cabinet agenda
-
రైతన్నల కోసం రూ.1.5 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రం రైతులకు ఊరట కల్పించేలా కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలు చవిచూసిన నేపథ్యంలో అప్రమత్తమైన ఎన్డీయే ప్రభుత్వం రైతులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.1.50 లక్షల కోట్ల మేర వ్యవసాయ ప్యాకేజీని ప్రకటించే అవకాశమున్నట్లు వెల్లడించాయి. అన్నదాతల ఆదాయం పెంపు, చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే విషయాన్ని కేంద్ర కేబినెట్ అజెండాలో చేర్చినట్లు పేర్కొన్నాయి. సోమవారం జరగాల్సిన ఈ భేటీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. పరిశీలనలో ‘రైతు బంధు’.. పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే రైతులకు వడ్డీని మాఫీ చేయడం ఈ సిఫార్సుల్లో మొదటిది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.15వేల కోట్ల భారం పడనుంది. అలాగే ఆహార పంటలను సాగుచేసే రైతన్నలు చెల్లించే బీమా ప్రీమియంను పూర్తిగా మినహాయించాలని వ్యవసాయ శాఖ సిఫార్సు చేసింది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ‘రైతు బంధు’ ఒడిశా సర్కారు తెచ్చిన ‘కాలియా’ పథకాల తరహాలో రైతుల బ్యాంకు ఖాతాలకే నగదును నేరుగా బదిలీ చేసే అంశాన్నీ కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతులను ఆదుకునేందుకు కేంద్రం తీసుకురానున్న ప్యాకేజీ రూ.1.50 లక్షల కోట్లు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతోపాటు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపుల్ని మూడు రెట్లు పెంచనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయి తే ఈ సిఫార్సులపై ప్రధాని మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశమైన తర్వాతే స్పష్టత రానుందని భావిస్తున్నారు. 2019–20 బడ్జెట్ çసమర్పణకు చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన అమలు చేసేలా, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూర్చేలా ఎన్డీయే ప్రభుత్వం ఈ కొత్త పథకానికి తుదిరూపు ఇవ్వనుంది. -
కేబినెట్ ఎజెండాపై సీఎం చర్చలు
అధికారులతో కేసీఆర్ సుదీర్ఘ భేటీ సాక్షి, హైదరాబాద్ : ఈనెల 16న జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో చర్చించే అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులు,ప్రభుత్వ ఉన్నతాధికారులతో శనివారం రాత్రి సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, రైతు రణమాఫీ, వృద్ధాప్య,వికలాంగుల పెన్షన్, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే బిల్లుకు లోకసభ ఆమోదించడం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. హైదరాబాద్‌ను మురికివాడలులేని నగరంగా తీర్చిదిద్దే చర్యలపై కూడా చర్చించారు. ఆయా శాఖల నుంచి వచ్చే ప్రతిపాదనలనన్నింటినీ సోమవారం సాయంత్రంలోపే జీఏడీకి పంపేలా చూడాలని, ఆయా శాఖలపై మంగళవారం తుది నిర్ణయం తీసుకుని ఎజెండా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పోలవరంతో పాటు, కృష్ణా జలాల పంపిణీ అంశంపై కూడా నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ అవసరమైతే మంత్రివర్గం తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నారు. మురికివాడలులేని నగరంగా హైదరాబాద్ హైదరాబాద్‌లో మురికివాడలు లేకుండా చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి జోషి, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. మురికివాడల్లో నివసించే ప్రజలను ఎక్కడో నగరం బయటికి పంపకుండా వారు నివసిస్తున్న ప్రదేశంలోనే మౌలికసదుపాయాలతో పాటు జీవనప్రమాణాలు పెంచేలా ఇళ్లు నిర్మించాలని సూచించారు. దశలవారీగా దీనిని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ఆర్థిక, మునిసిపల్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎజెండాలోలేని తెలంగాణ అంశం