూస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. భగవాన్ రమణుల వారికి అంత్యకాలం సమీపించింది. శరీరం పడిపోయే సమయం వచ్చేసింది. ఊపిరి సరిగా అందట్లేదు. ఆయన ఆనందబాష్పాలు కార్చారు. ’హమ్మయ్య, గుడారంలోంచి ఏనుగు బయటికి వచ్చినట్లు అత్యంత అల్పమైన, పరిమితైన ఉపాధిలోంచి ఆనంతమైన ఆత్మసర్వవ్యాపకత్వాన్ని పొందుతోంది – అని ఆనందించారు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకొస్తుంటే వద్దని సైగచేస్తూ నిర్భయంగా శరీరంలోంచి జ్యోతి స్వరూపంగా వెళ్ళి అరుణాచలం గిరికంతటికీ ప్రదక్షిణం చేసి కొన్ని వేలమంది దర్శనం చేస్తుండగా అరుణాచలంలోకి వెళ్ళిపోయారు. అది యోగం. అంటే అనేకంగా కనబడుతున్నవి – జీవుడని, ప్రపంచమని, నేనని, నువ్వని, ఒకటని మూడని, పదహారని కనబడుతున్నవి చిట్టచివరిగా సత్యంగా ఒకటిగా రూపాంతరం చెంది అనుభవంలోకి వస్తాయి. అజ్ఞానపు తెరలు తొలగి జ్ఞానం జ్యోతి స్వరూపమై ప్రకాశిస్తుంది. పడిపోతున్న శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. ఒక కంట్లో నొప్పెడుతుంటే కంట్లో నొప్పి పెడుతున్నదని ఎలా తెలుసుకుంటున్నామో, చెయ్యి నొప్పెడుతుంటే సాక్షిగా తన చెయ్యి నొప్పి పెడుతున్నదని ఎలా తెలుసుకుంటున్నామో పడిపోతున్న శరీరాన్ని కూడా తాను సాక్షిగా చూస్తాడు. అలా చూస్తూ నిలబడగలిగిన ప్రజ్ఞ, జ్ఞానం కేవలం భగవంతుని అనుగ్రహం చేత వస్తుంది. అందుకే భగవానుడు కూడా గురువుగానే ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్క గురువు యొక్క వాక్యం వలననే భగవంతుడు పరిచయమవుతాడు. -బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు