అమెజాన్ నుంచి బిజినెస్ ఈమెయిల్ సర్వీసులు
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌కి దీటుగా కార్పొరేట్ వర్గాలకు క్లౌడ్ ఆధారిత ఈమెయిల్, క్యాలెండర్ సేవలు అందించనున్నట్లు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తెలిపింది. వర్క్మెయిల్ పేరిట తమ వెబ్ సర్వీసెస్ వ్యాపార విభాగం ద్వారా వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది. ప్రతి యూజర్‌కి 50 గిగాబైట్ల మెయిల్‌బాక్స్ స్టోరేజి ఉంటుందని, ఇందుకు గాను ఒక్కో యూజర్‌కి నెలకు 4 డాలర్ల చొప్పున చార్జీ ఉంటుందని అమెజాన్ వివరించింది. ఈ సర్వీసు మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్‌తో కూడా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.