Brian
-
బ్రెయిన్ స్ట్రోక్‌తో ఎంపీడీఓ మృతి
కల్వకుర్తి: చారకొండ మండల ఎంపీడీఓ జయసుధ(46) బ్రెయి న్ స్ట్రోక్‌కు గురికావడంతో నాలు గు రోజులుగా చికిత్స పొందుతూ.. మృతిచెందారు. డిసెంబర్ 28 రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెల్దండ సమీపంలోని యన్నమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. వారి మృతదేహాన్ని కల్వకుర్తిలోని వారి స్వగృహానికి తరలించారు. చారకొండ మండల ఎంపీడీఓగా ఆరేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆమెకు కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. ఆమె అకాల మరణంతో బంధువులు, స్నేహితులు మండలంలోని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్వగృహంలో వారి పార్థీవ దేహానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, మండలంలోని ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఆయా శాఖల అధికారులు, నాయ కులు పార్థివ దేహానికి నివాళి అర్పించారు. -
కరోనాతో మరో ముప్పు
లండన్ : కరోనా మహమ్మారిని నిలువరించేందుకు ప్రపంచ దేశాలు అష్టకష్టాలు పడుతున్నసమయంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. కోవిడ్-19 రోగుల్లో పలు రకా మెదడు, నాడీ సంబంధిత సమస్యలను గుర్తించామని లండన్ పరిశోధకులు తాజాగా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సమస్యలను గుర్తించినట్టు పరిశోధకులు తెలిపారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయం సహా, ఇతర శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం కరోనా రోగుల్లో స్ట్రోక్స్, మతిమరుపు ఇతర నాడీ సంబంధిత,మానసిక సమస్యలను కరోనాకు భారీగా ప్రభావితమైన దేశాలు నివేదించాయి. ది లాన్సెట్ న్యూరాలజీలో ప్రచురించిన ఈ అధ్యయనాల ప్రకారం గందరగోళం, స్ట్రోక్, మెదడు వాపు, వెన్నుపాము, నరాల వ్యాధి వంటి ఇతర సమస్యలు కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. దాదాపు వెయ్యి మంది రోగులు ఇలాంటి సమస్యలకు గురైనారన్నారు. ఇవి అరుదుగా కనిపించే సమస్య లైనప్పటికీ, బాధితుల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుందని లివర్‌పూల్ విశ్వవిద్యాలయం అధ్యయనవేత్త సుజన్నా లాంత్ అన్నారు. ప్రధానంగా బాధితుల్లో వినాశకర, తీవ్ర పరిణామాలకు దారితీసేఎన్‌సెఫలిటిస్ (మెదడులో ఇన్ఫెక్షన్ లేదా వాపు) ముప్పు ఒకటనీ ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా వైద్యులు గుర్తించడం చాలా ముఖ్యమని మరో శాస్త్రవేత్త అవా ఈస్టన్ చెప్పారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటువంటి సమస్యలుండగా, దీనిపై సమగ్ర వివరాలు తమకు అందలేదని పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి అవగాహన రావాలంటే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డేటాను సమీక్షించాల్సి ఉందన్నారు. మరోవైపు ఇటీవల ‘బ్రెయిన్’ పత్రికలో ప్రచురించిన పరిశోధన ప్రకారం అత్యంత అరుదైన, మెదడులో మంట పుట్టించే ఏడీఈఎం అనే ఇన్ఫెక్షన్ కరోనా వచ్చిన వారిలో పెరుగుతోంది. కరోనా విస్తరిస్తున్న క్రమంలో ఈ తరహా బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా మెదడులో మంటతో పాటు, డెలిరియం, బ్రెయన్ స్ట్రోక్ వంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశముందని పరిశోధనలో తేలినట్టు నివేదించింది. -
ఆమె తెలివి... ముగ్గురికి ప్రాణం పోసింది
విజయం మామూలప్పుడు ఎవరైనా తెలివితేటలు చూపిస్తారు. కానీ ప్రమాదంలో పడినప్పుడు కంగారు పడకుండా, తెలివిగా ఆలోచించి బయట పడటంలోనే అసలు తెలివితేటలు కనిపిస్తాయి. ఈ ఫొటోలో ఉన్న చిట్టితల్లి అలా తెలివిగా ఆలోచించి ముగ్గురి ప్రాణాలను కాపాడింది. పదేళ్ల ఈ చిన్నారి పేరు బ్రియానా వ్యాన్స. తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో నివసిస్తోంది. ఇటీవల అక్కడ పెద్ద తుఫాను వచ్చింది. భయంకరంగా వచ్చిన ఈదురు గాలులకు చాలా ఇళ్లు కుప్పకూలాయి. చెట్లు నేల రాలాయి. బ్రియాన్ ఇంటిముందు ఉన్న పెద్ద చెట్టు కూడా కూలిపోయింది. అది సరిగ్గా బ్రియాన్ తండ్రి గ్రెగరీ మీద కూలడంతో అతడు దాని కింద ఇరుక్కుపోయాడు. ఓ పక్క విపరీతమైన గాలి. మరో పక్క వరద నీరు. పైగా ఒళ్లంతా గాయాలు. దాంతో బయటకు రాలేకపోయాడు. కాసేపుంటే చనిపోయేవాడే. అప్పుడే బ్రియాన్ తండ్రిని చూసింది. అతడి పరిస్థితి అర్థమైంది. తన చేతిలో ఉన్న సెల్ఫోన్లో ఫేస్బుక్ ఓపెన్ చేసి... ‘మా నాన్న చనిపోయేలా ఉన్నాడు, కాపాడండి’ అంటూ పోస్ట్ చేసి, తన అడ్రస్ పెట్టింది. కొద్ది క్షణాల్లోనే దాన్ని చాలామంది చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు అంబులెన్సును తీసుకుని వచ్చి గ్రెగరీతో పాటు, ఆ చెట్టు కింద ఇరుక్కున్న మరో ముగ్గురి ప్రాణాలను కూడా కాపాడారు. రియల్ హీరో అంటూ బ్రియాన్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. ఈ దెబ్బతో బ్రియాన్ వర్జీనియాలో పెద్ద సెలెబ్రిటీ అయిపోయింది! -
బ్రెయిన్లో బల్బు వెలిగితే!!
కరెంట్ బల్బుల్లో ఫిలమెంట్ పోతే ఇక అవి వెలగవు. దీంతో వెంటనే వాటిని తీసేసి, కొత్త బల్బులను వాడుతుంటారు. మరి తీసేసిన బల్బులను ఏం చేస్తారు? బ్రెయిన్‌కు కాస్త పని పెడితే వెలగని బల్బులను చెత్తబుట్టకు చేర్చకుండా ఇంటి అలంకరణలో ఇలా ఉపయోగించవచ్చు. మన ఇంటి నుంచి చెత్తను ఎక్కువ చేర్చి పర్యావరణానికి హాని కలగించకుండానూ చేయవచ్చు. వెలగని బల్బులను తీసుకోండి. అత్యంత జాగ్రత్తగా కటర్‌ని ఉపయోగించి పైన ఉండే అల్యూమినియమ్ మూత దగ్గర రంధ్రం చేయండి. రంగు రంగుల పేపర్లు చుట్టిన ఒక సన్నని వైర్‌ను లోపలికి సగం వరకు పంపించి, పైన మైనంతోనో, లేదా మరో బిరడాతోనో బిగించండి. ఆ బల్బులను ఇలా గోడకు వేలాడదీయండి. బల్బు పైన అల్యూమినియం మూత, లోపలి ఫిలమెంట్ తీసేసి, చుట్టూరా రంగు రంగుల గాజు ముక్కలు అతికించండి. లోపల మైనం నింపి, ఒత్తి వేసి వెలిగించండి. దీపావళికే కాదు ఇతర రోజుల్లోనూ చూడచక్కని షోపీస్‌లా ఆకట్టుకుంటుంది. బల్బులోపల సన్నని ఇసుక కొద్దిగా వేసి, పైన కృత్రిమమైన గడ్డిరంగు మొక్కలు అమర్చితే మరొక షోపీస్ తయారవుతుంది. బల్బుల్లో ఫిలమెంట్ తీసేసి, నూనె పోసి ఒత్తిని వేసి వెలిగిస్తే లాంతరులా మారిపోతుంది. బల్బులో సగానికి నీరు నింపి, చిన్న మొక్క వేస్తే చాలు చూడముచ్చటైన ఇండోర్ ప్లాంట్ రెడీ! బల్బుకు రంగు వేసి, పక్షి రెక్కలను అతికించి, కళ్లు, ముక్కు పెయింట్ చేస్తే పక్షి ఆకారం ముందుంటుంది. పిల్లలనూ అమితంగా ఆకట్టుకుంటుంది. నోట్: బల్బులు గ్లాస్‌తో తయారవుతాయి. పగలడం, కోసుకోవడం..వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని వీటి తయారీలో చేతులకు గ్లౌజ్‌లు వేసుకోవడం, కటింగ్‌కు కటర్, గాజు పెంకులు తీసేయడానికి స్పాంజ్... వంటివి అందుబాటులో ఉంచుకోవడం మర్చిపోవద్దు.