మనమే కాదు.. గుండె కూడా జారిపోద్ది..
వాటర్ స్లైడ్.. నీటిపై జర్రున జారిపోతుంటే.. సూపర్‌గా ఉంటుంది కదూ.. అయితే.. వచ్చే ఏడాది అమెరికాలోని మిస్సోరీలో ప్రారంభమయ్యే ఈ స్కై కాలిబర్ వాటర్స్లైడ్లో జారితే.. మనతోపాటు మన గుండె కూడా జారిపోతున్నట్లు అనిపిస్తుంది.
ఎందుకంటే.. 90 అడుగుల ఎత్తు నుంచి నిట్టనిలువుగా జారడం.. అదీ గంటకు 80.5 కిలోమీటర్ల వేగంతో అంటే మాటలు కాదు మరీ.. ఆ వెంటనే 30 అడుగుల ఎత్తుకు మళ్లీ వెళ్లి.. పల్టీ కొట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఇది ప్రారంభమైతే.. మొదటి రోజే మూడు గిన్నిస్ రికార్డులు బద్దలవుతాయని స్కై కాలిబర్ సృష్టికర్త లాన్స్ ఫిషర్ చెప్పారు.
తొలి నిట్టనిలువు వాటర్స్లైడ్తోపాటు అత్యంత ఎత్తై(30 అడుగులు) నిట్టనిలువు పల్టీ, అత్యంత వేగవంతమైన వాటర్స్లైడ్గా ఇది ప్రపంచ రికార్డు సృష్టించనుందని తెలిపారు.