cancell
-
92 ఎయిరిండియా విమానాలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా వివిధ మార్గాల్లో విమానాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా పరిమిత కార్యకలాపాలు, కఠిన క్వారంటైన్ నిబంధనల ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మే 28 - 31తేదీల మధ్య నడవాల్సిన 92 విమానాలను రద్దు చేసింది. దీంతోపాటు ప్రధాన విమానాశ్రయాల్లో స్లాట్లు అందుబాటులో లేవని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు. ఢిల్లీ-కోల్‌కతా, చెన్నై-ఢిల్లీ, హైదరాబాద్-బెంగళూరు, కోల్‌కతా-గౌహతి, చెన్నై-బెంగళూరు,ఢిల్లీ-హైదరాబాద్, చెన్నై-ముంబై, ముంబై-భోపాల్, కోల్‌కతా-దిబ్రుగర్, కోల్‌కతా-అజ్వాల్, కోల్‌కతా- అగర్తలా, ముంబై-ఢిల్లీ, ముంబై-అహ్మదాబాద్ తదితర మార్గాల మధ్య నడిచే విమానాలు రద్దు చేసిన వాటిల్లో ఉన్నాయి. (గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : జూలై 6 నుంచి ఆఫీసు) రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి టికెట్లను ఇప్పటికే కొనుగోలు చేసినవారు 2020 ఆగస్టు 24 వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందుబాటులో ఉన్న విమానాలలో బుక్ చేసుకోవడానికి అనుమతి వుంటుందని ఎయిరిండియా ట్విటర్ ద్వారా వెల్లడించింది. అలాగే రూటు మార్పునకు కూడా అనుమతి వుంటుందని , ఛార్జీలలో వ్యత్యాసం తప్ప, దీనికి సంబంధించిన చార్జీలను రద్దు చేసినట్టు తెలిపింది. (42 మందికి కరోనా : నోకియా ప్లాంట్ మూత) #FlyAI : Important update If you are holding AI confirmed tickets with travel dates during i.e 23.03.2020 to 31.05. 2020 and have had their flight cancelled will be allowed to book in available flights for the period 25th May 2020 till 24 August 2020 at no extra charge. (1/2) — Air India (@airindiain) May 26, 2020 -
55 వేల షెల్ కంపెనీలు రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు జరిపుతున్న డొల్లపై కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. రెండో దఫా ఏరివేతలో భాగంగా 55 వేల షెల్ కంపెనీలను ముసుగు కంపెనీలు) రద్దు చేసినట్టు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఇదే క్రమంలో విచారణలో ఉన్న మరిన్ని కంపెనీలపైనా నిర్ణయం తీసుకుంటామని కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి పి.పి.చౌదరి వెల్లడించారు. మొదటి విడతలో 2015-17 మధ్య రెండేళ్ల కాలంలో 2.26 లక్షల షెల్ కంపెనీల్ని రద్దు చేసిన కేంద్రం తాజాగా మరో 55 వేల షెల్ కంపెనీలపై వేటు వేసింది. రెండవ దశలో ఇప్పటికే 55 వేల కంపెనీల నమోదును రద్దు చేశామని, అనేక కంపెనీలు దర్యాప్తులో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లుగా పైనాన్షియల్ స్టేట్ మెంట్స్ గానీ వార్షిక నివేదికలు గానీ సమర్పించని 2.26 లక్షల కంపెనీలను రద్దు చేశారు. అవి పని చేయని కంపెనీలే కాదు.. ఒకే గదిలో, ఒకే చిరునామాపై అనేక కంపెనీలు రిజిస్టరై ఉన్నట్టు గుర్తించారు. అలాంటివాటిలో 400 పైగా బోగస్ కంపెనీలు ఉన్నాయని మంత్రి చెప్పారు. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్, డ్రగ్ ఫండింగ్.. ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానించిన ప్రభుత్వం.. షెల్ కంపెనీలకు షాకిచ్చింది. ఇందుకోసం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ), ఇతర పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగినట్టు తెలిపారు. -
దిగ్విజయ్ పర్యటన రద్దు!
- అత్యవసర పనులతో తెలంగాణ పర్యటనను రద్దుచేసుకున్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి - అగ్రనేత రాక వాయిదాతో కాగ్రెస్ లోకి జగ్గారెడ్డి చేరిక ఆలస్యం! హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పర్యటన రద్దయినట్లు తెలిసింది. సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకోవాల్సిన ఆయన అత్యవసర పనుల నిమిత్తం రాలేకపోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఆయన తదుపరి పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయంపై కాంగ్రెస్ వర్గాలు సమాచారం ఇవ్వలేదు. కాగా, డిగ్గీ పర్యటన రద్దుతో మెదక్ జిల్లా నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేరిక సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్‌లోకి తిరిగి చేరనున్న సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకున్న జగ్గారెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది. డిగ్గీ లేకుండానే టీపీసీసీ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారా, దిగ్విజయ్ తదుపరి పర్యటన వరకు వేచిచూస్తారా లేక డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లి అక్కడే పార్టీలో చేరతారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎమ్మెల్సీగా బరిలోకి..! త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్నా... ఎక్కువ మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగ్గారెడ్డిని బరిలోకి దింపితే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. -
రంగుల్లో ‘పింఛన్లు’
సెప్టెంబర్‌లో పెన్షన్లన్నీ రద్దు.. కొత్తగా అక్టోబర్‌లో మంజూరు సాక్షి, హైదరాబాద్: అర్హులకు మాత్రమే సామాజిక పింఛన్లు అందేలా చూడాలన్న లక్ష్యంతో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న అన్ని రకాల సామాజిక భద్రతా పింఛన్లను సెప్టెం బర్లో రద్దు చేయాలని నిర్ణయించింది. వృద్ధాప్య, వితంతు, చేనేత, గీత కార్మికులు, అంగవైకల్యం కేటగిరీల కింద మొత్తం 30.87 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. అయితే ఇందులో ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికిపైగా పెన్షన్లు పొందుతున్నట్లు సర్వే ల్లో వెల్లడికావడంతో వీటన్నింటినీ రద్దు చేసి కొత్తగా పెన్షన్లు మంజూరు చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయడం కోసం వారం పది రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. నూతన రాష్ట్రంలో తీసుకొస్తున్న ఈ పథకానికి కొత్త పేరు పెట్టాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పథకం పేరును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. పారదర్శకంగా ఎంపిక... పింఛన్లు పొందడానికి అర్హులైనవారిని ఎంపిక చేసే సమయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. లబ్ధిదారులను ఎంపిక చేసేటప్పుడు ముగ్గురు అధికారులు తనిఖీ చేస్తారని, అయినా బోగస్ పెన్షన్లు వస్తే.. ఆ ముగ్గురు అధికారులను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వం మార్గదర్శకాల్లోనే స్పష్టం చేయనుంది. కొత్త పెన్షన్ కార్డులను అక్టోబర్‌లో మంజూరు చేస్తారు. పెన్షన్ల కోసం ఎంపికైన లబ్ధిదారుల పేర్లను గ్రామసభల్లో చదివి వినిపిస్తారని, అనంతరం ఆయా గ్రామ సర్పంచ్ల చేతుల మీదుగా కొత్త కార్డులను పించనుదారులకు ఇప్పిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే వృద్ధాప్య పింఛనుదారుల వయసు నిర్ధారణకు డాక్టర్లు ఇచ్చే సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబోరని, వారి ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌కార్డుల్లో ఉన్న వయసును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారని వెల్లడించాయి. కాగా, కొత్తగా ఇచ్చే పెన్షన్లను వారం రోజులపాటు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం పింఛనుదారులకు ఏడు వేర్వేరు రంగుల్లో ఉండే కార్డులను మంజూరు చేసి, వారంలో ఒక్కోరోజు ఒక్కో రంగు కార్డువారికి పింఛను అందజేస్తారు. దీనివల్ల గ్రామాల్లో ఎక్కడా పించన్ల కోసం తొక్కిసలాట జరగదని, అంతేకాకుండా వచ్చిన వారందరికీ పెన్షన్ అందేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారవర్గాలు వివరించాయి. ఇవీ నిబంధనలు... కొత్త పెన్షన్లకు ప్రభుత్వం పలు నిబంధనలు విధించనుంది. పించనుదారుల పిల్లలు ప్రభుత్వ లేదా ప్రైవేటుగా ఏ ఉద్యోగం చేస్తున్నా, ట్యాక్సీ వంటి వాహనాలు నడుపుతున్నా పెన్షన్ ఇవ్వరు. అలాగే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురికి పించను ఇచ్చే విధానానికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆధార్‌కార్డును అనుసంధానం చేయడంతోపాటు చేతివేలి గుర్తులను తీసుకుంటారు. వృద్ధుల చేతివేలి గుర్తులు పడని పక్షంలో కళ్ల ఐరిస్ తీసుకోనున్నారు. 65 సంవత్సరాల వయసు దాటినవారికి మాత్రమే పెన్షన్లు మంజూరు చేయనున్నారు. కేంద్రం 60 ఏళ్ల వయసున్నవారికి వృద్ధాప్య పించన్లు అమలు చేయాలంటున్నా.. తెలంగాణలో భారీస్థాయిలో పెన్షన్లు ఇస్తున్నందున అది సాధ్యం కాదని అధికారులు తేల్చారు. జనాభా లెక్కల ప్రకారం మండలాల్లో ఉన్న వృద్ధుల సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తే.. కంప్యూటర్ ఆ పేర్ల నమోదుకు అంగీకరించకుండా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నారు. కాగా, ఇకపై పించన్లను పోస్టాఫీసుల్లో లేదా అల్ట్రాబ్యాంకుల్లో, కస్టమర్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.