British Airways plane
-
గాలుల ధాటికి ఊగిపోయిన విమానం
బ్రిటీష్ ఎయిర్వేస్కు చెందిన జెట్ విమానం గాలి ధాటికి విలవిల్లాడింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం బీఏ 492 ఇబ్బందుల్లో పడింది. 180మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం గాలి తీవ్రతకు అటూ ఇటూ ఊగిసలాడి పోయింది. అన్ని వాతావరణ పరిస్థితులకు తగినట్టు పైలట్లు శిక్షణ పొందినప్పటికీ, గాలుల ధాటికి భయపడిన పైలెట్ వెంటనే అప్రమత్తమై అధికారులను సంప్రదించారు. వారి ఆదేశాల మేరకు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని స్పెయిన్‌లోని మాలికి దారి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్లో హల్ చల్ చేస్తోంది. జిబ్రాల్టర్‌లో విమానాశ్రయం ల్యాండ్ అవుతుండగగా సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనిపై బ్రిటీష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. British Airways flight #BA492 flight from London Heathrow has diverted to Malaga due to strong winds at Gibraltar Airport. (C📹@RockRadio)pic.twitter.com/cywE2OpA1N — Flight Alerts (@FlightAlerts_) February 25, 2019 -
విమానం కిటికీలోంచి తీసిన షాకింగ్ వీడియో
విమానంలో విహరిస్తూ విండోలోంచి బయటకు వీక్షిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. సబ్రీనియా ఫవాజ్ తన భర్తతో కలిసి బ్రిటీష్ ఎయిర్ వేస్ కు చెందిన బీఏ108 విమానంలో దుబాయి నుంచి లండన్ బయలుదేరారు. విండోలోంచి బయటకు చూస్తున్న తనకు ఒక్కసారిగా యద్ధాలకు ఉపయోగించే జెట్ విమానం, అది కూడా అతి సమీపంలోంచి చూసే సరికి గుండె గుభేలుమందని ఫవాజ్ తెలిపారు. అయితే విమానం కంట్రోల్ రూంతో సంబంధాలు తెగిపోయి హంగేరియా గగనతలంలోకి ప్రవేశించింది. అనుమతిలేకుండా తమ గగన తలంలోకి ప్రవేశించిన విమానానికి ముందుగా హైఅలర్ట్ జారీ చేసి రెండు జెట్ విమానాలను(యుద్ధవిమానాలు) హంగేరియా వైమానికదళం పంపింది. రెండు జెట్ ప్లేన్లను విమానానికి దగ్గరగా పంపింది. దీనిగురించి కనీసం సమాచారం కూడా తెలియని ప్రయాణికులు వాటిని అంత దగ్గరగా చూసి అవి విమానాన్ని పేల్చేస్తాయేమో అని భయబ్రాంతులకు గురయ్యారు. 'ఎదో తప్పిదం జరిగింది. బయటకూడా అంతా తేడాగా కనిపిస్తుంది. ఈ హఠాత్పరిణామాన్ని చూసి ఒక్కసారిగా నా గొంతు ఎండిపోయింది. వెంటనే విమాన సిబ్బందిని కలిసి జెట్ విమానాలగురించి ఆరా తీసా' అని ఫవాజ్ తెలిపారు. కంగారుపడాల్సిన పని లేదని ఎప్పుడైనా కంట్రోల్ రూంతో కమ్యునికేషన్ కట్ అయితే ఇలా జరుగుతుందిని సిబ్బంది ఆమెకు దైర్యం చెప్పారు. కొంత ఆలస్యమైనా క్షేమంగా లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి చేరుకోవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. విండో నుంచి జెట్ విమానాన్ని తీసిన వీడియోను ఫవాజ్ యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఆ వీడియోలో బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానానికి అతి సమీపంగా జెట్ విమానం వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. -
విమానంలో మంటలు.. తప్పిన భారీ ప్రాణ నష్టం
-
విమానంలో మంటలు.. తప్పిన భారీ ప్రాణ నష్టం
- లాస్ వెగాస్ మెక్ కారెన్ విమానాశ్రయంలో ఘటన - ప్రమాద సమయంలో విమానంలో 172 మంది టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెరేగిన సంఘటన అమెరికాలోని లాస్ వెగాస్ మెక్ కారెన్ విమానాశ్రయంలో బుధవారం ఉదయం (భారత కాలమానం ప్రకారం) జరిగింది. పెనుముప్పు తప్పినట్లుగా భావిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన బోయింగ్ 777 విమానం లాస్ వెగాస్ నుంచి లండన్ వెళ్లాల్సిఉంది. ఇంధనం నింపుకొన్న అనంతరం టేక్ ఆఫ్ అయ్యేందుకు రన్ వే పైకి వచ్చింది. అంతలోనే విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో విమానంలో 159 మంది ప్రయాణికులతోపాటు 13 మంది సిబ్బంది కూడా ఉన్నారు. లోపలంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ప్రయాణికులు ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్టు సిబ్బంది.. పరుగున విమానం వద్దకు చేరుకుని అత్యవసర కిటీకీలను బద్దలుకొట్టి ప్రయాణికులను కిందికి దించారు. మంటలు చెలరేగడం రెండు నిమిషాలు ఆలస్యమయ్యేదుంటే విమానం వేగానికి భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ఇద్దరు ప్రయాణికులు మాత్రం గాయపడ్డారని, మిగతావారిని సురక్షితంగా కాపాడగలిగామని అత్యవసర సిబ్బంది చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. -
విమానంలో నుంచి పడి మృతి
లండన్: విమానం గాలిలో ఎగురుతుండగా ఓ వ్యక్తి దాని నుంచి కింద పడి మరణించాడు. మరో వ్యక్తి ఆస్పత్రిపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. విమానం నుంచి కింద పడటమేంటి? అనుకుంటున్నారా? వారు దొంగచాటుగా విమానం కింద దాక్కొని ప్రయాణించారు మరి! వివరాల్లోకెళితే.. బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన బోయింగ్ విమానం గురువారం ఉదయం దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ నుంచి లండన్‌కు బయలుదేరింది. మొత్తం 13 వేల కి.మీ. దూరం. 11:20 గంటల ప్రయాణం. విమానం లోపల అయితే సురక్షితం. కానీ విమానానికి కరుచుకుని దాని కింద ల్యాండింగ్ గేర్ వద్ద ఉండే స్థలంలో ప్రయాణం అంటే చావును కొనితెచ్చుకోవడమే. ఒక్కోసారి విపరీతమైన వేడి. మరోసారి మైనస్ 50 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు. పది కి.మీ. ఎత్తుకు వెళితే ఆక్సిజన్ కూడా అందదు. అయినా.. ఇద్దరు వ్యక్తులు అక్కడ దాక్కుని దొంగచాటుగా ప్రయాణించారు. కానీ.. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు విమానం రిచ్మండ్ మీదుగా ఎగురుతుండగా ఓ వ్యక్తి కిందపడ్డాడు. రిచ్మండ్లోని ఓ దుకాణం పైకప్పుపై పడి చనిపోయాడు. ల్యాండింగ్ గేర్ వద్దే కరుచుకుని ఉండిపోయిన 30 ఏళ్లలోపున్న మరో యువకుడిని ప్రాణాపాయ స్థితిలో విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు. వీరు జోహెన్నెస్‌బర్గ్ నుంచే దొంగచాటుగా వచ్చారని, ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.