Brown rice section
-
బ్లాక్ వర్సెస్ బ్రౌన్ రైస్: రెండింటిలో ఏదీ బెటర్ అంటే..?
మార్కెట్లో ఇప్పుడూ పోషక విలువలు కలిగిన రకరకాల రైస్‌లు వస్తున్నాయి. ఆఫ్ బాయిల్డ్ రైస్, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, బ్లాక్ రైస్ వంటివి ఎన్నో వస్తున్నాయి. వాటిల్లో ఇటీవల ఎక్కువమంది బ్రౌన్ రౌస్, బ్లాక్ రైస్‌లు విరివిగా వినియోగిస్తున్నారు. రెండింటిలోనూ అధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఈ రెండు చాలా మంచివి కూడా. అయితే వీటిలో ఏదీ మనకు బెటర్ అనే విషయానికి వస్తే.. పోషకాల పరంగా.. బ్రౌన్ రైస్ తృణధాన్యంగా బాగా ప్రసిద్ధి చెందింది. దాని బయట ఉండే ఊక పొర థయోమిన్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. దీనిలో ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ వద్దకు వచ్చేటప్పటికీ దీన్ని నిషిద్ధ బియ్యంగా పిలుస్తారు. దీనిలోని ఆంథోసైనిన్ కారణంగా డీప్ కలర్లో ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తుంది. దీనిలో కూడా చెప్పుకోదగ్గ మొత్తంలో ఐరన్, జింక్‌లు ఉన్నాయి. అలాగే పోషక సాంద్రతను మెరుగుపరుస్తుంది. ఫైబర్ కంటెంట్.. రెండూ ఫైబర్‌కి మూల వనరులు. పోలిస్తే మాత్రం బ్లాక్‌రైస్‌లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటే, బ్రౌన్ రైస్‌లో 4.5 గ్రాముల ఫైబర్‌తో ముందంజలో ఉంటుంది. ఈ లక్షణం కారణంగానే బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా బరువును అందుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక బ్లాక్ రైస్‌లో ఫైబర తక్కవుగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది, స్థిరమైన శక్తిని విడుదల చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ పవర్ బ్రౌన్ రైస్‌లో ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికే దోహదం చేయగా, నల్ల బియ్యం వర్ణద్రవ్యానికి కారణమైన ఆంథోసైనిన్లు ఆక్సీకరణ, ఒత్తిడి, మంట వంటి వాటి నుంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఖనిజ కంటెంట్ బ్రౌన్ రైస్‌లో ఉండే మెగ్నీషియం, ఫాస్పర్స్లు ఎముకల ఆరోగ్యం కండరాల పనితీరు, శక్తిమంతమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల రక్షణకు మూలమైన మాంగనీస్ కూడా తగు మోతాదులో ఉంటుంది. ఇక బ్లాక రైస్‌లో ఇనుము, జింక్ కంటెంట్లు రోగ నిరోధక పనితీరుని మెరుగుపర్చడమే గాక శరీరం మొత్తం సవ్యంగా ఆక్సిజన్ రవాణా అయ్యేలా చేస్తుంది. కార్డియోమోటబాలిక్ ఆరోగ్యం.. ఈ రెండూ కార్డియోమెటబాలిక్ శ్రేయస్సుకు దోహదం చేసేవే. బ్రౌన్రైస్లోని అధిక ఫైబర్ కొలస్ట్రాల్ నియంత్రించడంలో ఉపకరించగా, బ్లాక్‌రైస్‌లో ఉండే ఆంథోసైనిన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి హృదయ సంబంధ వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది. నిజానికి ఈ రెండింటిలో ఏదీ బెస్ట్ అని నిర్ణయించడం కష్టం. రెండు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఏది ఎంచుకోవాలన్నది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వైద్యుల సలహ మేరకు ఎంచుకుంటే మంచిది. ముఖ్యంగా ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే బ్లాక్ రైస్ ఎంచుకోవడం మంచిది. అలా కాదు రుచితో కూడిన తేలికగా ఉండే ఆహారం కావాలనుకుంటే బ్రౌన్ రైస్ మేలు. (చదవండి: షుగర్‌ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?) -
కొండబారిడి దంపుడు బియ్యానికి గుర్తింపు
కురుపాం: కురుపాం మండలానికి మారుమూలన ఉన్న కొండబారిడి గిరిజన మహిళల శ్రమకు ఫలితం దక్కేరోజు వచ్చింది. వ్యాపారం మరింత వృద్ధిచేసుకునే అవకాశం కలిగింది. గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు దంపుడు బియ్యాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. గ్రామంలో సేంద్రియ పద్ధతిలో పండించిన ధాన్యాన్ని రోళ్లలో దంచి బియ్యంగా మలస్తున్నారు. కిలో ప్యాకెట్ల రూపంలో ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నారు. వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్న మహిళల విజయగాథపై ఈ నెల 24న “దంపుడు బియ్యానికి కేరాఫ్ కొండబారిడి’ శీర్షికన “సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై పలువురు ప్రముఖులు స్పందించారు. మహిళల శ్రమను, కొత్త ఆలోచనను ప్రశంసించారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈనెల 26న తన ట్విట్టర్ ఖాతాలో “పార్వతీపురం మన్యం జిల్లాలోని కొండబారిడి మహిళలు దంపుడు బియ్యంతో వినూత్న వ్యాపారాన్ని మొదలు పెట్టారు. సభ్యులంతా కలిసి రోళ్లలో దంచిన బియ్యాన్ని విక్రయిస్తూ లాభం పొందుతున్నారు. గిరిజన మహిళలు ఒక ఉపాధి మార్గాన్ని సృష్టించుకుని మైదాన ప్రాంత ప్రజలకు సరఫరా చేయడం ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. దీనికి స్పందించిన గిరిజన సహకార సంస్థ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఉద్యోగులను కొండబారిడి గ్రామానికి గురువారం పంపించారు. గిరిజన మహిళలకు గిట్టుబాటు ధర చెల్లించి దంపుడు బియ్యాన్ని కొనుగోలు చేసి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా కొంత నగదును మహిళలకు చెల్లించినట్టు జీసీసీ అధికారులు తెలిపారు. జీసీసీ ఆధ్వర్యంలో కొండబారిడి దంపుడు బియ్యాన్ని మార్కెటింగ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: దంపుడు బియ్యానికి c/o కొండబారిడి) -
దంపుడు బియ్యానికి c/o కొండబారిడి
దంపుడు బియ్యంలో పోషకాలు అధికం. ఆరోగ్యానికి మేలు. అందుకే మార్కెట్లో గిరాకీ ఉంది. నాణ్యమైన దంపుడు బియ్యం వినియోగించేందుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దీనినే ఓ మారుమూల గిరిజన గ్రామ మహిళలు ఆదాయవనరుగా మలచుకున్నారు. కొండ జక్కరతో సేంద్రియ పద్ధతిలో పండించే ధాన్యాన్ని ‘జట్టు’గా రోకళ్లతో దంచి బియ్యంగా మార్చుతున్నారు. కిలోల చొప్పున ప్యాక్‌చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. గ్రామాన్ని దంపుడు బియ్యానికి కేరాఫ్‌గా మార్చిన కొండబారిడి గిరిజన గ్రామ మహిళల విజయగాథకు ‘సాక్షి’ అక్షర రూపం. కురుపాం(పార్వతిపురం మాన్యం): కొండబారిడి.. కురుపాం మండలానికి మారుమూలన ఉన్న చిన్న గిరిజన గ్రామం. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. సేంద్రియ పద్ధతిలోనే పంటలు సాగుచేస్తున్నారు. వరిని సైతం అదే దారిలో పండిస్తున్నారు. ధాన్యాన్ని మరపట్టించాలంటే కొండపైనుంచి కిందకు దించాలి. వ్యయప్రయాసలకోర్చాలి. అందుకే.. ఏ ఇంటిలో చూసినా ఏ రోజు తిండిగింజలను ఆ రోజు రోకళ్లతో దంచి బియ్యంగా మార్చడం మహిళల దినచర్య. మరోవైపు దంపుడు బియ్యంతో ఆరోగ్యం సిద్ధిస్తోంది. వీటికి మార్కెట్లో గిరాకీ ఉంది. దీనిని కొందరు మహిళలు గుర్తించారు. ఒక అడుగు ముందుకు వేశారు. ‘జట్టు’ సంస్థ సాయంతో 2019లో సత్యగాంధీ దంపుడు బియ్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. దీని నిర్వహణలో అన్నపూర్ణ, శాంతి, ఏకలవ్య, శ్రీ కృష్ణ, శ్రీ భగవాన్, మిత్ర, సావిత్రి సంఘాలకు చెందిన మహిళలు భాగస్వాములయ్యారు. స్థానికంగా లభ్యమైన ధాన్యాన్ని దంచి దంపుడు బియ్యంగా మార్చుతున్నారు. కిలో ప్యాకెట్లుగా మార్చి తెలంగాణాలోని హైదరాబాద్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు బీఎంపీఎస్ ట్రావెల్స్‌లో సరఫరా చేస్తున్నారు. ఆర్డర్ల ప్రకారం ఎగుమతి చేస్తున్నారు. కొండబారిడి గ్రామం శతశాతం సేంద్రియ వ్యవసాయ గ్రామంగా ఎంపిక కావడం, అక్కడ పండే ధాన్యాన్ని దంపుడు బియ్యంగా మార్చి విక్రయిస్తుండడంతో కొనుగోలుకు అధికమంది ఆసక్తిచూపుతున్నారు. దంపుడు బియ్యంతో బోలెడు ప్రయోజనాలు ► దంపుడు బియ్యంలో గోధుమ రంగులో ఉండే సెలీనియం పెద్ద పేగుకు కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ► దంపుడు బియ్యంలో ఉండే పీచుపదార్థం జీర్ణ వ్యవస్థలో ఉండే కేన్సర్ కారకాల రసాయానాలను బయటకు పంపుతూ పెద్ద పేగుకు కేన్సర్ రాకుండా కాపాడుతుంది. ► గోధుమ రంగులో ఉండే పైటోన్యూట్రిన్స్ లిగ్నాట్ రొమ్ము కేన్సర్, గుండె జబ్బులను అడ్డుకునేందుకు సహాయ పడుతుంది. ► వయస్సు మళ్లిన మహిళలపై జరిగిన అధ్యయనంలో దంపుడు బియ్యం (ముడి బియ్యం) తినడం వల్ల ఎంట్రోలాక్ట్స్ స్థాయి పెరిగి రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. గుండె జబ్బులు దరిచేరవు. ► దంపుడు బియ్యంలో పీచు పదార్థాలు అధికంగా ఉండడంతో ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండేలా చూస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండదు. శరీర బరువు సాధారణంగా ఉంటుంది. ► ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన మెగ్నీషియం 21 శాతం వరకు దంపుడు బియ్యంలో పుష్కలంగా లభిస్తాయి. ► రోగనిరోధక శక్తిని పెంపొందించి, రక్తం గడ్డకట్టకుండా ఉపయోగ పడుతుంది. జీర్ణవ్యవస్థ ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతుంది. ► గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్–2 డయాబెటీస్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. ఆదాయం బాగు.. ►2019లో ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో స్వయంగా దంపుడు చేసిన 1000 కేజీల బియ్యంను కేజీ రూ.45 చొప్పున విక్రయించి రూ.45,000 వేలు ఆదాయం ఆర్జించారు. ►2020–21 సంవత్సరాల్లో 2000 కేజీల బియ్యంను రూ.50 చొప్పున విక్రయించగా ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వచ్చింది. మూడున్నర సంవత్సరాలుగా లక్షా 35వేల పెట్టుబడితో రూ.లక్ష ఆదాయం పొందినట్టు మహిళా సంఘ సభ్యులు తెలిపారు. మార్కెట్లో గిరాకీకి తగ్గట్టుగా దంపుడు బియ్యం సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోషకాలు మెండు ముడి బియ్యంలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పోలేట్ (పోలిక్ యాసిడ్), బి–విటమిన్లు శరీరానికి కొత్త కణాలను ఏర్పరచేందుకు సహాయపడతాయి. పుట్టకతో వచ్చే లోపాలు తగ్గుతాయి. బియ్యంలో అధికంగా ఉండే పీచుపదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. – ఎ. ప్రసన్నరాణి, కృషివిజ్ఞాన కేంద్రం, విస్తరణ విభాగ శాస్త్రవేత్త, రస్తాకుంటుబాయి, కురుపాం మండలం తెలిసిన వ్యాపారం.. బియ్యం దంచడం మాకు నిత్యకృత్యం. దంపుడు బియ్యానికి మార్కెట్లో డిమాండ్ ఉన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఏడు సంఘాల మహిళలం ఏకమయ్యాం. ప్రతిరోజూ ధాన్యాన్ని దంచుతూ బియ్యం తయారు చేస్తున్నాం. నాణ్యమైన బియ్యం కావడంతో డిమాండ్ పెరుగుతోంది. ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం కిలో రూ.65కు విక్రయిస్తున్నాం. – పత్తిక సుశీల, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాలు, కొండబారడి, కురుపాం మండలం కొండబారిడి గ్రామంలో ఉన్న సత్యగాంధీ దంపుడు బియ్యం కేంద్రం -
‘వడ్లు దంచంగా రాడే.. వండంగ రాడే’.. ఈ పాట ఎక్కడైనా విన్నారా?
‘వడ్లు దంచంగా రాడే... వండంగ రాడే...’ వడ్లు దంచుతూ ఆ శ్రమను మర్చిపోవడానికి పల్లె మహిళలు పాడే పాట. ఇప్పుడంటే రైస్ మిల్లుల్లో బియ్యం పట్టిస్తున్నారు కానీ... తెలంగాణ పల్లెల్లో వెనుకట ఎంత ఉన్నవాళ్లైనా వడ్లు రోట్లో పోసి దంచి బియ్యం చేయటమే. ఆ ప్రక్రియలో శ్రమ అధికం. తమ బలాన్నంతా రోకలిపై ప్రయోగించి దంచాల్సి వచ్చేది. ఆ శ్రమ ఎక్కువగా లేని అనువైన సంప్రదాయ బియ్యం దంపుడు పద్ధతి మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కనిపించింది. అది కట్టెలతో తయారు చేసిన టెక్కి యంత్రం. రెండు కర్రల మధ్య భారీ చెక్కను పెట్టి, దానికి రోకలిని బిగించారు. ఆ చెక్క(టెక్కి)ని తొక్కితే రోకలి పైకి లేస్తుంది. వదిలేసినప్పుడు కింద సొర్కెలో ఉన్న వడ్లు దంచి బియ్యంగా మార్చేస్తుంది. వాటిని చెరిగి, మిగిలిన మెరిగలను మళ్లీ దంచుతారు. మిల్లుల్లో పాలిష్ చేసిన బియ్యంలో లేని పోషకాలెన్నో ఈ దంపుడు బియ్యంలో ఉంటాయి. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ దంపుడు బియ్యం ప్రయోజనాలు దంపుడు బియ్యం(ముడి బియ్యం) చూడటానికి ఇంపుగా లేకపోయినా చాలా పోషక విలువలున్నాయి. ముడి బియ్యంలో ఉన్న పీచు అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ముడి బియ్యం ఊక నుంచి లభ్యమయ్యే నూనె కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దంపుడు బియ్యం తినడం వల్ల రక్తపోటు తగ్గడమే కాకుండా రక్త నాళాల్లో కొమ్ము పేరుకోకుండా కాపాడుతుంది. – చింతల అరుణ్‌రెడ్డి, సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో తెలుసా..
న్యూఢిల్లీ: తిండి కలిగితే కండ కలదని, కండ కలిగిన వాడే మనిషనే సామెత మనకు తెలిసిందే. కానీ ప్రస్తుత సాంకేతిక సమాజంలో కేవలం రుచి కోసం అత్యధిక ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కాగా దేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే బియ్యం వినియోగానికి వస్తే.. ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రజలు తెల్ల బియ్యానే (పాలిష్ పట్టిన బియ్యం) వినియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచికరంగా ఉండడంతో అధికంగా ప్రజలు వీటినే వినియోగిస్తున్నారు. ముడి బియ్యం(దంపుడు బియ్యం లేదా పాలిష్ పట్టని బియ్యం). ఈ మధ్య కాలంలో ప్రకృతి వైద్య నిపుణులు వినియోగంపై ఈ బియ్యంపై ఎక్కువ అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఏ మేరకు నిజముందో తెలుసుకుందాం. ఉదాహరణకు 100 గ్రాముల ముడి య్యం తీసుకుంటే 1.8గ్రాముల ఫైబర్ లభిస్తుంది. అదేవిధంగా తెల్ల బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల కేవలం 0.4గ్రాముల ఫైబర్ మాత్రమే లభిస్తుంది. తెల్ల బియ్యం నిరంతరం తీసుకుంతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందక పోషకాహార లోపాలు ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ముడి బియ్యంలో అధిక శాతం యాంటి న్యూట్రియెంట్స్, ఫైటిక్ యాసిడ్, ఆర్సెనిక్‌లు (విష రసాయనం) ఉంటాయి. ఎక్కువ శాతం ముడి బియ్యాన్ని తీసుకోవడంతో యాంటీ న్యూట్రియెంట్స్ వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఖనిజ లవణాలకు ఇబ్బందులు కలిగిస్తాయి. అధికంగా ముడి బియ్యం తీసుకోవడం వల్ల ఆర్సెనిక్ విషరసాయనం ముప్పు ఉంటుంది. మన శరీరంలో అధికంగా ఆర్సెనిక్ చేరడం వల్ల క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్ తదితర జబ్బులు వస్తాయి. మితంగా తినడమే శ్రేయస్కరమని డాక్టర్లు చెబుతున్నారు. మితంగా ముడిబియ్యం తినడం వల్ల బోలెడన్ని లాభాలు ఉంటాయి. ముడిబియ్యం వల్ల హెచ్‌డీఎల్(మంచి కొలెస్ట్రాల్) పెరిగి శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్(కొవ్వు)ను తగ్గిస్తుంది. మరోవైపు మితంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాగా బరువు తగ్గాలనుకునే వారు తెల్ల బియ్యం కంటే ముడి బియ్యమే బెటర్. బీఎమ్ఐ(ఎత్తుకు కావాల్సిన బరువు) పాటించాలనుకునే వారికి ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. -
బ్రౌన్ రైస్‌లోకి ‘బెల్’ బ్రాండ్
రూ.30 కోట్లతో కొమరిపాలెం మిల్లు విస్తరణ - థాయ్‌లాండ్‌లో రూ.60 కోట్లతో మరో మిల్లు - ‘శ్రీ మురళీ మోహన’ సంస్థ ఎండీ చింతా రాఘవరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బియ్యం వ్యాపారంలో ఉన్న శ్రీ మురళి మోహన బాయిల్డ్, రా రైస్ మిల్.. బ్రౌన్ రైస్ విభాగంలోకి ప్రవేశించింది. 2015-16లో 2,000 టన్నుల బ్రౌన్ రైస్‌ను విక్రయించాలని లక్ష్యించింది. ప్రజల్లో బ్రౌన్ రైస్పట్ల అవగాహన పెరుగుతోందని, మున్ముందు భారీ వ్యాపార అవకాశాలు ఉంటాయని కంపెనీ భావిస్తోంది. బెల్ బ్రాండ్ కింద అన్ని మందుల షాపులు, కిరాణా దుకాణాల్లో సైతం ఈ రైస్‌ను అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఎండీ చింతా రాఘవరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. భారత్‌తోపాటు ఈ ఏడాది అమెరికా మార్కెట్‌కు బ్రౌన్ రైస్ ఎగుమతి చేస్తామన్నారు. మిల్లు విస్తరణకు ఇటీవలే రూ.30 కోట్లు వెచ్చించామంటూ... కొన్ని బ్రాండ్లు బ్రౌన్‌రైస్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని, తాము కిలో రూ.32-36కే విక్రయిస్తామని చెప్పారు. ఏటా 2 లక్షల టన్నులు..తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెంలో శ్రీ మురళి మోహన బాయిల్డ్, రా రైస్ మిల్లును 1983లో ఏర్పాటు చేశారు. 1.5 మెగావాట్ల విద్యుత్ ప్లాంటున్న ఈ మిల్లు సామర్థ్యం రోజుకు వెయ్యి టన్నులు. ఏటా 2 లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయిస్తోంది. రిటైల్ పరంగా దేశవ్యాప్తంగా పలు కిరాణా దుకాణాలతోపాటు మోర్, స్పెన్సర్స్, రిలయన్స్ ఫ్రెష్, మెట్రో తదితర సంస్థలకు వివిధ రకాల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. 15 దేశాలకు బియ్యం ఎగుమతులు చేస్తున్న ఈ కంపెనీ... 2014-15లో రూ.750 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. కాగా థాయ్‌లాండ్‌లో రూ.60 కోట్లు వెచ్చించి రోజుకు 500 టన్నుల సామర్థ్యంగల మిల్లును ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాఘవరెడ్డి చెప్పారు. ‘‘ఏపీ ప్రభుత్వం సహకరిస్తే కొమరిపాలెం మిల్లు సామర్థ్యాన్ని మరో 30 కోట్లు వెచ్చించి రోజుకు 1,500 టన్నులకు చేరుస్తాం. ఈ ఏడాది మరో 10 దేశాలకు విస్తరిస్తాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు టర్నోవర్‌ను ఆశిస్తున్నాం. 5 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లను కూడా ఏర్పాటు చేస్తాం’’ అని వివరించారు.