breathalyzer test
-
నల్లమల ఘాట్ రోడ్‌లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్
అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్ పెడుతున్నారు. పెద్దదోర్నాల: ► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్ రోడ్లను గుర్తించారు. ఘాట్ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్ స్పీడ్ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్ ఎనరైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు.. మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు.. మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్ గన్లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్ రోడ్డులో స్పీడ్ గన్లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్ రోడ్లలో స్పీడ్ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. - మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం -
బ్రీథలైజర్ టెస్టుకు సింగపూర్ ఓకే
సింగపూర్: కరోనా పాజిటివా? లేక నెగెటివా? అనేది కేవలం ఒక్క నిమిషంలో నిర్ధారించే బ్రీథలైజర్ టెస్టుకు సింగపూర్ ప్రభుత్వ అధికార యంత్రాంగం సోమవారం తాత్కాలిక అనుమతి మంజూరు చేసింది. దీన్ని బ్రెఫెన్స్ గో కోవిడ్–19 బ్రీత్ టెస్టు సిస్టమ్ అని పిలుస్తున్నారు. శ్వాసతో కరోనా ఫలితాన్ని తేల్చే ఈ పరీక్షను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్(ఎన్‌యూఎస్)కు చెందిన ముగ్గురు గ్రాడ్యుయేట్లు డాక్టర్ జియా జునాన్, డూ ఫాంగ్, వానే వీతోపాటు భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ వెంకటేశన్ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశారు. నలుగురు ఉమ్మడిగా బ్రీథోనిక్స్ అనే కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలోనే బ్రీథలైజర్ టెస్టును రూపొందించారు. సింగపూర్‌లో ఇలాంటి శ్వాస పరీక్షకు అనుమతి లభించడం ఇదే మొదటిసారి. సింగపూర్‌లో ప్రస్తుతం కరోనా నిర్ధారణ కోసం యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు(ఏఆర్టీ) చేస్తున్నారు. ఇకపై ఈ టెస్టుతోపాటు శ్వాస విశ్లేషణ పరీక్ష కూడా చేయనున్నట్లు బ్రీథోనిక్స్ వెల్లడించింది. విదేశాల నుంచి సింగపూర్‌కు వచ్చేవారికి బ్రీథలైజర్ టెస్టులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.. ఆర్టీసీ డ్రైవర్ల ఆందోళన
సాక్షి, మంచిర్యాల : మంచిర్యాల బస్ డిపో ఎదుట శుక్రవారం ఉదయం ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. అధికారులు పనిచేయని బ్రీత్ ఎనలైజర్‌తో తమకు పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా తమను విధులకు దూరం పెట్టి వేదింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు ఉదయం హైదరాబాద్ వెళ్లాల్సిన రాజధాని బస్సు డ్రైవర్ రాజుకు ఆర్టీసీ అధికారులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా.. మిషీన్ 53 పాయింట్లు చూపెట్టింది. మద్యం తాగే అలవాటు లేకపోయినా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో తను మద్యం తాగినట్టు రావడంతో రాజు అవాక్కయ్యారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు.. రాజుకు తమ వద్ద ఉన్న బ్రీత్ ఎనలైజర్‌తో టెస్ట్ నిర్వహించగా.. ఆ మెషీన్లో జీరో పాయింట్స్ కనిపించాయి. కాగా, రెండు రోజుల క్రితం కూడా మరో డ్రైవర్‌కు ఆర్టీసీ బ్రీత్ ఎనలైజర్‌తో టెస్ట్ నిర్వహించగా 274 పాయింట్లు చూపించింది. దీంతో ఆగ్రహానికి లోనైనా డ్రైవర్లు.. పనిచేయని ఆర్టీసీ బ్రీత్ ఎనలైజర్‌ను తొలగించి.. తమ పనులను సక్రమంగా చేసుకునేలా చూడాలని డిమాండ్ చేశారు. -
ఇక ప్రతి కారులో ‘బ్రెతలైజర్’
సాక్షి, న్యూఢిల్లీ : మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా వారి నేరాలు పునరావతం అవుతూనే ఉన్నాయి. వాటిని అరికట్టేందుక ఐరోపా కూటమి సరికొత్త సాంకేతిక చర్యకు పూనుకుంది. 2022 సంవత్సరం నుంచి తయారయ్యే అన్ని కార్లలో ‘బ్రెతలైజర్స్’ను విధిగా అమర్చాలని ఆదేశించే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని ఎప్పుడో రూపొందించినప్పటికీ ఐరోపా మండలి గత వారమే ఆమోదముద్ర వేసింది. 2024 నుంచి అన్ని కార్లలో, అంటే పాత కార్లలో కూడా ‘బ్రెతలైజర్స్’ను తప్పని సరి చేసింది. డ్రైవర్ ఇంజన్‌ను స్టార్ట్ చేసే ముందు తప్పనిసరిగా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. అప్పుడే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. సరిగ్గా ఊదక పోయినా ఇంజన్ స్ట్రార్ట్ కాదు. కారు స్టార్ట్ అయ్యాక మార్గమధ్యంలో మద్యం సేవించకుండా నివారించేందుకు మధ్య మధ్యలో కూడా బ్రెతలెజర్స్‌ను ఊదాల్సి ఉంటుంది. ఈ నిబంధనను మద్యం తాగి కారును నడిపిన కేసులో శిక్ష పడిన డ్రైవర్లకు మాత్రమే అమలు చేస్తామని బ్రిటన్ అధికారులు చెబుతున్నారు. సాంకేతికంగా అది సాధ్యమా? అన్ని కార్లలో బ్రెతలెజర్స్‌ను అమర్చినప్పుడు, కారు నడిపే డ్రైవర్‌కు అంతకుముందు శిక్ష పడిందా, లేదా అన్న విషయాన్ని బ్రెతలైజర్స్ అనుసంధాన వ్యవస్థ ఎలా తెల్సుకుంటుంది ? మద్యం తాగి కారు నడుపుతున్న డ్రైవర్ అప్పుడు ఏ కారు నడిపారో ఆ కారుకు మాత్రమే వర్తింప చేస్తారా? అద్దె డ్రైవర్లను పెట్టుకున్నప్పుడు మరి ఏం చేస్తారు? ఇంతకుముందు శిక్ష పడిన డ్రైవర్, తనకు బదులుగా ఇతరులతోని బ్రెతలెజర్ను ఊదిస్తే...అప్పుడు ఏమిటీ? ఇత్యాది ప్రశ్నలకు బ్రిటన్ అధికారుల వద్ద ప్రస్తుతానికి సమాధానం లేదు. రానున్న కాలంలో వీటికి పరిష్కారం కనుక్కుంటారట. -
తాగి తప్పించుకున్నా.. ఫేస్'బుక్కై' పోయింది!
ఓ అమ్మాయి మందు కొట్టి డ్రైవింగ్ చేసింది. బ్రీత్ అనలైజర్ పరీక్షలో అదృష్టవశాత్తూ తప్పించుకుంది. అంతటితో 'ఊపిరి' పీల్చుకుని మరచిపోకుండా తన ఘనతను ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇంకేముంది ప్రొహిబిషన్ అధికారులు ఈ అమ్మడిని మరోసారి పిలిపించారు. ఈ సారి అడ్డంగా దొరికిపోయింది. జైలుకెళ్లాల్సిన పరిస్థితి చేజేతులా తెచ్చుకుంది. అనవసరంగా ఫేస్'బుక్కై'పోయింది. అమెరికాలోని వెస్ట్ లాండ్కు చెందిన కొలీన్ కుడ్నీ కథ ఇది. వివరాలిలా ఉన్నాయి. 22 ఏళ్ల కొలీన్ రెండేళ్ల క్రితం మద్యం తాగి డ్రైవింగ్ చేసింది. అయితే మర్నాడు ఆమెకు ప్రొహిబిషన్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఒక రోజు గడిచిపోవడంతో ఆమె బ్రీత్ అనలైజర్ టెస్ట్‌లో లక్కీగా బయటపడింది. కొలీన్ ఈ విషయాన్ని అంతటితో మరచిపోకుండా ఆ విషయాన్ని తన ఫేస్బుక్లో పోస్ట్ చేసి సంతోషం పంచుకుంది. 'నేను నిన్న మందు కొట్టి డ్రైవ్ చేశా. ఈ రోజు ఉదయం టెస్ట్ చేయడంతో పాసయ్యా. థ్యాంక్ గాడ్' అని రాసింది. ఈ విషయం వెంటనే వెస్ట్ లాండ్ పోలీసులకు తెలియడం.. వారు ప్రొబెషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లడంతో కొలీన్కు కష్టాలు మొదలయ్యాయి. 'కొలీన్ చేతులా దొరికిపోయింది.. ఈ సారి పాస్ అవ్వమనండి చూస్తాం' అంటూ ప్రొబెషన్ ఆఫీస్ నుంచి ఆమెకు మళ్లీ కబురెట్టారు. కొలీన్కు ఈసారి యూరిన్ టెస్టు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మద్యం తాగిన 80 గంటల తర్వాత కూడా ఈ పరీక్షలో గుర్తించవచ్చు. ఇంకేముంది కొలీన్ సాక్ష్యాలతో సహా దొరికిపోయింది. ఈ కేసుకు త్వరలోనే ముగింపు పలకనున్నారు. ఏప్రిల్ 1న కోర్టులో హాజరపరచనున్నారు. ఆమెకు మూడు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.