తోటపల్లి రిజర్వాయర్ టెండర్ రద్దు
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం, తోటపల్లి గ్రామం వద్ద నిర్మించదలచిన ఓగులాపూర్ రిజర్వాయర్ పనుల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రిజర్వాయర్‌కు అనుబంధంగా ఉన్న మోహిడి మేడువాగు, ఎల్లమ్మ వాగు పనులను సైతం నిలిపివేయాలని నిర్ణయించి గురువారం నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు.
అంచనా వ్యయానికి 18 శాతం తక్కువకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు చేసేందుకు నిరాకరించడంతో ఏడేళ్లుగా పని ముందుకు కదల్లేదు. టెండర్‌ను రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వరద కాల్వ చీఫ్ ఇంజనీర్ ప్రభుత్వానికి విన్నవించగా, ప్రభుత్వం సమ్మతించింది.