Brampton
-
Canada: హింసాత్మక ఘర్షణలు.. ఆలయంలో ఇండియన్ కాన్సులేట్ కార్యక్రమం రద్దు
ఒట్టావా: కెనడాలోని హిందూ దేవాలయంలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న దరిమిలా బ్రాంప్టన్ త్రివేణి కమ్యూనిటీ సెంటర్ నవంబర్ 17న ఇండియన్ కాన్సులేట్ నిర్వహించాల్సిన లైఫ్ సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఖలిస్థానీ బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేస్తూ కమ్యూనిటీ సెంటర్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ సంతతికి చెందిన హిందువులు, సిక్కులకు లైఫ్ సర్టిఫికేట్ పునరుద్ధరణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.బ్రాంప్టన్ త్రివేణి ఆలయానికి బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని, హిందూ సమాజానికి భద్రత కల్పించాలని కమ్యూనిటీ సెంటర్ పీల్ పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం రద్దు చేసినందుకు సభ్యులకు క్షమాపణలు చెబుతున్నామని, కెనడియన్లు ఇక్కడి దేవాలయాలను సందర్శించడం అసురక్షితమని భావిస్తున్నామని పేర్కొన్నారు. కెనడాలోని హిందువులకు తగిన భద్రత కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశామని తెలిపారు. Chief of Police with the Peel Regional Police in Canada, Nishan Duraiappah writes to Brampton Triveni Mandir & Community Centre, requesting them to consider rescheduling the upcoming Consular Camp at the Brampton Triveni Mandir & Community Centre on November 17, 2024."We…— ANI (@ANI) November 12, 2024నవంబర్ 3న బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలోని కాన్సులర్ క్యాంపుపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడికి దిగారు. ఇది హింసకు దారితీసింది. ఈ ఉదంతంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇది భారత దౌత్యవేత్తలను బెదిరించే పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కెనడా అధికారులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రభుత్వం ఆరోపించిన దరిమిలా గత ఏడాది రెండు దేశాల సంబంధాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఇది కూడా చదవండి: అమెరికా వ్యాప్తంగా... జాత్యహంకార మెసేజ్‌లు -
భగవద్గీత పార్క్ ధ్వంసంపై భారత్ సీరియస్.. వివరణ ఇచ్చిన కెనడా
టోరంటో: కెనడాలోని బ్రాంప్టన్‌లో భగవద్గీత పార్క్ ధ్వంసం విషయమై భారత్ సీరియస్ అయ్యింది. ఆ పార్క్ పేరును కూడా తొలగించడంతో భగవద్గీత పార్క్‌లో జరిగిన ద్వేషపూరితమైన ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నామని, సత్వరమే కెనడా అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కెనడాలోని భారత్ హైకమిషన్ ట్వీట్ చేసింది. ఐతే ఈ విషయమై బ్రాంప్టన్ మేయర్ బ్రౌన్ ట్విట్టర్లో వివరణ ఇస్తూ.... ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పైగా ఈ విషయమై తమ నగర పాలక సంస్థ సత్వరమే చర్యలు తీసుకుందని తెలిపారు. అయితే ఆ పార్క్‌లో ఎలాంటి విధ్యంసం జరగలేదని, కేవలం మరమత్తుల విషయమై ఆ పేరుని తీసి ఖాళీ గుర్తును ఉంచామని తెలిపారు. ఏదైన ప్రదేశం మరమత్తులు చేయాల్సి వస్తే దాని పేరుని తొలగించి ఆ ప్లేస్‌లో ఇలా ఖాళీగా ఉంచడం సర్వసాధరణమని తెలిపారు. అంతేగాక మరమ్తత్తుల పనులు పూర్తి అయిన వెంటనే అదే పేరును తిరిగి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా తెలిపారు. అంతేగాక ఆ నగర పోలీసులే ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. అలాగే విధ్వంసం చోటుచేసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు కూడా లేవన్నారు. పైగా గతంలో ఇది ట్రాయ్ పార్క్ అని ఆ తర్వాత భగవద్గీత పార్క్‌గా మార్చినట్లు కూడా తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల కెనడాలోని స్వామి నారాయణ్ మందిర్ అనే హిందు దేవాలయాన్ని కెనడా ఖలిస్తానీ తీవ్రవాదులు భారత్‌పై ద్వేషంతో కూల్చేశారు. ఈ నేపథ్యంలోనే భారత్ హైకమిషన్ తీవ్రంగా స్పందించింది. అంతేగాక కెనడాలో పెరుగుతున్న నేరాల దృష్ట్యా అక్కడ ఉన్న భారత పౌరులను, చదువు నిమిత్తం కెనడా వచ్చిన విద్యార్థులను తగు జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. We condemn the hate crime at the Shri Bhagvad Gita Park in Brampton. We urge Canadian authorities & @PeelPolice to investigate and take prompt action on the perpetrators @MEAIndia @cgivancouver @IndiainToronto pic.twitter.com/mIn4LAZA55 — India in Canada (@HCI_Ottawa) October 2, 2022 From @CityBrampton Community Services and Communications Department on the confusion over resident complaints about Gita Park sign. “We learned that the sign was damaged during the original install & a city staff member brought it back for unplanned maintenance & to reprint.” https://t.co/hkfmSFF1Ui — Patrick Brown (@patrickbrownont) October 3, 2022 (చదవండి: నోబెల్-2022: జన్యుశాస్త్ర మేధావి పాబో.. మానవ పరిణామ క్రమంలో సంచలనాలెన్నో!) -
త్రిభాషా సూత్రాన్ని పాటించండి: యార్లగడ్డ
బ్రాంప్టన్(కెనడా): హిందీ ప్రాంతీయులు విశాల దృక్పథాన్ని అలవర్చుకొని, త్రిభాషా సూత్రాన్ని పాటించాలని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సూచించారు. కెనడాలో విశ్వహిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ హిందీ కవిసమ్మేళనం ' కావ్యసాగర్' జరిగింది. బ్రాంప్టన్‌లోని ద గోర్-మీడేజ్ కమ్యూనిటీ సెంటర్లో జరిగిన ఈ కవి సమ్మేళనంలో కెనడా, భారత దేశాలకు చెందిన పలువురు హిందీ కవులు పాల్గొని తమ కవితలు, గజళ్లు, గీతాలతో వీక్షకులను ఆకట్టుకున్నారు. యార్లగడ్డ మాట్లాడుతూ హిందీ ప్రాంతీయులు ఏదో ఒక ఇతర భాషను కూడా నేర్చుకోవాలని, అప్పుడే జాతీయ సమైక్యత సాధించగలమని అన్నారు. విదేశాల్లో హిందీ భాషపై అభిమానం రోజురోజుకు పెరుగుతుందనడానికి కవి సమ్మేళనానికి హాజరైన వారిని చూస్తేనే అర్థం అవుతుందన్నారు. రానా, యూపికా, నారాయణ్ సేవా సంస్థాన్ అనే సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ కవి సమ్మేళనంలో రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి దీపికా ద్వివేదీ'దీప్', ఉత్తర్ ప్రదేశ్ కవయిత్రి మమతా వాష్ణేయ్, టోరంటో భారత రాయభార ప్రతినిధి, ఇంకా పలువురు హిందీ భాషాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టొరంటో నారయణ సేవాసమితి అధ్యక్షుడు కైలాష్ చంద్రభట్నాగర్ను నిర్వాహకులు జీవన సాఫల్యపురస్కారంతో సత్కరించారు. ఇటీవల పద్మభూషణ్ అవార్డు అందుకున్న యార్లగడ్డను విశ్వహిందీ సంస్థాన్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.