Bukkal Nawab
-
హనుమాన్ మా ముస్లిం: బీజేపీ ఎమ్మెల్సీ
లక్నో: హనుమంతుడు దళితుడంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకమునుపే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆంజనేయుడు దళితుడు కాదు, ముస్లిం.. అంటూ బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ముస్లిం పేర్లు రహ్మాన్, ఫర్హాన్ లాగా ఆయన పేరు కూడా హనుమాన్ అని ఉండటమే అందుకు రుజువు అని ఆయన వాదిస్తున్నారు. ‘అందరికీ ప్రీతిపాత్రుడైన దైవస్వరూపుడు హనుమంతుడు. మతం, కులం, వర్గం అనే బేధం లేకుండా ఆయన అందరి పూజలు అందుకుంటున్నారు. మా మతంలోని వారికి ఉండే పేర్లు సల్మాన్, రెహ్మాన్, రంజాన్, జిషాన్, కుర్బాన్.. మాదిరిగానే హనుమాన్ పేరు కూడా ఉంది. అందుకే, నాకు తెలిసినంతవరకూ ఆయన మహమ్మదీయుడు’ అని బుక్కల్ నవాబ్ తన వాదనను సమర్థించుకున్నారు. -
‘అయోధ్య’పై నవాబ్ భారీ ప్రకటన
లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ బకల్ నవాబ్ అన్నారు. రామ జన్మభూమిలో ఆలయం నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తనకు భూ పరిహారం కింద రానున్న రూ. 15 కోట్లకు మందిరం నిర్మాణానికి విరాళంగా ఇస్తానని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ‘శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు కాబట్టి ఇక్కడే రామమందిరం కట్టాల్సిందేన’ని నవాబ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుంచి ఆయనకు 30 కోట్ల రూపాయల భూ పరిహారం అందుతుందని భావిస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్కు సన్నిహితుడైన బకల్ నవాబ్ మందిర నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.