దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకో | C .Ramachandraiah criticized Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకో

Published Thu, Feb 25 2016 6:17 PM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

C .Ramachandraiah  criticized Chandrababu Naidu

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలను దమ్ముంటే రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సీఎం చంద్రబాబునాయుడికి శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య సవాలు విసిరారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు.

తాను గతంలో టీడీపీ నుంచి పీఆర్పీలో చేరినప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారని.. దానిని సవాలుగా స్వీకరించి రాజీనామ చేసి మళ్లీ ఎన్నికయ్యానన్నారు. నేడు చంద్రబాబు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను చేర్చుకొని దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నాడన్నారు. పట్టీసీమను చంద్రబాబు, థర్మల్‌ కేంద్రాలను చిన్నబాబుకు ధారాదత్తం చేసుకుని అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement