C . Ramachandraiah
-
స్పీకర్ పదవిని అపవిత్రం చేశారు
-
తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: సి.రామచంద్రయ్య
తెలుగు దేశం ప్రభుత్వం కాపులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని ఏపీ శాసన మండలి విపక్ష నేత సి. రామచంద్రయ్య ఆరోపించారు. కాపురిజర్వేషన్ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిన్నారని అన్నారు. తుని ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయనీ..దీనిపై సీబీఐ చేత సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరాభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి వరకూ కడప రౌడీలు తుని ఘటన వెనుక ఉన్నారని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు గోదావరి జిల్లా నాయకులను అరెస్టు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పై కాపులకు నమ్మకం పోయిందని స్పష్టం చేశారు. ఇప్పటి కైనా టీడీపీ లోని కాపు నాయకుల చేత విమర్శలు చేయించే పని ఆపి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. -
దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకో
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలను దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సీఎం చంద్రబాబునాయుడికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య సవాలు విసిరారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. తాను గతంలో టీడీపీ నుంచి పీఆర్పీలో చేరినప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారని.. దానిని సవాలుగా స్వీకరించి రాజీనామ చేసి మళ్లీ ఎన్నికయ్యానన్నారు. నేడు చంద్రబాబు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. పట్టీసీమను చంద్రబాబు, థర్మల్ కేంద్రాలను చిన్నబాబుకు ధారాదత్తం చేసుకుని అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. -
ఆర్భాటాలు ఎందుకు..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం వర్కింగ్ క్యాపిట్ కావాలని.. వందల కోట్లతో శంకుస్థాపనలు అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య అన్నారు. ప్రచార ఆర్భాటాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రావని తెలిపారు. టీడీపీ సర్కార్ ప్రజల ప్రధాన్యతలు, అవసరాలను గుర్తించడం లేదని విమర్శించారు. ఒకవైపు నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే.. మరో వైపు చంద్రబాబునాయుడు మా ఊరు- మా మట్టి అంటూ పండుగలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. సింగపూర్ ఒప్పందాల వెనక సీఎం చంద్రబాబు నాయుడికి ఉన్న ప్రయోజనాలు ఏంటో.. త్వరలోనే బయట పడతాయని వ్యాఖ్యానించారు.