calamity
-
మంగోలియాలో చలి పులి పంజా
ప్రకృతి వైపరీత్యం ‘జడ్’మంగోలియాను ముంచెత్తుతోంది. అతి శీతల చలికాలంతో మంగోలియా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రకృతి ప్రకోపం వల్ల ఇక్కడ కనీసం పచ్చగడ్డి కూడా మొలవకపోవడంతో లక్షల సంఖ్యలో పశువులు మృత్యువాత పడుతున్నాయి. అయితే.. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్.. ఇప్పుడు తరచూ వస్తుండటంతో మంగోలియా ప్రజల ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయి.తూర్పు ఆసియా దేశమైన మంగోలియాలో తీవ్ర అనావృష్టి తరవాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని జడ్ అంటారు. ఈ వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే. జడ్ వల్ల ఈ ఏడాది ఒక్క ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరింది. వాటిలో 80 శాతాన్ని, అంటే 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటు వ్యాధులు ప్రబలుతాయని మంగోలియా ప్రభుత్వం పశువులను పాతిపెట్టింది. దేశంలో జడ్ వల్ల మున్ముందు మొత్తం కోటీ 49 లక్షల జీవాలు చనిపోవచ్చునని, ఇది మంగోలియా పశుసంపదలో 24 శాతానికి సమానమని ఉప ప్రధాని ఎస్.అమార్ సైఖాన్ చెప్పారు. మంగోలియా జనాభా 33 లక్షలైతే వారికి 6.5 కోట్ల పశువులు, యాక్లు, గొర్రెలు, మేకలు, గుర్రాలు ఉన్నాయి. వీటిని జాతీయ సంపదగా ఆ దేశ రాజ్యాంగం ప్రకటించింది. మంగోలియా ఎగుమతుల్లో గనుల నుంచి తవ్వి తీసిన ఖనిజాల తరవాత మాంసం, ఇతర జంతు ఉత్పత్తులదే రెండో స్థానం. వ్యవసాయంలో 80 శాతం వాటా పశుపాలన, మేకలు, గొర్రెల పెంపకానిదే. దీనివల్ల మంగోలియా జీడీపీలో 11 శాతం లభిస్తోంది.ప్రసుత్తం జడ్ వల్ల మంగోలియా ఆర్థికవ్యవస్థ అస్థిరతకు లోనవుతోంది. ప్రధాన వృత్తి అయిన పశుపాలన దెబ్బతినడంతో ప్రజలు దేశ రాజధాని ఉలాన్ బటోర్కు, ఇతర పట్టణాలకు వలస పోతున్నారు. కానీ, అక్కడ వారందరికీ సరిపడా పనులు లేవు. గతంలో దశాబ్దానికి ఒకసారి వచ్చిన జడ్ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మరింత తరచుగా వచ్చిపడుతోంది.ప్రస్తుత జడ్ గడచిన పదేళ్లలో ఆరోది, మహా తీవ్రమైనది. జనానికి తీవ్ర ఆహార కొరత ఎదురవుతోంది. మంగోలియాను ఆదుకోవడానికి 60 లక్షల డాలర్ల విరాళాలను సేకరించాలని అంతర్జాతీయ సంస్థలు తలపెట్టినా మార్చి మధ్యనాటికి అందులో 20 శాతాన్ని కూడా సేకరించలేకపోయాయి. ఉక్రెయిన్, గాజా యుద్ధాలపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. -
వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి
దొడ్డబళ్లాపురం: దేశంలో 2024 ఉగాది నాటికి ఫెర దుర్ఘటన జరుగుతుందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. విపత్తుల గురించి ఆయన తరచ జోస్యాలు చెప్పడం తెలిసిందే. ఆదివారంనాడు హాసన్ జిల్లా అరసికెరె తాలకా హారనహళ్లిలోని కోడిమఠంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచానికి మూడు గండాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు దేశాలు కనుమరుగవుతాయని, జనం అకాల మృత్యువాత పడతారని చెప్పారు. 2024 ఉగాదిలోపు ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు గండం ఉందని, పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండాలను తప్పించవచ్చన్నారు. ఆ గండాలేమిటో కాలం వచ్చినప్పుడు చెబుతానన్నారు. భారీవర్షాలు కురిసి పట్టణాలకు, నగరాలకు అపాయం ఉందన్నారు. పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలుతాయన్నారు. అందరూ ఆధ్యాతి్మక చింతన అలవరచుకోవాలన్నారు. -
తీవ్ర ప్రకృతి విపత్తు రాష్ట్రం: జయలలిత
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడును కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రకృతి విపత్తు రాష్ట్రంగా ప్రకటించిందని ముఖ్యమంత్రి జయలలిత గురువారం వెల్లడించారు. తమిళనాడులోని అనేక జిల్లాలు ఇటీవలి భారీ వర్షాలకు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, అలాగే చెన్నై నగరం వరద ముంపునకు గురైందని ఆమె చెప్పారు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని, దానికి స్పందించిన కేంద్ర ప్రభుత్వం తమిళనాడును తీవ్ర ప్రకృతి విపత్తు రాష్ట్రంగా ప్రకటించిందని ఆమె చెప్పారు. -
ఏపీకి మళ్లీ ఉపద్రవం రాబోతోంది: బొత్స
గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులు, మహిళలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు మళ్లీ అలాంటి ఉపద్రవమే రాబోతోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించడానికే తాము నందిగామ ఉప ఎన్నికల్లో పోటీకి తలపడుతున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు మాటలకు, ఆయన మంత్రులు చెప్పే మాటలకు పొంతన ఉండట్లేదని మండిపడ్డారు. రాజధాని ఎక్కడైనా తమకు ఫర్వాలేదు గానీ, దాన్ని ప్రకటించిన తీరు మాత్రం బాగోలేదని ఆయన అన్నారు. రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దురదృష్టకరమని బొత్స సత్యనారాయణ విమర్శించారు.