bulk diesel
-
బాదుడు షురూ..ఒకేసారి డీజిల్‌పై రూ. 25 పెంపు..! బంకుల మూసివేత..!
రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకింది. పలుదేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. గతేడాది నవంబర్ 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఎన్నికల ఫలితాలు తరువాత ధరలు పెరుగుతాయని భావించడంతో ఎన్నడూ లేనంతగా జనాలు పెట్రోలు, డిజీల్ను భారీగా నిల్వ చేసుకున్నారు. అయితే బడ్జెట్ రెండో విడత సమావేశాల నేపథ్యంలో ధరల పెంపుపై కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదు. అయితే బల్క్ కస్టమర్లకు చమురు సంస్థలు గట్టి షాకిస్తూ బాదుడు షురూ చేశాయి. లీటరుకు రూ. 25 పెంపు..! బల్క్ కస్టమర్లకు డీజిల్ రేట్లను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఒకేసారి లీటరు డీజిల్‌పై రూ.25 మేర పెంచేశాయి. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 40 శాతం మేర పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని పలు సంస్థలు వెల్లడించాయి. కాగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే డీజిల్ రిటైల్ ధరలు ప్రస్తుతానికి యథాతథంగా ఉండనున్నాయి.ప్రస్తుతం ముంబయిలో లీటరు బల్క్ డీజిల్ ధర రూ.122.05 ఉండగా.. రిటైల్ పెట్రోల్ బంకుల్లో రేటు రూ.94.14గా ఉంది. ఢిల్లీలో బల్క్ డీజిల్ ధర రూ.115 ఉంటే.. రిటైల్ ధర రూ.86.67 ఉంది. బంకుల మూసివేత యోచనలో..! బల్క్ డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ప్రైవేట్ రిటైల్ కంపెనీలకు బంకుల నిర్వహణ కష్టంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న ధరలతో ఇంధనాన్ని విక్రయించడం వల్ల రిటైలర్లకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నయారా ఎనర్జీ, జియో-బీపీ, షెల్ వంటి సంస్థలకు నష్టాలు భారీగా పెరగనున్నాయి. తక్కువ ధరకు ఇంధనాన్ని విక్రయించే బదులు.. బంకులను మూసివేయడమే మంచిదనే యోచనలో ఈ సంస్థలు ఉన్నాయని తెలుస్తోంది. బస్సులకు ఇంధనం.. బంకుల్లోనే.. బల్క్ డిజీల్ ధరలు మార్కెట్ రేట్ల కన్నా అధికంగా ఉన్న నేపథ్యంలో.. బస్సులు సాధారణ పెట్రోల్ బంకుల్లోనే ఇంధనాన్ని నింపుకొంటున్నాయి. చమురు సంస్థల నుంచి నేరుగా పెట్రోల్, డీజిల్‌ను ఆర్డర్ చేసుకునే మాల్స్, ట్రావెల్స్ సర్వీసులు సైతం.. బంకులపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో రిటైలర్లకు నష్టాలూ పెరుగుతున్నాయి. చదవండి: తీవ్రమైన ఒత్తిడిలో కంపెనీలు..సామాన్యుడిపై బాంబు వేసేందుకు సిద్ధం..! వీటి ధరలకు రెక్కలు -
భగ్గుమన్న బల్క్ డీజిల్.. ఒక్కరోజులో లీటరుపై రూ.19
సాక్షి, హైదరాబాద్: బల్క్ డీజిల్ ధర ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది. ఒక్కరోజులోనే లీటరుపై రూ.19 మేర పెరిగింది. బహిరంగ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా పన్నుల్లో సర్దుబాటు చేస్తుండంతో ధర స్థిరంగా ఉండగా, చమురు కంపెనీల నుంచి నేరుగా సరఫరా చేసే బల్క్ ఆయిల్ ధర మాత్రం.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెరుగుతూ పోతోంది. మంగళవారం వరకు హైదరాబాద్‌లో బల్క్ డీజిల్ లీటరుకు రూ.99 (దూరాన్ని బట్టి రూపాయి మేర తేడా) ఉండగా, బుధవారం అది రూ.19 మేర పెరిగి రూ.118కి చేరుకుంది. యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగటంతో దేశీయంగా కూడా వాటి ధరలు పెరిగాయి. కానీ ఒకే రోజు ఏకంగా రూ.19 మేర లీటరుపై పెరగటం ఇదే తొలిసారి. రిటైల్‌లోనే ఆర్టీసీ కొనుగోళ్లు నిత్యం సగటున ఆరున్నర లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఆర్టీసీ నేరుగా చమురు కంపెనీల నుంచి బల్క్‌గా డీజిల్ కొంటోంది. అయితే యుద్ధం నేపథ్యంలో బల్క్ డీజిల్ ధర అంతకంతకూ పెరుగుతుండటంతో బల్క్ కొనుగోళ్లు ఆపేసి రిటైల్‌గా కొనటం ప్రారంభించింది. కానీ ప్రతి బస్సు బంకుకు వెళ్లి రావటంతో కొంత డీజిల్ వృథాగా వినియోగం కావడంతో చాలా డిపోల్లో బల్క్ డీజిల్‌నే వినియోగిస్తున్నారు. అయితే, బుధవారం డీజిల్ ధర ఒక్కసారిగా భగ్గుమనేసరికి ఆర్టీసీ బెంబేలెత్తిపోయింది. వెంటనే బల్క్ కొనుగోళ్లు ఆపేసి ప్రతి బస్సు బంకుకు వెళ్లి డీజిల్ నింపుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. -
బల్క్ డీజిల్ ఝలక్
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ముడి చమురు ధరలు పెరిగిపోవడంతో దీని ప్రభావం బల్క్ డీజిల్‌పై పడింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు బల్క్ డీజిల్ ధరను పెంచుతూ పోతున్నాయి. మంగళవారం నాటికి హైదరాబాద్‌లో బల్క్ డీజిల్« లీటర్ ధర రూ.103.70కి చేరింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో రిటైల్ ధర మాత్రం పెరగడం లేదు. దీంతో ప్రస్తుతం లీటర్ రూ.94.62కు లభ్యమవుతోంది. దీంతో బల్క్ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోగా, రిటైల్ విక్రయాలు పెరిగాయి. సాధారణంగా బల్క్ డీజిల్ ధరలు తక్కువగా ఉంటాయి. నెల క్రితం వరకు బల్క్ డీజిల్‌పై నాలుగు నుంచి ఐదు శాతం వరకు రాయితీ లభించేది. దీంతో రిటైల్ మార్కెట్లో కంటే లీటరుపై రూ.4 నుంచి రూ.5 వరకు తక్కువకు డీజిల్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. మరోవైపు డిస్కౌంట్‌ను కూడా చమురు సంస్థలు నిలిపివేశాయి. దీంతో బల్క్ డీజిల్‌ను విరివిగా కొనుగోలు చేసే ఆర్టీసీ, రైల్వే వంటి సంస్థలు రిటైల్ పెట్రోలు బంకులను ఆశ్రయిస్తున్నాయి. బల్క్ డీజిల్ వినియోగంలో హైదరాబాద్ నగర వాటా 60 శాతం వరకు ఉంటుంది. రాష్ట్రం మొత్తం మీద నెలకు బల్క్‌లో డీజిల్ అమ్మకాలు 67,800 కిలో లీటరు వరకు ఉంటే అందులో నగరంలోని సంస్ధల నుంచే 40,680 కిలో లీటర్లు వరకు ఉంటాయని అంచనా. -
‘బల్క్ డీజిల్’పై ఊరట!
న్యూఢిల్లీ, సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఏకమొత్తం(బల్క్)లో డీజిల్ కొనేవారికి రాయితీ ధర వర్తించదని, మార్కెట్ ధరకు కొనాల్సిందేనని 11 నెలల క్రితం విధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే యోచనలో ఉంది. ఈ దిశగా చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు రూపొం దించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం రాయితీ ధర కంటే మార్కెట్ ధర లీటరుకు కనీసం రూ. 10-11 ఎక్కువ ఉన్న విషయం విదితమే. దానిపై వ్యాట్‌తో అది రూ. 12-14 అవుతోంది. కాబట్టి డీజిల్‌ను బల్క్‌గా కొనుగోలు చేస్తే ఆర్టీసీకి ఏటా దాదాపు రూ. 700 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆ భారం మీదపడకుండా ఆర్టీసీ.. తన వినియోగంలో 90 శాతం డీజిల్‌ను పెట్రోల్ బంకుల్లో చిల్లరగా కొనుగోలు చేస్తోంది. దీని వల్ల పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు లబ్ధి చేకూరడం తప్ప ప్రభుత్వానికి వస్తున్న అదనపు ఆదాయం ఏమీ లేదు. డీజిల్ రాయితీ ధర, మార్కెట్‌ధర(బల్క్ కొనుగోలుదారులకు) మధ్య వ్యత్యాసం లేనప్పుడు.. రాష్ట్రంలోని మొత్తం డీజిల్ వినియోగంలో బల్క్ కొనుగోలు వాటా 20 శాతంగా ఉండేది. కొత్త విధానం ప్రవేశ పెట్టిన తర్వాత అది 4 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా కూడా ఇదే తీరు కనబడుతోంది. ఈ నేపథ్యంలో.. తన నిర్ణయాన్ని కేంద్ర వెనక్కి తీసుకోవాలని యోచిస్తోంది.