Brewing implantation
-
Beer Companies: హడావుడిగా అనుమతి.. వెంటనే నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: బీర్ల తయారీ కంపెనీలకు, సర్కారుకు మధ్య వారధిగా ఉండి ఎలాంటి సమస్య రాకుండా చూడాల్సిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ప్రతిష్టకు పోయి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చారనే చర్చ జరుగుతోంది. బీర్ల తయారీ కోసం రాష్ట్రంలో అనుమతి పొందిన పాత కంపెనీలతో సమన్వయం చేసుకోకుండా.. కొత్త కంపెనీలకు అనుమతులిచ్చి, ఆ తర్వాత సదరు అనుమతులను నిలిపివేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారుల తీరుతో రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడే పరిస్థితి తలెత్తింది. అన్ని డిపోల్లో కలిపి కనీసం 15 రోజుల స్టాక్ ఉండాల్సి ఉండగా, కేవలం రెండున్నర రోజులకు సరిపడా మాత్రమే నిల్వ ఉండడం గమనార్హం. పాత బకాయిలే తలనొప్పి బీర్లు, మద్యం తయారీ కంపెనీలు బేవరేజెస్ కార్పొరేషన్‌కు మద్యం ఇచ్చిన తర్వాత వాటిని డిపోల ద్వారా రిటైలర్లకు అమ్మిన 45 రోజుల్లోగా సదరు తయారీ కంపెనీలకు బేసిక్ ప్రైస్, ఎక్సైజ్ డ్యూటీలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ నిధులు సరిగా చెల్లించకపోవడంతో బకాయిలు రూ.1,500 కోట్లకు చేరాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తయారీ కంపెనీలకు ఇవ్వాల్సిన నిధులను ప్రతి నెలా చెల్లిస్తోంది. కానీ పాత బకాయిలను మాత్రం ఇవ్వడం లేదు. దీంతో సదరు కంపెనీలు తమకు పాత బకాయిలు ఇప్పించాలని, లేదంటే బీర్లు సరఫరా చేయలేమని ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెంచారు. వేసవిలో సీజన్ కావడంతో బీర్లు తయారు చేసే బ్రెవరీలతో సమన్వయంతో వ్యవహరించి బీర్లను అందుబాటులోకి తేవాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు రూటు మార్చారు. పాత కంపెనీలను కాదని, గుట్టుచప్పుడు కాకుండా సోమ్ సహా ఐదు కొత్త బ్రెవరీలకు అనుమతినిచ్చారు. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో కొత్త బ్రెవరీలకు బ్రేక్ వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బేర్ మంటున్న బీర్ స్టాక్ ఎక్సైజ్ అధికారుల నిర్వాకంతో రాష్ట్రంలో బీర్లకు కొరత ఏర్పడేలా ఉంది. రాష్ట్రంలో యూబీ (2 యూనిట్లు), అన్హైజర్ బుష్ (ఏబీ–2 యూనిట్లు), కారŠల్స్‌బర్గ్, లీలాసన్స్ కంపెనీలు అనుమతులు పొంది బీర్లు తయారు చేస్తున్నాయి. రాష్ట్రంలో విక్రయించే బీర్లలో సింహభాగం యూబీ, ఏబీ కంపెనీలు తయారు చేసేవే. కాగా ఈ కంపెనీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పించడం లేదా సదరు కంపెనీలతో సమన్వయం చేసుకుని అవసరమైన మేరకు బీర్లను తయారు చేయించడం ఎక్సైజ్ ఉన్నతాధికారుల విధి. కానీ అలా చేయకుండా కొత్త బ్రెవరీలకు అనుమతినివ్వడం, మళ్లీ నిలిపివేయడంతో బీర్ల కొరత ఏర్పడింది. ప్రస్తుతం వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో రోజుకు 1.25 లక్షల కేసుల బీర్లు అవసరమవుతాయని అంచనా. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని డిపోల్లో కలిపి 3 లక్షల కేసులు మాత్రమే స్టాక్ ఉందని తెలుస్తోంది. కాగా కొత్త బ్రెవరీల పేరుతో అనుమతులిచి్చన ఐదు కంపెనీల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన సోమ్ బ్రెవరీస్ వుడ్ పెక్కర్, హంటర్‌తో పాటు మరో బ్రాండ్ తయారు చేస్తుందని, మిగిలినవి కర్జూరా బీర్లతో పాటు బిర్యానీ అనే బ్రాండ్ ఉత్పత్తి చేస్తాయని సమాచారం. కాగా కొత్తగా అనుమతినిచి్చన కంపెనీల్లో ఒక్కటి కూడా రాష్ట్రంలో ఎక్కువ మంది వినియోగించే బీర్లు తయారు చేసేవి కాకపోవడం గమనార్హం. -
భూమిపై జీవం.. చెరువులే మూలం
బోస్టన్: విశాల విశ్వం.. నక్షత్రాలు.. గ్రహాలు.. కోటానుకోట్ల జీవరాశులు. కంటికి కనిపించేవి కొన్నే.. కనిపించనివి అనంతం. విశ్వం ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియదు.. జీవరాశి పుట్టుక వివరాలు తెలియవు. వీటికి సంబంధించిన అన్ని విషయాలూ రహస్యాలే. ఈ రహస్యాలన్నింటిని ఛేదించేందుకు ఏళ్లుగా శాస్త్రవేత్తల పరిశోధనలు.. అయినా అంతంత మాత్రమే ఫలితాలు. తాజాగా జీవ రాశి పుట్టుకకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఓ అధ్యయనంలో వెలువడ్డాయి. భూమిపై జీవరాశి పుట్టుకకు చెరువులు ముఖ్యపాత్ర పోషించాయని అమెరికాలోకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(మిట్) నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలింది. పెద్ద పెద్ద సముద్రాల కంటే కూడా చెరువులే జీవరాశికి అనువైన వాతావరణాన్ని భూమిపై సృష్టించాయని తెలిపింది. అది కూడా 10 సెంటీమీటర్లకు అటూఇటుగా ఉండే చెరువులే జీవానికి ఊపిరి పోశాయని పేర్కొంది. చెరువులే ఎందుకు.. భూమిపై జీవం పుట్టుకకు అవసరమైన వాటిల్లో అధిక సాంద్రత గల నైట్రోజన్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎక్కువ మంది శాస్త్రవేత్తలు భావిస్తారు. నైట్రోజన్ ఆక్సైడ్లు సముద్రాలు, చెరువుల్లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో కలసి జీవం పుట్టుకకు బాటలు వేస్తుందని చెబుతారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మిట్కు చెందిన పరిధకులు సుక్రిత్ రంజన్ మాట్లాడుతూ..‘లోతైన సముద్రాల్లో ఉండే నైట్రోజన్ వల్లే జీవం ఉద్భవించి ఉంటుందని అనుకోవడం సరికాదు. ఎందుకంటే లోతైన సముద్రాల్లోని నైట్రోజన్.. వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు చాలా తక్కువ. అలాగే అతి నీలలోహిత కిరణాలు, సముద్రాల్లోని ఐరన్ ధాతువులు నైట్రోజన్ మిశ్రమాన్ని అధిక శాతంలో నాశనం చేసే అవకాశం ఉంది. అనంతరం మిగిలిన కొద్ది మొత్తంలోని నైట్రోజన్‌ను వాయువు రూపంలో తిరిగి వాతావరణంలోకి పంపించేస్తాయి. దీంతో సముద్రాల్లో నైట్రోజన్ జీవం పుట్టుకకు ఎంతమాత్రం దోహదపడే అవకాశం లేదు. మరోవైపు చెరువుల్లోని నైట్రోజన్ ఆక్సైడ్ల వల్లే భూమిపై జీవం ఆవిర్భవించే అవకాశాలు అత్యధికం. చెరువుల్లో నైట్రోజన్ ఆక్సైడ్ల రూపంలో నిక్షిప్తమైన నైట్రోజన్ మిశ్రమం వాతావరణంలోని ఇతర మిశ్రమాలతో ప్రతిచర్య జరిపే అవకాశాలు అధికంగా ఉంటాయి. అలాగే చెరువుల్లో మిశ్రమాలు కరిగే అవకాశాలు చాలా తక్కువ. మొత్తంగా చూస్తే.. శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లుగా జీవం పుట్టుకకు నైట్రోజన్ అవసరమై.. అదీ సముద్రాల్లోనిదే అయ్యిండాలంటే మాత్రం భూమిపై జీవం పుట్టుక అనేది దాదాపు అసాధ్యం. చెరువుల్లో ఉండే నైట్రోజన్‌తో మాత్రమే భూమిపై జీవం ఆవిర్భవించి ఉండేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి’అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
బెల్లం లేని అరిసెలు!
నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారంటూ అమ్మకాల నిషేధం కిలో, రెండు కిలోలు కూడా అమ్మకుండా కట్టడి పిండి వంటలు చేయలేక పోతున్నామని ప్రజల నిరాశ పరకాల : నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారంటూ తెల్లబెల్లం అమ్మకాలను నిషేధించడంతో సంక్రాంతి పండుగకు అరిసెలు చేసుకునే ఆనవాయితీకి బ్రేక్ పడుతోంది. ఏటా సంక్రాంతి సందర్భంగా అరిసెలు, సకినాలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈసారి బెల్లం అమ్మకాలను కట్టడి చేయడంతో ఎక్కువ మంది ఇండ్ల నుంచి అరిసెల పాకం వాసన రావడం లేదు! దీంతో అరిసెలు లేకుండానే సంక్రాంతి చేసుకోవాలా అ ని ప్రజలు మధనపడుతుండగా.. కిలో, రెండు కిలోలు కూడా అమ్మనివ్వకపోవడంపై వ్యాపారులు మండిపడుతున్నారు. నల్లబెల్లం స్థానంలో తెల్లబెల్లం పలు గ్రామాల్లో గుడుంబా తయారీకి నల్లబెల్లం ఉపయోగించేవారు. ఈ విషయాన్ని గుర్తించి ఎక్సైజ్ అధికారులు నల్లబెల్లాన్ని నిషేధించడంతో కొంతకాలం గుడుంబా తయారీ నిలిచిపోయింది. అయితే, కొద్దిరోజులకు గుడుంబా తయారీదారులు తెల్లబెల్లం ఉపయోగించడాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నాటుసారాను నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమయం నుంచి తెల్లబెల్లం అమ్మకాలను కూడా కట్టడి చేస్తోంది. ఈ నిర్ణయంతో గుడుంబా తయారీ ఏ మేరకు నిలిచిపోయిందో తెలియదు కానీ.. శుభకార్యాలు, వేడుకలతో పాటు పండుగల సమయంలో తీపి వంటకాలు చేసుకుందామనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది. ఇక కిలో, రెండు కిలోల బెల్లం నిల్వ ఉన్నా కేసులు పెడుతున్నారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కిరాణం వ్యాపారి తన మనువడు పుట్టినరోజు సందర్భంగా వంటల్లో ఉపయోగించేందుకు ఐదు కిలోల బెల్లం తీసుకొస్తుంటే ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటుండడంతో బెల్లం అమ్మాలన్నా.. కొన్నాలన్నా బెంబేలెత్తిపోయే పరిస్థితి పరకాలలో నెలకొంది.