Brings
-
తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..
తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్‌గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్‌గా రికార్డ్‌కెక్కారు. అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. సచిన్ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది. ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక.. -
గూగుల్ పుట్టిన రోజు కానుకలు
ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన 18వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఇంటర్నెట్ లవర్స్ కు కొన్ని ఆఫర్లను ప్రకటించింది. లో ఇంటర్నెట్ స్పీడ్ సమస్యకు పరిష్కారంగా బఫర్ ఫ్రీ అనుభవం కోసం యాక్స్ లేటర్ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. గూగుల్ స్టేషన్ అనే కొత్త వై ఫై స్టేషన్, 'యూ ట్యూబ్ గో' అనే వీడియో యాప్ , క్రోమ్ వెబ్ బ్రౌజర్ కోసం ఒక ఆఫ్ లైన్ ఫీచర్ , గూగుల్ ప్లే కోసం ఫాస్టర్ లోడింగ్ ఫీచర్‌ను ప్రకటించింది. దీని ద్వారా ఈ సంవత్సరాంతానికి ఇండియాలో యూజర్లకు బఫర్ ఫ్రీ అనుభవాన్ని అందించనున్నట్టు గూగుల్ ఇండియా రాజన్ ఆనందర్ మంగళవారం ప్రకటించారు. తమ వినూత్న ఉత్పత్తులు, మరియు వేదికల ద్వారా మూడు కీలక ప్రాంతాల్లో బిలియన్ వినియోగదారులకు మంచి ఆన్లైన్ అనుభవాన్ని అందించడానికి పనిచేస్తున్నట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ సీజర్ సేన్ గుప్తా చెప్పారు. భారతీయ రైల్వే స్టేషన్లలో వై-ఫై అందించడానికి గాను రైల్వేల భాగస్వామ్యంతో రైల్ టెల్ ను ఆవిష్కరించిన గూగుల్.. గూగుల్ స్టేషన్ అనే కొత్త వైపై స్టేషన్ ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్టు సేన్ గుప్తా తెలిపారు. మాల్స్, కెఫే, రవాణా స్టేషన్లలో కూడా లో-బ్యాండ్‌విడ్త్ కనెక్షన్ వినియోగదారులు ఈజీగా వై ఫై ని అందుకోవచ్చని చెప్పారు. దీని కోసం సిస్టమ్ ఇంటిగ్రేటర్స్ , ఇతర భాగస్వాములతో కలిస పని చేయనున్నట్టు చెప్పారు. అలాగే ఇంగ్లీష్ తో పాటు రాబోయే సంవత్సరాల్లో ఇతర ప్రాంతీయ భాషలపై కేంద్రీకరిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే తన కొత్త మెసెంజర్ యాప్ అల్లో గూగుల్ అసిస్టెంట్ లో హిందీని చేర్చనున్నట్టు వెల్లడించింది. ఇంటర్నెట్ యూజర్లలో హిందీ సెర్చ్ 50 శాతం పెరిగిందని గూగుల్ వివరించింది. ఇంటర్నెట్ వినియోగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారతదేశం ఒకటని వైస్ ప్రెసిడెంట్ రాజన్ ఆనందన్ చెప్పారు యూజర్ బేస్, స్మార్ట్‌ఫోన్ స్వీకరణ అభివృద్ధి చెందుతుందున్నారు. ఈ నేపథ్యంలోనే 2020 నాటికి 350 మిలియన్ల నుంచి 650 మిలియన్లకు పెరుగుతారని చెప్పారు. 2016 లో స్మార్ట్‌ఫోన్ బేస్ 300 మిలియన్ల నుంచి 500 మిలియన్లకు పెరుగుతుందని భరోసా ఇచ్చారు. -
తడిచి మురిసిన బెంగళూరు
బెంగళూరు: కూల్ సిటీ బెంగళూరు తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకుంది. 148 సంవత్సరాల అత్యధిక ఉష్ణోగ్రత నమోదుతో అతలాకుతలమైన నగరం సోమవారం సాయంత్రం కురిసిన వర్షాలతో తడిచి ముద్దయింది. ఉరుములు, మెరుపులతో నగరంలో అనేక ప్రాంతాల్లో కురిసిన వర్షం నగరవాసులను ఆనందడోలికల్లో ఓలలాడించింది. మండించే ఎండలనుంచి ఉపశమనంగా వర్షాలు పలకరించి సేదతీర్చడంతో జనం రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, రాత్రి 9 గంటలకు వరకు 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో సోమవారం నమోదైన 37.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతతో బెంబేలెత్తిన జనం ఎండవేడిమి నుంచి సేదతీరారు. ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షం కారణంగా వాతావరణంలో తేమ శాతం 86 శాతం పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేశారు. కెంపారా, పాత విమానాశ్రయం రోడ్ లో భారీ వర్షం కురిసింది. వాల్మీకి నగర్ లో 10 చెట్లు నేలకూలాయి. మైసూర్ రోడ్, చామరాజ్ పేట్, ఓకలిపురం, సంపంగి రామ్ నగర్, విక్టోరియా రోడ్ తదితర ప్రాంతాలతోపాటూ ఔటర్ రింగ్ రోడ్ ఏరియాలో భారీ వర్షం నమోదైంది. ఈ వర్షం కారణంగా అక్కడక్కడా ట్రాఫిక్ జామ్, విద్యుత్ స్థంభాలు విరిగి పడి విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. అయినా గతంలో లాగా వర్షం తమని తప్పకుండా ఆదుకుంటుందని ఆశించామంటూ నగర వాసులు సంబరాలు చేసుకున్నారు. -
ఈ 'నగ్న రెస్టారెంట్'లో బట్టలిప్పి భోజనం చేస్తారు!
లండన్: భోజన ప్రియులకోసం లండన్ లోని ఓ హోటల్ కొత్త కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. విభిన్నరుచులను చవిచూడాలనుకునే వారికోసం కొత్త పోకడకు తెరతీసింది. ఆహార ప్రియులను అమితంగా ఆకట్టుకునేందుకు ప్రత్యేక టాప్ అప్ లతో ఆహ్వానం పలుకుతోంది. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' పేరిట అన్ని ప్రత్యేకతలు కలిగిన థీమ్డ్ రెస్టారెంట్ ప్రారంభానికి స్థానిక ఔల్ కేఫ్.. శ్రీకారం చుట్టింది. లండన్ ప్రజలకు మరింత చేరువవ్వాలన్న ఉద్దేశంతో ఔల్ కేఫ్.. కొత్త డైనింగ్ అనుభవాలను అందించేందుకు 'నేకెడ్ రెస్టారెంట్' (నగ్న రెస్టారెంట్)ను ప్రారంభిస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటి వరకూ ఎక్కడా లేని అదనపు సౌకర్యాలను వినియోగదారులకు అందించేందుకు ఈ హోటల్ ముందుకొచ్చింది. ఇంతకుముందు కడిల్ కేఫ్ లో కాఫీ, స్నాక్స్, టీతోపాటు కౌగిలింతల సౌకర్యాన్ని కూడా అందుకున్న లండన్ ప్రజలకు, ఇప్పుడు ఔల్ కేఫ్ బర్త్ డే డ్రెస్ (నగ్నంగా) తో భుజించే ఆఫర్‌ను తెరపైకి తెచ్చింది. నగరంలోని భూగర్భ రైల్వే నెట్వర్క్ లండన్ ట్యూబ్.. కూడా ప్రస్తుతం పాప్ అప్ రెస్టారెంట్ గా మారిపోయింది. బ్రిటన్ రాజధానిలో భోజన ప్రియులకు ప్రత్యేక అనుభూతులను అందించేందుకు విభిన్నంగా ఆలోచించిన ఈ సంస్థ.. దుస్తులు తొలగించి మరీ (నగ్నంగా) భోజనాలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. విడిచిన దుస్తులు, ఇతర ఖరీదైన వస్తువులు భద్రపరచుకొనేందుకు హోటల్ ప్రత్యేక లాకర్ల వసతిని కల్పిస్తుందట. భోజనానికి దుస్తులు విప్పి కూర్చోవాలా, ఉంచుకొని కూర్చోవాలా అన్న ఎంపికను మాత్రం వినియోగదారుల ఇష్టానికే వదిలేసింది. గోప్యతకు వీలుగా రెస్టారెంట్లో బ్యాంబూ పార్టిషన్లతోపాటు ప్రత్యేక స్థలాన్ని కేటాయించిందట. ఇక్కడి సభ్యులు, సిబ్బంది కూడా కురుచ దుస్తులు ధరించి ఈ రెస్టారెంట్‌కు వచ్చేసారి ప్రోత్సహిస్తారని తెలుస్తోంది. బున్యాది పేరుతో ఈ కొత్త రకం రెస్టారెంట్ సెంట్రల్ లండన్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక్కడ లభించే ప్రత్యేక సౌకర్యాలు, డిన్నర్లు, వంటి అనుభవాలను రుచిచూసేందుకు ముందుగా బున్యాది డాట్ కామ్ (thebunyadi.com) లో రిజిస్టర్ చేసుకోవచ్చట. ఇప్పటికే 4000 మందికి పైగా ప్రజలు ఈ కొత్త భోజనశాలను పరీక్షించేందుకు సైన్ అప్ చేశారట. దుస్తుల సంకెళ్ళనుండి విముక్తులను చేయడం, ఆధునిక జీవితంలో సరికొత్త అనుభవాలను చవి చూసేందుకు వీలుగా ఈ రెస్టారెంట్ ఉంటుందట. ఇక్కడ స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు వంటివి ఉపయోగించే వీలు ఉండదట. ఎక్కువ కాంతి లేకుండా డిమ్ లైట్ (క్యాండిల్ లైట్) లోనే డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయని నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాదు పూర్వకాలపు పద్ధతిలో వంటకాలను కట్టెల పొయ్యిపై వండటం, మట్టి పాత్రలతో వడ్డించడం వంటివి కూడ ఇక్కడి సౌకర్యాల్లో భాగమే. ఈ రెస్టారెంట్లో 'నేకెడ్'' మాత్రమే కాదు 'నాన్ నేకెడ్' సెక్షన్ కూడ వేరుగా ఉంటుందట.