brand advertising
-
సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!
‘మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)’ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దేశంలోని భక్తులు మాత్రమే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సీఈఓలు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు హాజరవుతారు. ఈ తరుణంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నాయి. దాంతో విభిన్న ప్రచారపంథాను అనుసరిస్తున్నాయి.భారీగా భక్తుల తాకిడి..పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రయాగ్‌రాజ్‌లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈసారి దాదాపు 40 కోట్ల మంది మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు దీన్ని అవకాశం మలుచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి. అందుకోసం విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి.బ్రాండ్ ప్రచారంకొన్ని కంపెనీలు తమ బ్రాండ్‌ను ప్రచారం చేసుకునేందుకు దుస్తులు మార్చుకునే గదులు, ఛార్జింగ్ పాయింట్లు, విశ్రాంతి గదులు, సెల్ఫీ జోన్ల(Selfie Zones)ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉదాహరణకు, డాబర్ ఆమ్లా, వాటికా స్నానాల ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశాయి. డాబర్ లాల్ తేల్ ప్రత్యేక శిశు సంరక్షణ గదులను ఏర్పాటు చేసింది.ప్రకటనలకు భారీగా ఖర్చుభక్తులు నివసించే ప్రదేశాలు, షాపింగ్ చేసే ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్స్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్(LED Screens)లు వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో భక్తులకు తమ బ్రాండ్ల విజిబిలిటీ కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. హోర్డింగ్‌లు/ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రదర్శించాలని ఆసక్తి ఉన్నవారు కనీసం రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్‌పై 10 సెకన్ల యాడ్ కోసం కనిష్టంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.సాంస్కృతిక సమైక్యతకంపెనీలు తమ బ్రాండ్‌ను మార్కెటింగ్ చేసే వ్యూహాల్లో సంప్రదాయం, సంస్కృతిని మిళితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐటీసీ బ్రాండ్ బింగో.. లోకల్ సాంగ్స్‌పై రీల్స్ చేయాలని నిర్ణయించింది. కుకు ఎఫ్ఎం తన ఓటీటీ యాప్ ‘భక్తి’ని లాంచ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇదీ చదవండి: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?సామాజిక బాధ్యతకార్పొరేట్ కంపెనీలకు వచ్చే లాభాల్లో నిబంధనల ప్రకారం ‘కార్పొరేట్ సమాజిక బాధ్యత(CSR)’ కింద కొన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అది ఈ కుంభమేళాలో వెచ్చించనున్నారు. దాంతో కంపెనీలకు పబ్లిసిటీతో పాటు, సీఎస్ఆర్ నిధులు ఖర్చు అవుతాయి. అందులో భాగంగా హెల్ప్ డెస్క్‌లు, పోలీసు బారికేడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అత్యవసర సేవలను అందించడం ద్వారా సంస్థలు ఈ కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిసింది. మహా కుంభమేళా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. వివిధ దేశాల నుంచి సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. అంతర్జాతీయంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలనుకునేవారికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. -
2024 జనవరి నుంచి జూన్ వరకు టాప్ 10 బ్రాండ్ ప్రమోటర్లు (ఫోటోలు)
-
రణ్‌బీర్ ఆలియాల పెళ్లి.. బ్రాండ్ ప్రమోషన్లలో కార్పోరేట్ కంపెనీలు బిజీ..
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలో అటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో రణ్‌బీర్ ఆలియా పెళ్లి వేడుకలకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. దీంతో కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలపడంతో పాటు పనిలో పనిగా బ్రాండ్ ప్రమోషన్లో పడ్డాయి కార్పోరేట్ కంపెనీలు. - నెట్‌ఫ్లిక్స్ సంస్థ రణ్‌బీర్ కపూర్ నటించిన తమషా, ఆలియ్ భట్ నటించి డియర్ జిందగి సినిమాలను కోట్ చేస్తూ.. డియర్ జిందగీ మా ప్రేమ జీవితానికి సంబంధించిన తమాషా ముగిసింది, ఇక షాదీ లైఫ్‌లోకి ఎంటర్ అవుతున్నాం అంటూ శుభాకాంక్షలు తెలిపింది. Dear Zindagi, When will our love life ka Tamasha end and our own shaadi begin 🥺 — Netflix India (@NetflixIndia) April 14, 2022 - స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా ఆలియాభట్ వెండితెరకు ఎంట్రీ ఇవ్వగా రాకెట్సింగ్ సినిమాలో రణ్‌బీర్‌కపూర్ సేల్స్‌మాన్ రోల్ పోషించాడు. ఈ రెంటిండిటి ముడి పెడుతూ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, సేల్స్‌మన్ ఆఫ్ ది ఇయర్లకు వివాహ శుభాకాంక్షలు జొమాటో తెలిపింది. congratulations alia and ranbir, let us know if student of the year and salesman of the year need anything from the start-up of the year ❤️ — zomato (@zomato) April 14, 2022 - స్విగ్గీ సైతం ఇదే తరహాలో కొత్త దంపతులను పప్పన్నంతో పోలిక పెడుతూ శుభాకాంక్షలు తెలిపింది. congratulations to ranbir and alia on settling for dal chawal for 50 years and more ❤️ — Swiggy (@swiggy_in) April 14, 2022 చదవండి: ఆ విషయంలో రణ్‌బీర్‌పై ఆలియాదే పైచేయి! -
బ్రాండింగ్ ఇక సరికొత్తగా..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా సమయంలో బ్రాండ్లకు కష్టకాలం వచ్చింది. విశ్వసనీయమైన వినియోగదార్లు కూడా బ్రాండ్లను మరచిపోతున్నారు. ఈ సమయంలో బ్రాండ్లు మళ్లీ సున్నా నుంచి మొదలుపెట్టాలి. వినియోగదార్లతో సన్నిహిత సంబంధాన్ని ఎర్పరచుకోవాలి. బ్రాండ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ‘జాన్‌రైజ్ అడ్వర్టైజింగ్ అండ్ బ్రాండింగ్’ లాక్డౌన్ సడలింపుల వేళ ఒక సర్వేను నిర్వహించింది. కస్టమర్లను చేరుకోవడంపైనే ఇప్పుడు కంపెనీలు దృష్టిసారించాయని సర్వేలో తేలింది. బ్రాండ్లు కొత్త పరిస్టితులను అందిపుచ్చుకోవాల్సిన సమయం వచ్చిందని జాన్‌రైజ్ డైరెక్టర్ సుమన్ గద్దె వెల్లడించారు. ప్రపంచం అంతా సాధారణ స్టితికి రావాలని ఎంతలా ప్రయత్నిస్తుందో.. అంత కంటే ఎక్కువగా కంపెనీలు తమ వినియోగదార్లతో అనుబంధాన్ని పెంచుకోవడానికి కృషి చేయాల్సి ఉందన్నారు. బ్రాండ్లకు ప్రచారం కల్పించడం కోసం వ్యాపార ప్రకటనలపై డబ్బులు పెట్టడానికి అసలు వెనకాడకూడదని కంపెనీలు అంటున్నాయని చెప్పారు. ‘‘మా క్లయింట్ల జాబితాలో మరిన్ని బ్రాండ్లు చేరుతూనే ఉన్నాయి. కోవిడ్ కంటే ముందుతో పోలిస్తే ఆదాయాలు తగ్గినప్పటికీ.. వ్యాపార ప్రకటనలపై, బ్రాండ్ కమ్యూనికేషన్‌పై మరిన్ని వ్యయాలు చేయడానికి కంపెనీలు సిద్దంగా ఉన్నాయి’ అని జాన్‌రైజ్ డైరెక్టర్ చైతన్య బోయపాటి తెలిపారు. కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి.. సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది 27–35 వయసున్న వారున్నారు. 42.4 శాతం మంది ముందుగా తమ పిల్లల దుస్తులు, బొమ్మలు, ఇతరత్రా వస్తువులను కొనాలని భావిస్తున్నారు. లాక్డౌన్ అనంతరం 53.8 శాతం మంది స్నేహితులను కలవాలనుకుంటున్నారు. 9 శాతం మంది సౌందర్యం, వెల్నెస్ ఉత్పత్తుల షాపింగ్ చేయాలని భావిస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ సురక్షితమైనదని 60 శాతం మంది గట్టిగా విశ్వసిస్తున్నారు. 49 శాతం మంది సమీప భవిష్యత్‌లో మాల్స్‌కు వెళ్లే ప్రసక్తి లేదని అంటున్నారు. దుస్తులు, ఆభరణాల షాపింగ్‌పై 18 శాతం మందే ఆసక్తి కనబరిచారు. 58 శాతం మంది సినిమా థియేటర్లు, వినోదానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఇక స్విగ్గీ, జొమోటో లేదా సొంత డెలివరీ వ్యవస్థలున్న రెస్టారెంట్లు డెలివరీ అత్యంత సురక్షితం అన్న శక్తివంతమైన సందేశాన్ని పంపితేనే నిలదొక్కుకోగలుగుతాయి. ఇవి ఆహారంతో పాటు భద్రత చర్యల గురించి ప్రకటనల ద్వారా తెలియజెబుతూ వినియోగదార్ల మెదడులోకి ఎక్కాలి. రిటైలర్లు పాత ధోరణి నుంచి బయటకు వచ్చి కొత్త విధానాలను అందిపుచ్చుకోవాలి అని సర్వేలో తేలింది.æ -
చంద్రబాబు బ్రాండ్ పాఠాలు
-
ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్న ట్విట్టర్
ట్విట్టర్ తన ప్రత్యర్థి సోషల్ మీడియా సంస్థలతో పోటీకి సిద్ధమైంది. అంచనాలకు మించి ఆదాయాన్ని కోల్పోతుండడంతో, బ్రాండింగ్ అడ్వర్ టైజింగ్ డాలర్ల కోసం ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, స్నాప్ చాట్ లతో పోటీ కి సై అంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ట్విట్టర్ షేర్లు 24శాతం పడిపోయాయి. కంపెనీ నిర్ణయించిన రేట్లకనుగుణంగా బ్రాండ్ మార్కెటర్లు తమ బడ్జెట్లను పెంచడం లేదని ట్విట్టర్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలోనే న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్ లో ఈ షేర్లు 14శాతం కిందకి జారాయి. ట్విట్టర్ షేర్లు ఆల్ టైమ్ కనిష్టానికి నమోదవుతున్నాయి. ఈ సంస్థకు వాడుకదారుల వృద్ధి కూడా నెమ్మదించడం ప్రతికూలప్రభావాన్ని పడవేస్తోంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు కాలినడకన సాగిందని, నెలకు కేవలం 310 మిలియన్ యాక్టివ్ యూజర్లే ఉన్నారని తెలుస్తోంది. కొత్త అడ్వర్ టైజింగ్ ప్రొడక్ట్ రూపకల్పనపై మొదట్లో ఎక్కువగా దృష్టిసారించిన కంపెనీ, ఇప్పుడు ఒక యాడ్ ఫార్మాట్ నుంచి మరో యాడ్ కు త్వరగా బడ్జెట్లను మరల్చుతోందని చీఫ్ ఫైనాన్సియల్ అధికారి ఆంటోని నోటో పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం ట్విట్టర్ కు అడ్వర్ టైజింగ్ లో ఎక్కువ డిమాండ్ లేదని ఆయన చెప్పారు. 608 మిలియన్ డాలర్లుగా అంచనా వేసిన ట్విట్టర్ రెవెన్యూ ఈ త్రైమాసికంలో 595 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రెండో క్వార్టర్లో కూడా ప్రకటనల ఆదాయం పడిపోనుందని కంపెనీ ముందుగానే అంచనావేస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అడ్వర్ టైజింగ్ లకంటే కూడా ఆన్ లైన్ వీడియో బడ్జెట్లను పెంచుకుని, ఎక్కువగా అడ్వర్ టైజింగ్ డాలర్ రెవెన్యూలను పెంచుకోవాలని లక్ష్యంగా కంపెనీ నిర్ణయించింది.ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్ లు లైవ్ వీడియోల ప్రచారాలకు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి.