
బంకుల అక్రమాలపై 86 కేసులు
పెట్రోల్ బంకుల అవతవకలపై ఇప్పటి వరకు 86 కేసులు నమోదు చేసినట్లు తూనికలు, కొలతల శాఖ అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రెస్సర్ వేన్ రిమోట్లను వాడుతున్న పంపులపై వంద కేసులు నమోదు చేశామన్నారు.
పెట్రోల్ బంకుల యాజమాన్యాలు సమ్మె దిగడం సబబు కాదని, నిబంధనలకు విరుద్ధంగా బంకులు కొనసాగిస్తే మాత్రం తమ దాడులు యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఆయిల్ కంపెనీల పేర్లు చెప్పి పెట్రోల్ డీలర్లు తప్పించుకోవడం సరైనది కాదని లీగల్ మెట్రాలజీ అధికారులు అన్నారు.