cabinet reshufle
-
అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్లో కీలక పరిణామం.. ఆ మంత్రులకు షాక్!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖర్లో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఇద్దరు కీలక కేబినెట్ మంత్రులకు కేటాయించిన శాఖలను తగ్గించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల శాఖలను తగ్గిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి రాజేంద్ర త్రివేది పోర్టిఫోలియోల నుంచి కీలక శాఖ అయిన రెవెన్యూను, పూర్ణేశ్ మోదీ శాఖల్లోని కీలకమైన రోడ్డు, భవనాల శాఖను ముఖ్యమంత్రి తొలగించారు. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఇలా మంత్రివర్గంలో మార్పులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాజేంద్ర త్రివేది, పుర్ణేశ్ మోదీల నుంచి తొలగించిన రెండు శాఖలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పర్యవేక్షించనున్నారు. రాజేంద్ర త్రివేది వద్ద న్యాయ, విపత్తు నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఉన్నాయి. మరోవైపు.. పూర్ణేశ్ మోదీ వద్ద రవాణా, పౌర విమానయాన, పర్యటకం, దేవాదాయ అభివృద్ధి శాఖలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూపేంద్ర పటేల్ ప్రభుత్వంలోని 10 కేబినెట్ ర్యాంక్ మంత్రుల్లో త్రివేది, మోదీలు ఉన్నారు. అయితే, రోడ్లు, భవనాల విభాగం, రెవెన్యూ విభాగల పనితీరు సరిగా లేదని సీఎంకు ప్రభుత్వ వర్గాలు సూచించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. హర్ష రమేశ్‌కుమార్ సంఘ్వీకి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, జగదీశ్ ఐశ్వర్ పంచల్‌కు రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం భూపేంద్ర పటేల్. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్ రూపానీ స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు భూపేంద్ర పటేల్. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన తాజా పరిణామం వెనుకున్న కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు. Gujarat | In state cabinet rejig before Assembly elections, Revenue ministry taken from Rajendra Trivedi while Road and Building Ministry take from Purnesh Modi, both the ministries will now be handled by CM Bhupendra Patel pic.twitter.com/2VavVSJQBI — ANI (@ANI) August 20, 2022 ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్ బ్యాన్పై మనీశ్ సిసోడియా విమర్శలు -
బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రులు
-
యోగి టీంలో చోటు వీరికే..
సాక్షి, లక్నో : ఉప ఎన్నికల్లో వరుస ఓటములు ఎదురవడంతో ఉత్తర ప్రదేశ్ పార్టీ యంత్రాంగంలో భారీ మార్పులకు బీజేపీ సన్నద్ధమైంది. పార్టీ, ప్రభుత్వ పదవుల నియామకాల్లో సమతూకం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు సంఘ్ పరివార్‌తో సమన్వయంతో పనిచేయాలని బీజేపీ అగ్రనాయకత్వం సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు సూచించింది. అధికారుల ప్రమేయాన్ని తగ్గించి పార్టీ నేతల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని కూడా విస్పష్ట సంకేతాలు పంపినట్టు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. బూత్ స్థాయి నుంచి అసెంబ్లీ నియోజకవర్గస్థాయి వరకూ పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు పెద్దపీట వేసేలా చర్యలు చేపట్టాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశించిందని వెల్లడించాయి. మారిన సంస్థాగత నిర్మాణంలో పార్టీ విస్తారక్‌లు కీలక భూమిక పోషిస్తారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. మరోవైపు త్వరలో చేపట్టనున్న యూపీ క్యాబినెట్ విస్తరణలో సంఘ్ పరివార్ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. జులై రెండో వారంలోగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. కైరానా లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎదురైన పరాజయం నేపథ్యంలో అధికారిక నియామకాల్లో సమతూకానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ యోచిస్తోంది. కాగా యూపీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సునీల్ బన్సల్ పనితీరుపై యూపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేంద్ర నాయకత్వం కొద్దిరోజుల పాటు యూపీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఇన్‌చార్జ్‌లు సునీల్ బన్సల్, శివ్ప్రకాష్లకు సూచించినట్టు సమాచారం. ఇక బన్సల్‌తో విభేదాల కారణంగా పార్టీ యూపీ వ్యవహరాల ఇన్చార్జ్ ఓపీ మాధుర్ సైతం అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు.పార్టీ శ్రేణుల్లో నెలకొన్న విభేదాలు, అసంతృప్తిని పారదోలేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ నేతలు, కార్యకర్తలతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
పంకజ అలక.. సీఎం బుజ్జగింత
ముంబయి: 'ఇది మా సెక్షన్ పని కాదండి..' అని శంకర్ సినిమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అంటారే.. దాదాపు అలాంటి సంవాదమే చోటుచేసుకుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, మంత్రిణి పంకజ ముండేల మధ్య. సోమవారం సింగపూర్ లో జరగనున్న అంతర్జాతీయ జల సదస్సుకు వెళ్లబోనని, ఆ పని నాది కాదని అలక బూనిన పంకజను ముఖ్యమంత్రి ఫడ్నవిస్ బుజ్జగించి చివరకు సింగపూర్ వెళ్లేలా ఒప్పించారు. ఇంతకీ ఆమె అలకకు కారణం ఏమంటే.. గోపీనాథ్ ముండే వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పంకజ.. ఎమ్మెల్యే అవుతూనే మంత్రి పదవి చేపట్టారు. మహారాష్ట్ర జల సంరక్షణ (వాటర్ కంజర్వేషన్) మంత్రిగా ఉన్న ఆమెను.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖకు మార్చారు. రెండేళ్లుగా నిర్వహిస్తున్న శాఖ నుంచి ఉన్నపళంగా మార్చేయడంతో పంకజ కొద్దిగా డిసపాయింట్ అయ్యారట. అందుకే సింగపూర్ లో జరిగే కార్యక్రమాలనికి వెళ్లడం లేదని, ఆ శాఖ మంత్రిని కానుకాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నానని శనివారం ట్వీట్ చేశారు. ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న సీఎం ఫడ్నవిస్.. కొద్ది గంటల్లోనే పంకజ ట్వీట్ పై స్పందించారు. 'సింగపూర్ సదస్సుకు మీరు తప్పక హాజరుకావాలి. సీనియర్ మంత్రిగా అది మీ బాధ్యత. మీరు జల సంరక్షణ మంత్రిగా కాదు.. మహారాష్ట్ర ప్రభుతవ ప్రతినిధిగా సింగపూర్ వెళ్లండి' అని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అంతే, విమానం టికెట్లు బుక్ చేసుకునే పనిలోపడ్డారు పంకజ.. Reaching singapore tomorrow on monday there is world water leader summit i was invited but now wont attend since i m not minister incharge — PankajaGopinathMunde (@Pankajamunde) 9 July 2016 Of course you must attend WLS 2016. As a senior Minister you would be representing 'The Government of Maharashtra'. https://t.co/czMYpLepMA — Devendra Fadnavis (@Dev_Fadnavis) 9 July 2016