మార్కెట్లో ఇప్పుడూ పోషక విలువలు కలిగిన రకరకాల రైస్‌లు వస్తున్నాయి. ఆఫ్ బాయిల్డ్ రైస్, బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం, బ్లాక్ రైస్ వంటివి ఎన్నో వస్తున్నాయి. వాటిల్లో ఇటీవల ఎక్కువమంది బ్రౌన్ రౌస్, బ్లాక్ రైస్‌లు విరివిగా వినియోగిస్తున్నారు. రెండింటిలోనూ అధిక స్థాయిలో పోషకాలు ఉంటాయి. పైగా ఆరోగ్యానికి ఈ రెండు చాలా మంచివి కూడా. అయితే వీటిలో ఏదీ మనకు బెటర్ అనే విషయానికి వస్తే..
పోషకాల పరంగా..
బ్రౌన్ రైస్ తృణధాన్యంగా బాగా ప్రసిద్ధి చెందింది. దాని బయట ఉండే ఊక పొర థయోమిన్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. దీనిలో ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ రైస్ వద్దకు వచ్చేటప్పటికీ దీన్ని నిషిద్ధ బియ్యంగా పిలుస్తారు. దీనిలోని ఆంథోసైనిన్ కారణంగా డీప్ కలర్‌లో ఉంటుంది. ఇది శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లుగా పనిచేస్తుంది. దీనిలో కూడా చెప్పుకోదగ్గ మొత్తంలో ఐరన్, జింక్‌లు ఉన్నాయి. అలాగే పోషక సాంద్రతను మెరుగుపరుస్తుంది.
ఫైబర్ కంటెంట్..
రెండూ ఫైబర్‌కి మూల వనరులు. పోలిస్తే మాత్రం బ్లాక్‌రైస్‌లో మూడు గ్రాముల ఫైబర్ ఉంటే, బ్రౌన్ రైస్‌లో 4.5 గ్రాముల ఫైబర్‌తో ముందంజలో ఉంటుంది. ఈ లక్షణం కారణంగానే బ్రౌన్ రైస్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా బరువును అందుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక బ్లాక్ రైస్‌లో ఫైబర తక్కవుగా ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది, స్థిరమైన శక్తిని విడుదల చేస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్ పవర్
బ్రౌన్ రైస్‌లో ఉండే సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యానికే దోహదం చేయగా, నల్ల బియ్యం వర్ణద్రవ్యానికి కారణమైన ఆంథోసైనిన్‌లు ఆక్సీకరణ, ఒత్తిడి, మంట వంటి వాటి నుంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.
ఖనిజ కంటెంట్
బ్రౌన్ రైస్‌లో ఉండే మెగ్నీషియం, ఫాస్పర్స్‌లు ఎముకల ఆరోగ్యం కండరాల పనితీరు, శక్తిమంతమైన జీవక్రియకు ఉపయోగపడుతుంది. అలాగే దీనిలో యాంటీ ఆక్సిడెంట్ల రక్షణకు మూలమైన మాంగనీస్ కూడా తగు మోతాదులో ఉంటుంది. ఇక బ్లాక రైస్‌లో ఇనుము, జింక్ కంటెంట్లు రోగ నిరోధక పనితీరుని మెరుగుపర్చడమే గాక శరీరం మొత్తం సవ్యంగా ఆక్సిజన్ రవాణా అయ్యేలా చేస్తుంది.
కార్డియోమోటబాలిక్ ఆరోగ్యం..
ఈ రెండూ కార్డియోమెటబాలిక్ శ్రేయస్సుకు దోహదం చేసేవే. బ్రౌన్‌రైస్‌లోని అధిక ఫైబర్ కొలస్ట్రాల్ నియంత్రించడంలో ఉపకరించగా, బ్లాక్‌రైస్‌లో ఉండే ఆంథోసైనిన్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చి హృదయ సంబంధ వ్యాధులను దరిచేరకుండా కాపాడుతుంది.
నిజానికి ఈ రెండింటిలో ఏదీ బెస్ట్ అని నిర్ణయించడం కష్టం. రెండు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఏది ఎంచుకోవాలన్నది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని అనుసరించి వైద్యుల సలహ మేరకు ఎంచుకుంటే మంచిది. ముఖ్యంగా ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే బ్లాక్ రైస్ ఎంచుకోవడం మంచిది. అలా కాదు రుచితో కూడిన తేలికగా ఉండే ఆహారం కావాలనుకుంటే బ్రౌన్ రైస్ మేలు.
(చదవండి: షుగర్‌ని ఎంతలా స్వాహ చేసేస్తున్నామో తెలుసా? ఎలాంటి చక్కెర్లు బెటర్?)
Comments
Please login to add a commentAdd a comment