the budget
-
‘సినీ’ వార్‌కు తాత్కాలిక తెర!
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ నిర్మాతలు, కార్మికుల మధ్య ప్రారంభమైన యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ప్రస్తుతమున్న వేతనాలనే మరో నాలుగు నెలల పాటు అందుకునేందుకు సినీ కార్మికుల సంఘం అంగీకరించడంతో నగరంలో మళ్లీ సినిమా షూటింగ్‌ల సందడి ప్రారంభమైంది. వివరాలను పరిశీలిస్తే....సినిమా రంగంలోని కార్మికుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, వాటిని తక్షణమే పెంచాలని కోరుతూ నిర్మాతలను సోమవారం సినీ కార్మికుల సంఘం డిమాండ్ చేసింది. ఇప్పటికిప్పుడు కార్మికుల వేతనాలను పెంచేస్తే ఆయా సినిమాలకు నిర్ణయించిన బడ్జెట్ భారీగా పెరిగిపోతుందన్న నిర్మాతలు ఇందుకు ససేమిరా అన్నారు. దీంతో కార్మికులు కూడా షూటింగ్‌లకు వెళ్లకుండా బంద్‌కు దిగారు. దీంతో సోమవారం ఐరావత, రికీ తదితర చిత్రాల షూటింగ్‌లు నగరంలో ఆగిపోయాయి. సోమవారం సాయంత్రమే సినీ నిర్మాతల సంఘం, సినీ కార్మికుల సంఘం ప్రతినిధుల మధ్య చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. దీంతో తిరిగి మంగళవారం సాయంత్రం ఇరు సంఘాల నేతలు కార్మికశాఖ అదనపు కమిషనర్ జింకలప్ప సమక్షంలో రెండవ సారి చర్చలు జరిపారు. ఈ సమయంలో ప్రస్తుతం షూటింగ్‌లు జరుగుతున్న సినిమాల బడ్జెట్, సినిమా ప్రారంభానికి ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని, అందువల్ల షూటింగ్‌ల మధ్యలో కార్మికుల వేతనాలను పెంచలేమని నిర్మాతలు చెప్పారు. ఇక ప్రస్తుత వేతనాలతో తమ కుటుంబాలను పోషించడం కూడా అత్యంత క్లిష్టంగా మారిందని కార్మికులు తమ ఇబ్బందులను చెప్పుకొచ్చారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేందుకు నిర్మాతల సంఘం నాలుగు నెలల గడువు కోరింది. అప్పటి వరకు ప్రస్తుత వేతనాలనే కొనసాగించేందుకు అంగీకరించాల్సిందిగా సినీ కార్మికుల సంఘాన్ని కోరింది. ఇందుకు కార్మికుల సంఘం అంగీకారం తెలపడంతో ఈ ఇరు సంఘాల మధ్య వార్కి తాత్కాలిక తెర పడినట్లైంది. -
మహిళల్ని మోసం చేస్తారా?
అప్పు చెల్లించొద్దని ఒట్టేయించుకున్న బాబు నేడు చేతులెత్తేస్తే ఎలా... వడ్డీ, అప్పు ఎవరు చెల్లిస్తారు... రుణమాఫీ తీరిదేనా? వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన గుడివాడ : రుణమాఫీ పేరుతో డ్వాక్రా మహిళల్ని చంద్రబాబు నిలువునా ముంచేశారని శాసనసభలో వైఎస్సార్సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో అప్పులు చెల్లించొద్దని చెప్పి ఒట్టేయించుకున్న చంద్రబాబు నేడు రుణమాఫీ భారం నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఆంక్షలు పెడుతున్నారని విమర్శించారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అలాగే రైతుల రుణమాఫీకి రూ.లక్షకోట్ల పైచిలుకు కావాల్సి ఉండగా బడ్జెట్లో మాత్రం కేవలం రూ.5వేలు కోట్లు విదిలించారని చెప్పారు. ఇది ఎవరిని మోసం చేయడానికని ప్రశ్నించారు. రుణమాఫీపై మాట మార్చిన చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఇప్పటి వరకు డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించలేదని, ఫలితంగా బ్యాంకుల్లో వేలాది రూపాయలు వడ్డీలు బకాయి పడ్డాయని వీటిని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. ప్రజలు అధికారం ఇచ్చింది వారికి మేలు చేయడానికే తప్ప... ప్రజలపై భారం మోపడానికి కాదన్నారు. ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా... ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధికార టీడీపీ ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే వారి బండారం బయట పడుతుందని చెప్పి ఎవరినీ మాట్లాడనివ్వకుండా స్పీకర్ మైక్ కట్ చేయడం దారుణమన్నారు. కేటాయింపులకు బడ్జెట్ అంచనాలకు పొంతన లేదని ఎలా నిధులు తెస్తారని ప్రశ్నించినా సమాధానం దాట వేశారని చెప్పారు. అంటే రానున్న కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పన్నులు భారం మోపటానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టమైందని తెలిపారు. పదేళ్లపాటు పాలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రజలపై పైసా పన్ను వేయకుండా అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. ప్రజలపై భారాలు మోపితే తాము సహించేది లేదని హెచ్చరించారు. పెదపారుపూడి జెడ్పీటీసీ మూల్పూరి హరీష పాల్గొన్నారు. -
నీటి పారుదల పథకాలకు మరిన్ని నిధులు
ఉప ఎన్నికలపై బీజేపీ వ్యూహం విభేదాలు వీడి... విజయానికి కృషి చేయాలని నేతల పిలుపు ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు తీర్మానం జెడ్పీ ఎన్నికల సన్నాహాలపై చర్చ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు ఈ నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కోవడం ద్వారా విజయాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సమావేశం తీర్మానించింది. స్థానిక మల్లేశ్వరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి, విజయానికి అందరూ కృషి చేయాలని నిర్ణయించారు. రెండు స్థానాల్లో పార్టీ బలంగా ఉన్నందున, మూడో స్థానాన్నీ గెలుచుకోవడానికి శాయశక్తులా కృషి చేయాలని తీర్మానించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టాల్సిన ఆందోళన గురించి కూడా సమావేశంలో చర్చించారు. అర్కావతి లేఔట్ డీనోటిఫికేషన్, లోపించిన శాంతి భద్రతలు, పెరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. రాబోయే జిల్లా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలపై కూడా చర్చ జరిగింది. పదాధికారుల సమావేశం అనంతరం పార్టీ జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉభయ సభల్లో ప్రతిపక్ష నాయకులు జగదీశ్ శెట్టర్, కేఎస్. ఈశ్వరప్ప ప్రభృతులు పాల్గొన్నారు. శాంతి భద్రతలు విచ్ఛిన్నం రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, ప్రభుత్వం నిద్ర పోతోందని జోషి, ఈశ్వరప్పలు విమర్శించారు. పదాధికారుల సమావేశం అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ హోం మంత్రికి ప్రత్యేకంగా సలహాదారును నియమించడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించారు. కేజే. జార్జ్ బదులు ఆయన సలహాదారు కెంపయ్య హోం మంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అతివృష్టి, అనావృష్టి తాండవిస్తున్నప్పటికీ, మంత్రులు పీడిత ప్రాంతాలను సందర్శించలేదని వారు విమర్శించారు. -
హంగు, ఆర్భాటమే మిగిలింది..
సీఎం పర్యటన రద్దుతో అధికారులు, నాయకుల్లో తీవ్ర నిరాశ ఏర్పాట్లకు రూ.లక్షలు వృథా చోడవరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన జిల్లాలో రద్దు కావడంతో ఇటు తెలుగు తమ్ముళ్లలో నిరాశ చోటు చేసుకోగా, మరో వైపు ఏర్పాట్లకు చేసిన వ్యయంతో రూ.లక్షలు వృథా అయ్యాయి. ఈనెల 30, 31తేదీల్లో జిల్లాలో సీఎం పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం ఐదురోజులుగా ఇటు జిల్లా అధికారులు, అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు చాలా అట్టహాసం చేశారు. చోడవరంలో రైతు సదస్సు, కశింకోటలో బడి పిలుస్తోంది, ఉపమాపకలో మహిళా సదస్సుల్లో సీఎం పాల్గొంటారని ఏర్పాట్లు చేశారు. దీనికి అధికారులు, పార్టీ నాయకులు ఎంతో హడావిడి చేశారు. సభల కోసం లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఇనుపరేకులతో కూడిన షెడ్డులు, భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. దీనికి రూ.50 లక్షలు మించే ఖర్చయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అసలే నిధులు లేక లోడు బడ్జెట్‌తో ఉన్న వ్యవసాయ, హార్టికల్చర్, విద్య, ఆర్అండ్బీ, డీఆర్డీఏ శాఖలకు సీఎం పర్యటన తలకు మించి భారంగా మారినా తప్పని పరిస్థితుల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి నుంచి చోడవరం వరకు రోడ్డుకు ఇరుపక్కల, సభా స్థలి ప్రాంగణాన్ని శుభ్రం చేసి సుందరంగా తయారు చేశారు. కశింకోట హైస్కూల్లో ఏకంగా వంటషెడ్డును హడావిడిగా నిర్మించారు. ఐదురోజుల పాటు అధికారులు కంటి మీద కునుకు లేకుండా ఏర్పాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంత చేయగా తీరా సీఎం పర్యటన రద్దు కావడంతో వారికి శ్రమే మిగిలింది. దీంతో ఇటు అధికారుల్లోను, అటు కార్యకర్తల్లోను తీవ్ర అసహనం కనిపించింది. అయితే సీఎం పర్యటన పేరిట కొన్ని రోడ్లకు మోక్షం కలగగా, సభలు నిర్వహించే పాఠశాల ఆవరణలు శుభ్రంగా తయారయ్యాయి.