bunk frauds
-
పెట్రో...కనికట్టు
సాక్షి, అమరావతి బ్యూరో: తరచూ పెట్రోల్ బంకుల్లో తనిఖీలు నిర్వహించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు అటువైపే చూడటం లేదు. ఒకవేళ తనిఖీలు చేపట్టినా ఒకటి, రెండు బంకుల్లో హడావిడి చేసి తర్వాత మమ అనిపిస్తున్నారు. అంతా చమురు సంస్థలే చూసుకుంటాయంటూ చేతులెత్తేస్తున్నారు. ఆయా శాఖాధికారుల వద్ద మీ పరిధిలో ఎన్ని బంకులున్నాయి.. ఈ ఏడాది తనిఖీ చేసినవెన్ని? అనే కనీస సమాచారం కూడా లేదంటే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా 307 పెట్రోలు బంకులు ఉన్నాయి. ఇందు లో బీపీసీఎల్ కంపెనీకి చెందిన 56 బంకులు, హెచ్‌పీసీఎల్‌కు చెందినవి 91, ఐఓసీకి చెందినవి 124, ఈసర్ కంపెనీవి 04, వినియోగదారుల పంపులు 32 ఉన్నాయి. ప్రతి బంకుల్లోని పంపులకు ఇంధన కొలతలను ధ్రువీకరిస్తూ తూనికలు, కొలతల శాఖ అధికారులు సీల్ వేసి, స్టాంపింగ్ చేస్తారు. ఇలా ప్రతిఏటా బంకు నిర్వాహకులు పంపులకు స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఐదు లీటర్ల ఇంధనానికి 25 మిల్లీలీటర్ల తరుగును మాత్రమే చట్టం అనుమతిస్తుంది. ఈ లెక్కన లీటరుకు 5 మిల్లీ లీటర్ల తరుగు మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఎలాంటి అవకతవకలకు పాల్పిడిన చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా బంకులను సీజ్ చేస్తారు. లీటరుకు 30 మిల్లీ లీటర్లు తక్కువ ఇంధనం పోసే యంత్రాల్లో కొందరు బంకుల నిర్వాహకులు ఇంటిగ్రేటెడ్ చిప్‌లను అమర్చి వాహనదారులను నిండా ముంచుతున్న వైనాన్ని తాజాగా తెలంగాణ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. లీటరు ఇంధనానికి 970 మిల్లీ లీటర్లు వాహనంలో కొట్టగానే లీటరు కొట్టినట్లుగా పాయింట్లు చూపిస్తుంది. ఇలా వినియోగదారుడు 30 మిల్లీ లీటర్ల ఇంధనాన్ని నష్టపోతున్నాడు. ఇలా నిర్వాహకులు ప్రతిరోజు సగటున రూ.లక్ష వరకు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఇలాంటి బంకులను ఆంధ్రప్రదేశ్‌లో 22 సీజ్ చేశారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం..? బంకుల నిర్వాహకులు రికార్డుల్లో చూపుతున్నట్లు ఇంధనం నిల్వలున్నాయా.. లేదా? నిర్వహణ, వినియోగదారులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించాల్సిన బాధ్యత పౌరసరఫరాల శాఖ అధికారులది. పెట్రోల్, డీజిల్‌ను సరిగ్గా నింపుతున్నారా? ఇంధనం పోసే యంత్రాలు సక్రమంగానే ఉన్నాయా.. అక్రమాలేమైనా చోటు చేసుకుంటున్నాయా? అని తూనికలు, కొలతల శాఖాధికారులు తనిఖీ చేయాలి. బంకుపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత సంబంధిత చమురు సంస్థది. పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు ఏడాదిన్నరగా 173 బంకుల్లో తనిఖీలు చేసి ఊరుకున్నారు. ఇలా చేస్తే మేలు... ప్రస్తుతం తూనికలు, కొలతల అధికారులు మదర్ బోర్డు, ఇంటిగ్రేటెడ్ చిప్‌కు మాత్రమే సీల్ వేస్తున్నారు. అలా కాకుండా రీడింగ్ బోర్డు సహా ïసీల్ వేయాలి. మరమ్మతుల నిమిత్తం ఓటీపీ ఉంటేనే తెరుచుకునేలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. సంబంధిత అధికారులు, సిబ్బంది వేలి ముద్ర వేస్తేనే యంత్రాలను తెరిచేలా ఏర్పాట్లు చేయాలి. మోసాలకు పాల్పడితే బంకు సీజ్ చేస్తాం పెట్రోలు బంకుల్లో ఇంధన కొలతల్లో నిర్వాహకులు ఎలాంటి మోసాలకు పాల్పడినా నేరమే అవుతుంది. వినియోగదారులు జేబులు చిల్లులు పెట్టేలా ఎవరూ వ్యవహరించినా ఉపేక్షించం. అటువంటి బంకులను సీజ్ చేస్తాం. నిర్దేశిత సమయంలోపే బంకులకు స్టాంపింగ్ చేస్తున్నాం. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 173 బంకులను తనిఖీలు చేశాం. 16 బంకులపై కేసులు నమోదు చేసి.. రూ. 2.27 లక్షలు జరిమానా విధించాం. – ఎ.కృష్ణ చైతన్య, డిప్యూటీ కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ -
పెట్రోల్ బంకుల్లో నిలువు దోపిడీ
ఒంగోలు–కర్నూలు రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో ఇటీవల ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోయించుకునేందుకు వెళ్లాడు. రూ.100 పెట్రోలు కొట్టమని చెప్పి పర్సు నుంచి డబ్బు తీయబోయాడు. ఆ లోపే పెట్రోల్ పోసే వ్యక్తి ఇంధనం నింపేశాడు. ఇంతలోనే కొట్టడం అయ్యిందా.. అని వాహనదారుడు ప్రశ్నించగా అంత అనుమానం ఉంటే మీరే రీడింగ్ చూసుకోవాలంటూ అతగాడు సలహా ఇచ్చాడు. దీంతో వాహనదారుడు ఏం మాట్లాడకుండా వెళ్లి పోయాడు. ఉదయం మళ్లీ కార్యాలయానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఇంధనం అయిపోయి వాహనం ఆగిపోయింది. వెంటనే సమీప పెట్రోల్ బంకుకు వెళ్లి ఆ వ్యక్తిని నిలదీశాడు. దీనికి ఆయన ‘మేం సక్రమంగానే పోశాం.. మీరు ఎక్కడెక్కడ తిరిగారో ఎవరికి తెలుసు’ అని ఎదురు ప్రశ్నించడంతో ముక్కున వేలుసుకోవాల్సి రావడం వినియోగదారుడి వంతైంది. ఇలాంటి ఘటనలు జిల్లాలో నిత్యం కోకొల్లలుగా జరుగుతున్నాయి. వినియోగదారుణ్ని మాటల్లో పెట్టి పెట్రోల్ బంకుల నిర్వాహకులు నిలువునా దోచేస్తున్నారు. కొలతల్లో మాయజాలం చేస్తూ నష్టపరుస్తున్నారు. బంకుల్లో పని చేసే ఫిల్లింగ్ మెన్ల చేతివాటానికి వాహనదారులు మోసపోతున్నారు. పొదిలి రూరల్: జిల్లాలో ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగింది. దీంతో కొందరు పెట్రోల్ బంకుల నిర్వాహకులు అక్రమార్జనకు తెర లేపారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. పెట్రోల్ కొలత పూర్తి కాకుండా పంపు ఆపివేయడం, వేగంగా ట్యాంకు నింపడం, అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్ యంత్రంపై చేయి అడ్డుపెట్టడం, వంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలు గాలికొదిలేశారని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ధరల పట్టిక కనిపించదు. ఉచిత గాలి యంత్రం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఇలాంటివి చాలా చోట్ల కనిపించవు. అసలే చమురు ధరల భారంతో జనం నలిగిపోతుంటే మరోవైపు బంకుల్లో దోపిడీ వారిని మరింత కుంగదీస్తోంది. డీజిల్, పెట్రోల్ విక్రయాల్లో ఛీటింగ్ జరుగుతున్నా తనీఖీలు నిర్వహించి నిగ్గు తేల్సాల్సిన తూనికలు, కొలతలు శాఖ అధికారులు వినియోగదారుల మొరాలకించడంలేదు. అంతెందుకు ఎన్ని బంకులున్నాయి.. తనిఖీలు ఎప్పడైనా చేశారా.. ఎంత జరిమానా వేశారు.. అనే సమాచారం కూడా సంబంధిత అధికారుల వద్ద లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కల్తీతో వాహనాల రిపేర్లు.. నింబంధనల ప్రకారం లీటరుకు 5 ఎంఎల్ ఇంధనం తక్కువగా రావొచ్చు. అంతకంటే ఎక్కువగా వస్తే అనుమానించాల్సిందే. కొన్ని బంకుల్లో 50 ఎంఎల్ నుంచి 100 ఎంఎల్ వరకు తేడా వస్తున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. మరి కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో రేషన్ కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారని, దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదాములు నుంచి బంకుకు సరఫరా చేసే క్రమంలోనే కల్తీ జరుగుతున్నట్లు సాక్షాత్తు అధికారులే అంగీకరిస్తుండటం గమనార్హం. ఎవరేం చేయాలి.. రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలు న్నాయా లేదా, నిర్వహణ తీరు తదితర అంశాలు ను పరిశీలించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖది. పెట్రోల్, డీజీల్‌ను సరిగ్గా కొడుతున్నారా.. వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా.. ఇంధనం పోసే యంత్రాలను తూనికలు, కొలతలు శాఖధికారులు ఎప్పటికప్పుడు తనీఖీ చేయాలి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. నిలువు దోపిడీ పొదిలిలోని పొదిలి–ఒంగోలు రహదారిలో గల ఓ పెట్రోల్ బంకులో 100 రూపాయలుకు పెట్రోల్ పోయించుకున్నా. ఒంగోలు వరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చూసేసరికి బైకులో పెట్రోలు లేదు. అక్కడ మళ్లీ మరో వంద రూపాయలకు పెట్రోల్ పోయించుకుని బయలుదేరా. పొదిలి వచ్చి ఆ పెట్రోల్ బంకులో అడిగితే మేం కరెక్టుగా కొట్టామని, అంత అనుమానం ఉంటే మీరే రీడింగ్ చూసుకోవాలన్నాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. – గురువారెడ్డి, వాహనదారుడు, పొదిలి నిబంధనలు పాటించకపోతే చర్యలు.. పెట్రోల్ బంకుల నిర్వాహకులు నిబంధనలు పాటించాల్సిందే. ఆయిల్ నింపే ముందు మీటరు వేసి వాహనాలకు పెట్రోల్, డీజిల్ నింపాలి. ఎక్కడైనా కల్తీలు జరిగినా, ఆయిల్ నింపడంలో తేడాలు గుర్తించినా అటువంటి బంకులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఫిర్యాదు చేసినా ఆయా పెట్రోల్ బంకులను రెండు, మూడు రోజుల్లో తనిఖీ చేసి తప్పు జరిగితే చర్యలు తీసుకుంటాం. – మూర్తి, జిల్లా తూనికలు, కొలతలు అధికారి -
పెట్రోలు బంకుల సమ్మె విరమణ
-
గవర్నర్ సీరియస్.. పెట్రోలు బంకుల సమ్మె విరమణ
పెట్రోలు బంకుల మూసివేతపై గవర్నర్ సీరియస్‌గా స్పందించారు. తక్షణం వాటిని తెరిపించేలా చర్యుల తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాజీవితానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, పౌరసరఫరాల శాఖకు ఆయన ఆదేశాలిచ్చారు. దీంతో బంకుల యాజమాన్యాలు దెబ్బకు దిగొచ్చాయి. సమ్మెను ఉపసంహరించుకుంటున్నట్లు పెట్రోలు బంకుల డీలర్ల సంఘం తెలిపింది. మరోవైపు పెట్రోల్‌బంకుల్లో వాడుతున్న రెండు కంపెనీల తూనిక యంత్రాల కారణంగా అవకతవకలకు ఆస్కారం ఉందని తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ భాస్కర్ తెలిపారు. వాటిని రిమోట్‌తో ఆపరేట్ చేస్తున్నారని, రిమోట్ ఆధారంతో నేరుగా ధర, పరిమాణాన్ని కావాల్సిన విధంగా ఆపరేట్ చేస్తున్నారని వివరించారు. అనేక బంకులపై దాడులు చేసి కేసులు నమోదు చేశామని, రిమోట్లు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ట్రస్సర్‌వీన్ కంపెనీ తూనిక యంత్రాలు వాడుతున్న బంకులను సీజ్‌చేశామని, చైనా నుంచి ఈ యంత్రాలను దిగుమతిచేసుకుని వినియోగదారులను మోసం చేస్తున్నారని భాస్కర్ చెప్పారు. కంపెనీ పాస్‌వర్డ్‌ను అధికారులకు అందుబాటులో ఉంచడంలేదని, సికింద్రాబాద్‌లో ట్రస్సర్‌వీన్ కార్యాలయంపై దాడులు చేసినప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయని ఆయన తెలిపారు. -
బంకుల అక్రమాలపై 86 కేసులు
పెట్రోల్ బంకుల అవతవకలపై ఇప్పటి వరకు 86 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సర్ వేన్ రిమోట్లను వాడుతున్న పంపులపై వంద కేసులు నమోదు చేశామన్నారు. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు సమ్మె దిగడం సబబు కాదని, నిబంధనలకు విరుద్ధంగా బంకులు కొనసాగిస్తే మాత్రం తమ దాడులు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీల పేర్లు చెప్పి పెట్రోల్ డీలర్లు తప్పించుకోవడం సరైనది కాదని లీగల్ మెట్రాలజీ అధికారులు అన్నారు.