brownies
-
కొత్తా డైట్ అండి.. పేగన్ వచ్చెనండి..
ఇది తింటే మంచిది.. అది తింటే మంచిది కాదు.. దీన్ని ఇలా తీసుకోవాలి.. దాన్ని అలా తీసుకోవాలి.. రకరకాల ఆహారపు విధానాలు.. కీటో డైట్ అని.. చిరుధాన్యాలు అని ఇలా చాలా.. తాజాగా ఈమధ్య ఇంకో ఆహారపు విధానం ప్రపంచానికి పరిచయమైంది.. శాకాహారానికి... పేలియో డైట్‌ను కలిపేసిన ఈ పేగన్ ఆహారం మంచి చెడూ తెలుసుకుందామా... దీనికి ముందు ‘పేలియో డైట్’ అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితం మనుషులు తిన్న ఆహారాన్ని తీసుకోవడమే పేలియోడైట్. ఉదాహరణకు గుడ్లు, మాంసం.. కాయగూరలు తదితరాలు. తృణధాన్యాలతోపాటు పప్పులు, చక్కెర, శుద్ధి చేసిన ఆహార పదార్థాలు, రిఫైన్డ్ నూనెలు, ఉప్పు, కృత్రిమ చక్కెరలను అస్సలు తీసుకోకూడదు.పేలియో డైట్ వల్ల ప్రిజర్వేటివ్స్ రూపంలో కృత్రిమ రసాయనాలు కడుపులోకి చేరవని.. మొక్కల ద్వారా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా అందడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందన్నది అంచనా. ఇక శాకాహారం అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాంసపు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా.. కాయగూరలు, అన్ని రకాల ధాన్యాలను వాడటం సంతులిత ఆహారమని దీన్ని అనుసరించే వారు చెబుతారు. అయితే... మార్క్ హైమన్ అనే ఓ అమెరికన్ డాక్టర్ ఈ రెండు ఆహార విధానాలను కలిపేసి పేగనిజమ్ అనే కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు. గత ఏడాది ఫిబ్రవరిలో హైమన్ ‘వాట్ ద హెక్ షుడ్ ఐ ఈట్’ పేరుతో రాసిన పుస్తకం సూపర్‌హిట్ కావడంతో పేగనిజమ్ ప్రాచుర్యంలోకి వచ్చేసింది. కలిపి కొట్టర కావేటి రంగ... పేగనిజమ్ అంటే రెండు ఆహారపు పద్ధతులను కలిపి తీసుకోవడం అని ముందుగానే చెప్పుకున్నాం. ఇందులో ఎక్కువగా తీసుకునేది మొక్కల ఆధారిత ఆహారమే. దీంతోపాటు మార్కెట్లో దొరికే ముదురు రంగు కాయగూరలు, పండ్లు బాగా తినాలి. దీనివల్ల శరీరానికి పీచుపదార్థాలు ఎక్కువగా చేరతాయని, గుండెజబ్బులు రాకుండా చూడటంతోపాటు కేన్సర్, మరీ ముఖ్యంగా పేవు కేన్సర్ నివారణకు పేగనిజం ఉపయోగపడుతుందని హైమన్ చెబుతున్నారు. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ ఫలితాలు పొందవచ్చునని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. పేగన్ డైట్లో పండ్లు, కాయగూరల మోతాదు 75 శాతం వరకూ ఉంటే.. అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్), చేపలు... డ్రైఫ్రూట్స్, అవకాడో, ఆలివ్ సంబంధిత నూనెలు, గడ్డిమాత్రమే తిని పెరిగిన పశువుల నుంచి సేకరించిన మాంసం, వెన్న, నెయ్యి, ఆర్గానిక్ కొబ్బరి నూనె మిగిలిన పావు వంతు భాగాన్ని ఆక్రమిస్తాయి. నష్టాలూ ఉన్నాయి.. పేగన్ డైట్‌తో ఆరోగ్యానికి ఎన్ని లాభాలు ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పోషక విలువలు ఉన్నట్లు రూఢీ అయిన అనేక ఆహార పదార్థాలు.. ఉదాహరణకు గోధుమలు, బీన్స్ వంటివాటిపై నిషేధం ఉండటాన్ని నిపుణులు తప్పుపడుతున్నారు. గోధుమలోని గ్లుటెన్ కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చుగానీ.. పేగన్ డైట్లో గోధుమలతోపాటు క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్స్, రాజ్గిరా వంటి వాటిని కూడా తినకూడదనడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర మోతాదులను పెంచుతాయని.. పైగా రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తాయని హైమన్ సూత్రీకరణ.నాలుగేళ్ల క్రితం హైమన్ ఒక బ్లాగ్ రాస్తూ.. పాడి ఉత్పత్తులన్నింటినీ మానేయాలని సూచించినప్పటికీ తరువాతి కాలంలో ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఫలితంగా మేక లేదా గొర్రె పాల నుంచి పెరుగు, వెన్న తీసుకోవచ్చు. అయితే పాడి ఉత్పత్తుల వల్ల వ్యాధులు వస్తాయనే హైమన్ అంచనాకు ఇప్పటివరకూ శాస్త్రీయ ఆధారమేమీ లేకపోవడం గమనార్హం. ఏతా వాతా... ‘పేగన్ డైట్’ ఆరోగ్యానికి కలిగించే మేలు కొంతే. అదేసమయంలో మాంస ఉత్పత్తులను పరిమితం చేయడం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది. అతితక్కువ చక్కెరలు తీసుకోవడం.. చేపలు, అవిశగింజల నుంచి అందే ఒమేగా –3 ఫ్యాటీయాసిడ్లు పేగనిజానికి సానుకూల అంశాలైనప్పటికీ నిషేధిత జాబితాలో బోలెడన్ని ఆహార పదార్థాలు ఉండటం ప్రతికూల అంశమని నిపుణులు అంటున్నారు. ఆహార పద్ధతులేవీ మార్చుకోకుండానే.. శాకాహారాన్ని ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చునని, తద్వారా పక్కా నియమాలతో తిండి తినాల్సిన అవసరం తప్పుతుందని చెబుతున్నారు. -
కొత్తగా పీచు గోధుమ!
మనం సాధారణంగా వాడే వరి, గోధుమల్లో పీచు తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్ఓ శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన కొత్త వంగడాన్ని సృష్టించారు. ఇది సాధారణ గోధుమ కంటే దాదాపు పదిరెట్లు ఎక్కువ పీచుపదార్థం కలిగి ఉంటుంది. ఫ్రెంచ్ కంపెనీ లిమాగ్రెయిన్ క్రాలేస్ ఇన్‌గ్రేడియంట్స్‌తో కలిసి 2006లో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ ఈ మధ్యే విజయవంతంగా పూర్తయింది. గోధుమలోని రెండు ఎంజైమ్‌ల మోతాదు తగ్గిస్తే అమైలోజ్ అనే పాలీశాకరైడ్ ఎక్కువవుతుందని గుర్తించిన శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతుల ద్వారా దీన్ని సాధించారు. మొదట్లో అమైలోజ్ మోతాదు 25 నుంచి 30 శాతం మాత్రమే పెరిగినా, తరువాతి పంటల్లో మాత్రం ఇది రికార్డు స్థాయిలో 85 శాతం ఎక్కువైంది. ఫలితంగా గోధుమలోని ఒక రకమైన పీచు పదార్థం 20 శాతానికి చేరుకుంది. సాధారణ గోధుమలో ఇది ఒక శాతం మాత్రమే ఉంటుంది. ఈ కొత్త గోధుమ వంగడాన్ని ఇప్పటికే అమెరికాకు చెందిన మే స్టేట్ మిల్లింగ్ కంపెనీ సాగుకు సిద్ధం చేసింది. ఇడాహో, ఒరెగాన్, వాషింగ్టన్ రాష్ట్రాల్లోనూ, ఆస్ట్రేలియాలోనూ దీన్ని సాగు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాగ్యనగర్ వినాయకుడి లడ్డూ రూ.1.51 లక్షలు
వినాయకచవితి వేడుకల్లో భాగంగా భాగ్యనగర్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో 28వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ మాల రంగన్న రూ.1.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. మహా కలశాన్ని రూ.43 వేలకు ట్యాంకర్ ఓనర్ శివశంకర్ దక్కించుకున్నారు. స్వామివారి పూజకు ఉంచిన రూ. 10 నాణేన్ని పెయింటర్ సత్య అనే వ్యక్తి రూ.23 వేలకు పాడి సొంతం చేసుకున్నారు. కౌన్సిలర్ రంగన్న, నిర్వాహకులు లస్కర్ శీనా, రామాంజనేయులు, సూరి, రంగా తదితరులు పాల్గొన్నారు. -
మేలో 97 లక్షల శ్రీవారి లడ్డూల అమ్మకాలు
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల్లో పెరిగిన భక్తులకు అనుగుణంగా మే నెలలో రికార్డు స్థాయిలో 97.27 లక్షల తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు జరిగాయి. టీటీడీ చరిత్రలో ఒక నెలలో ఇన్ని లడ్డూలను భక్తులకు వితరణ చేయటం ఇదే తొలిసారి. 2013 లో మేలో 72.33 లక్షలు, 2014లో 80.84 లక్షలు, 2015లో 89.84 లక్షలు అందజేయగా ఈసారి మాత్రం 97.24 లక్షలు పంపిణీ చేశారు. టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పర్యవేక్షణలో రోజుకు 6 లక్షల లడ్డూలకు తగ్గకుండా నిల్వ ఉంచుకుని కొరత లేకుండా పంపిణీ చేశారు. తగ్గని రద్దీ: తిరుమలలో వేసవి సెలవుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. శనివారం కాలిబాట భక్తుల క్యూలో జరిగిన తోపులాటలపై టీటీడీ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిబాట భక్తుల క్యూ వద్ద లగేజీ డిపాజిట్ చేసుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 67,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండాయి. వీరికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. -
శ్రీవారి లడ్డూ టోకెన్లపై బార్ కోడ్
అక్రమ అమ్మకాలు అరికట్టేందుకు అమలు తిరుమల: తిరుమలలో లడ్డూ అక్రమాలు అరికట్టేందుకు టోకెన్లపై బార్కోడ్ విధానం బుధవారం అమల్లోకి వచ్చింది. ఆలయం వెలుపల అదనపు లడ్డూ కౌంటర్లో ఈ విధానం అమలుచేశారు. లోటుపాట్లను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తారు. దీనివల్ల నకిలీ టోకెన్లను అరికట్టడంతోపాటు రోజుకు ఎన్ని టికెట్లకు, ఎన్ని లడ్డూలు కేటాయించారో సులభంగా తెలుసుకోవచ్చు. బుధవారం తొలిరోజు కావడంతో బార్కోడ్లో కొన్ని సాంకేతిక ఇబ్బందులను గుర్తించారు. టోకెన్ల జారీ కూడా ఆలస్యమైంది. క్యూలో ఉండే భక్తులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు పారదర్శకంగా ఇవ్వాలనే ఉద్దేశంతో టోకెన్లపై బార్కోడ్ ప్రవేశ పెట్టామని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అమలుచేస్తామని జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. ముందస్తు డీడీలతో డైరీలు, కేలండర్లు: ఈవో సాంబశివరావు టీటీడీ ముద్రిస్తున్న శ్రీవారి డైరీలు, కేలండర్లకు స్పందన విశేషంగా ఉందని ఈవో దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. 2016 డైరీలు, కేలండ ర్లకు ఈనెల 31వ తేదీలోపు ముందస్తుగా డీడీలు పంపితే వాటిని సిద్ధం చేస్తామని బుధవారం తెలిపారు. డైరీ రూ. 100, 12 పేజీల కేలండర్ రూ. 75, శ్రీవేంకటేశ్వర స్వామి పెద్ద కేలండర్ రూ. 10, శ్రీవేంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు కలిగిన చిన్న కేలండర్ రూ. 5, తెలుగు పంచాంగం కేలండర్ రూ. 15 ధరగా నిర్ణయించామన్నారు. వెయ్యికి పైగా డైరీలు, కేలండర్లు అవసరమున్న సంస్థలు మాత్రమే మొత్తం సొమ్ములో 25శాతం వరకు డీడీలు పంపాలని, ఆర్డరు నిర్ధారణ తర్వాత మిగిలిన 75 శాతం పంపవచ్చన్నారు. ‘‘సహాయ కార్యనిర్వహణాధికారి, ప్రచురణల విక్రయ విభాగం, ప్రెస్ కాంపౌండ్, కేటీ రోడ్డు, తిరుపతి-517 501’’ చిరునామాకు డీడీలు పంపాలని ఈవో విజ్ఞప్తి చేశారు. ఇతరులకు విక్రయించబోమని ముందుగా రాతపూర్వకంగా సమర్పించాకే డైరీలు, కేలండర్లు అందజేస్తామన్నారు. -
వెంకన్న లడ్డూకు 75 ఏళ్లు
1803లో బూందీగా పరిచయమై, 1940లో లడ్డూగా స్థిరపడింది శ్రీవారి లడ్డూకు మేథో సంపత్తి హక్కులు రోజుకు 3 లక్షల లడ్డూల తయారీ, ఏటా సరుకుల కోసం రూ.200 కోట్ల ఖర్చు తిరుమల: తిరుమలేశునికి లడ్డూ నైవేద్యం అంటే మహాఇష్టం. భక్తులకూ ప్రీతిపాత్రమైంది. కొండ లడ్డూ మాధుర్యం 1940లో పరిచయమై 2015 నాటికి 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. సుఖీయం (క్రీ.శ.1445), అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం(క్రీ.శ.1468), మనోహర పడి(క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. 1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా ఆలయంలో ప్రసాదాలు విక్రయించడంలో భాగంగా బూందీ తీపి ప్రసాదంగా ప్రారంభించింది. అది చివరకు 1940లో లడ్డూగా స్థిరపడింది. లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ ధర్మకర్తలమండలి 1950లో నిర్ణయించింది. అవసరాలతోపాటు పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టాన్ని అనుసరిస్తున్నారు. దీని ప్రకారం 5,100 లడ్డూల తయారీకోసం ఆవు నెయ్యి 165 కేజీలు, శెనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, జీడిపప్పు 30 కేజీలు, ఎండు ద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, యాలకలు 4 కిలోలు.. మొత్తంగా 803 కేజీల సరుకులు వినియోగిస్తారు. 1940 తొలి రోజుల్లో కొండ లడ్డూ (అప్పట్లో కల్యాణోత్సవం లడ్డూ సైజులో ఉండేది) రేటు ఎనిమిదణాలే. ఆ తర్వాత రూ.రెండు, రూ.ఐదు, రూ.10, రూ.15, ప్రస్తుతం రూ.25 కు చేరింది. ప్రస్తుతం రోజూ మూడులక్షల వరకు లడ్డూలు తయారు చేస్తూ భక్తులకు అందజేస్తోంది. అయినా డిమాండ్ రెట్టింపు స్థాయిలోఉండటం గమనార్హం. ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు, అతిథులకోసం ఆస్థానం లడ్డూ (750 గ్రాములు), కల్యాణోత్సవం గృహస్తుల కోసం కల్యాణోత్సవం లడ్డూ (ధర రూ.100), భక్తులకు ఇచ్చే సాధారణ ప్రోక్తం లడ్డూ (175 గ్రాములు, ధర రూ.25) తయారు చేస్తారు. ప్రోక్తం లడ్డూకు రూ.100 ధర చెల్లించినా దొరకని సందర్భాలు ఉన్నాయంటే లడ్డూ డిమాండ్ ఏపాటిదో చెప్పనక్కరలేదు. దిట్టాన్ని టీటీడీ పక్కాగా అమలు చేయడం, లడ్డూ తయారు చేసే పద్ధతుల్లో శాస్త్రీయతల వల్లే తిరుమల లడ్డూ రుచి ఏమాత్రం తగ్గడంలేదు. ప్రసాదాల తయారీకి రూ.200 కోట్ల ఖర్చు తిరుమలేశుని లడ్డూ, ప్రసాదాల తయారీకి అవసరమైన 16 వేల మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా రూ.200 కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేస్తోంది. ఇందులో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. పెరిగిన ధరలు, నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డూ ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి. కొండలడ్డూకు చెన్నయ్‌లోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ విభాగం ద్వారా ఆరేళ్లకు ముందు టీటీడీ మేథోసంపత్తి హక్కులు మంజూరు చేసింది. -
సర్వదర్శనం భక్తులకూ లడ్డూ టికెట్లు
తిరుమల: తిరుమలేశుని దర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం కంపార్ట్మెంట్లలో సర్వదర్శనం భక్తులకూ లడ్డూ టికెట్లు ఇచ్చే కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. రూ. 20కి రెండు సబ్సిడీ లడ్డూలు, రూ. 50కి మరో రెండు లడ్డూలకు ఈ నెల 13వ తేదీ నుంచి సర్వదర్శనం క్యూలో టికెట్లు ఇవ్వాలని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు మంగళవారం ఆదేశించారు. ప్రస్తుతం కాలిబాట భక్తులకు ఉచితంగా లడ్డూ టికెట్లు ఇస్త్తున్నారు. సబ్సిడీ ధరతో రూ. 20కి రెండు, రూ. 50కి మరో రెండు లడ్డూలు ఇస్తున్నారు. కాలిబాట భక్తుడికి ఉచిత లడ్డూతోపాటు మొత్తం 5 లడ్డూలు అందుతున్నాయి. రూ. 300 టికెట్టుపై రెండు లడ్డూలు ఇస్తారు. దాంతోపాటు టికెట్టు రిజర్వు చేసుకునే సమయంలోనే అదనంగా రూ. 50 చెల్లిస్తే మరో రెండు లడ్డూ టికెట్లు పొందే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఇలా.. టీటీడీ కల్పించిన సదుపాయం ప్రకారం ఒక భక్తుడికి 4 లడ్డూలు అందుతున్నాయి. తాజాగా, ఇదే తరహాలో సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకూ కంపార్ట్మెంట్లలోనే లడ్డూలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
ఇదేమిటి వినాయకా!
కాణిపాకం లడ్డూ తయారీలో నాణ్యతకు తిలోదకాలు 20 నుంచి 30 గ్రాముల బరువు తగ్గిన వైనం నెయ్యి నాణ్యతా అంతంతమాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్ సూచనలు గాలికి కాణిపాకం: కాణిపాకం వినాయకుని లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. గతంలో 70 గ్రాముల బరువుతో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రూ.5కు విక్రయించేవారు. రెండేళ్ల క్రితం లడ్డూ బరువును వంద గ్రాములకు పెంచుతూ ధర రూ.10 చేశారు. ఇందుకు తగినట్లు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి. తయారు చేసిన గంటల వ్యవధిలోనే గట్టిగా మారుతోంది. రుచిలోనూ చాలా మార్పులు ఉన్నాయని భక్తులు వాపోతున్నారు. పైగా లడ్డూ బరువు 75 నుంచి 85 గ్రాములకు మించడం లేదు. లడ్డూ తయారీకి వాడే వస్తువుల నాణ్యత లోపం, కల్తీ నెయ్యి వాడకం, ఎండు ద్రాక్షా, జీడిపప్పు, యాలకులు కనిపించకపోవడం, కల కండ ఎక్కువగా వాడడం తదితర కారణాలతో ప్రసాదంపై భక్తులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఫుడ్ ఇన్స్పెక్టర్ సూచనలు గాలికి.. గతంలో పోటు సిబ్బందికి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇచ్చిన సూచనలు, సలహాలను గాలికి వదిలేశారు. బూందిని ముద్దగా తయారు చేసే సమయంలో నీళ్లతో చేతులు తడుపుకుంటుంటారు. నెయ్యితోనే చేతులు తడుపుకుని లడ్డు ముద్దను తయారు చేస్తే ప్రసాదం గట్టిగా మారదని వారు సూచించారు. పోటులో పని చేసే సిబ్బంది తలకు టోపీలు, ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలన్న సూచనలు పాటించడం లేదు. లడ్డూ తయారీలో నైపుణ్యం కలి గిన వారికి ప్రాముఖ్యత ఇవ్వడం లేద ని, అందువల్లే ప్రసాదం రంగులో మార్పులు కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు. వడల తయారీలోనూ నిర్లక్ష్యమే ఆలయంలో లడ్డూలతోపాటు వడలకూ విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే అవి ఎప్పుడూ అందుబాటులో ఉండ డం లేదు. రోజుకు 500 వడలను మాత్రమే తయారు చేసి విక్రయిస్తారు. ఒక్కొక్క వడను రూ.5కు విక్రయిస్తారు. ఇవి కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. దీనికితోడు వడలు తయారైన వెంటనే పైరవీలతో పోటు వద్దనే సగానికి పైగా అదృశ్యమవుతాయి. మిగిలి నవి కనీసం గంట సమయం కూడా కౌంటర్లో లభించవు. ఆలయ అధికారులు స్పందించి ప్రసాదాల నాణ్యతపై దృష్టి సారించడమేగాక వడలు భక్తులకు కావాల్సినన్ని అందివ్వాల్సి ఉంది.