Cancel large banknotes
-
క్యాష్‌లెస్ కష్టాలు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఐదు నెలలు దాటినా నగదు కొరత కష్టాలు తీరలేదు. అదీగాక గత రెండు నెలలుగా నగదు కొరత మరింత ఎక్కువైనట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ‘గత రెండు నెలలుగా పరిస్థితి మరింత దిగజారింది. గత వారంలో హైదరాబాద్‌లోని ఏటీఎంల చుట్టూ తిరిగిన 83 శాతం మంది నోటు కళ్లజూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని పుణేలో కూడా 69 శాతం మందిది ఇదే పరిస్థితి’ అని లోకల్ సర్కిల్స్ సిటిజెన్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫాం జరిపిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 11 నగరాల్లో.. సుమారు 10 వేల మందిపై ఈ సంస్థ సర్వే జరిపింది. ఏటీఎంలతో హైదరాబాద్‌వాసులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సర్వేలో తేలింది. బ్యాంకులు 4 నగదు ఉపసంహరణల తర్వాత చార్జీలు విధిస్తున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బును డ్రా చేస్తున్నట్లు చాలా మంది తెలిపారు. ఇక ఢిల్లీలో 11% మంది ఇబ్బందులు ఎదుర్కొనట్లు సర్వేలో వెల్లడైంది. -
సమాజంలో మార్పు తెచ్చే నాయకత్వం అవసరం
లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ సీతంపేట (విశాఖ ఉత్తర): మూడేళ్ల పాలన ముగిసినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని, దీనిపై ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్ద నోట్లు రద్దు చేసినా దేశంలో ఎక్కడా అవినీతి తగ్గలేదని, మరింత పెరిగిందన్నారు. కనీసం వెయ్యిమంది అవినీతి అధికారులనైనా ఇంటికి పంపించాలని, ఆ అధికారం ప్రధానికి ఉందన్నారు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు ఆ పని చేయాలన్నారు. అపుడే లంచం తీసుకోవడానికి భయపడే వ్యవస్థ వస్తుందన్నారు. సమాజం మార్పు కోసం పనిచేసే నాయకత్వం రావాలన్నారు. సంప్రదాయ రాజకీయాల నుంచి ప్రజల వైపు గొంతువిప్పే నాయకులు పార్టీలోకి రావాలన్నారు. ఒక్క ఎమ్మెల్సీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంత కష్టపడటం అవసరమా అని ప్రశ్నించారు. విలాసాలు, దుబారా వల్లే ఆర్థిక సంక్షోభం రాష్ట్రంలో విలాసాలు, దుబారా వ్యయం వల్ల ఆర్థిక సంక్షోభం మరింత పెరిగిందన్నారు. ఉపాధి అవకాశాలు పొందేలా నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేలా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ యార్డులు చొరవ చూపాలన్నారు. దేశంలో ఆరోగ్యం కోసం కేటాయిస్తున్న నిధులను రెట్టింపు చేయాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పాత్రికేయుడు వి.వి.రమణమూర్తికి మద్దతు తెలిపారు. మొదటి ప్రాధాన్య ఓటు వేయాలని కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, నాయకులు నాయుడు వేణుగోపాల్, రావెల ఝాన్సీ, ఎం.ఎస్.ఎం మూర్తి, రాజవర్మ, రామానాయుడు,వడ్డి హరిగణేష్, ఎమ్మెల్సీ అభ్యర్థి వి.వి.రమణమూర్తి పాల్గొన్నారు. -
జనంలోకి ఎలా?
నోట్ల కష్టాలపై టీడీపీలో గుబులు జనం నుంచి వ్యతిరేకత వస్తుందని అధికార నేతల భావన జన్మభూమిలో సెగ తప్పదని కలవరం టీడీపీకి ‘నోట్ల’గుబులు పట్టుకుంది. తన సలహాతోనే ప్రధాని మోదీ పెద్ద నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్నార’ని మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే ప్రకటించుకోవడం ఇప్పుడా పార్టీ వర్గాలను ఇరకాటంలోకి నెట్టింది. నోట్ల రద్దు తర్వాత నగదు కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు పార్టీపై ప్రభావాన్ని చూపుతాయని జిల్లా నాయకులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్నాళ్లు ఈ కష్టాలుంటాయని ఆర్థిక రంగ నిపుణులంటుండటంతో మరింత కంగారు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 2నుంచి జన్మభూమిలో జనానికి ఏ సమాధానం చెప్పాలని వీరంతా మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షి: నోట్ల రద్దు నిర్ణయం సత్ఫలితాలనిస్తుందని భావించిన టీడీపీ నాయకులంతా ఇప్పుడు నీరుగారిపోతున్నారు. వారిలో నమ్మకం సడలిపోతోంది. పైగా జనం రోజూ ఏటీఎంలు..బ్యాంకుల చుట్టూ తిరుగుతూ అవస్థలు పడుతున్నారు. వీరిలో ఎవరిని కదిపినా ఈ నిర్ణయంపై ఆగ్రహోదగ్రులవుతున్నారు. దీంతో ఇది కాస్తా తమకు శాపంగా మారుతుందని అధికార పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొందని జిల్లాలో టీడీపీ అత్యున్నత వర్గాలు నిర్వహించిన ఓ సర్వేలో తేలిందని విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ పార్టీ అధిష్టానం రద్దుపై స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడంతో జిల్లా తెలుగు తమ్ముళ్లు దిగాలు పడుతున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని..రద్దు నిర్ణయాన్ని సమర్థించిన తరువాత ఇంకా దిగజారిందని ఆ పార్టీ నాయకులు ప్రైవేటు సంభాషణల్లో అనుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఘోరంగా ఉందని టీడీపీ నుంచి టికెట్ ఆశించే ఓ ప్రొఫెసర్ జిల్లా పరిస్థితిపై నివేదిక పంపినట్లు సమాచారం. రైతులు, రైతు కూలీలు, చిన్న కార్మికులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తన నివేదికలో పొందుపరిచారు. చాలామంది వృద్ధులు, వికలాంగులు, రిటైర్డ్ ఉద్యోగులు పింఛన్లను ఇప్పటివరకు డ్రా చేసుకోలేదని వారిలో రద్దు నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 2నుంచి జన్మభూమి నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీంతో జనంలోకి వెళ్లి ఏమని చెప్పాలి.. ఎలా ముఖం చూపాలని కిందిస్థాయిలో నేతలంతా కలవరపడుతున్నారు. నోట్ల కష్టాలపై జనం కచ్చితంగా నిలదీస్తారని వీరంతా భయపడుతున్నట్లు తెలిసింది. తిరుపతి, చిత్తూరు రైతుబజార్లలో స్వైపింగ్ మిషన్లను నిర్భందంగా అమలు చేయాలని ప్రభుత్వం భావించడంతో రైతులు ఎదురుతిరిగారని కొందరు అధికార పార్టీ నాయకులంటున్నారు. మోదీ నిర్ణయాన్ని తన నిర్ణయంగా చంద్రబాబు ప్రకటించుకోవడంతో ఓ టీడీపీ ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. తిరుపతి కార్పొరేషను ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఇలాంటి వేదికల్లో పట్టణ ఓటర్లు స్పందిస్తే తమ గతేమిటి అంటూ ఆయన వ్యాఖ్యానించినట్లు భోగట్టా.